Skip to main content

బంగారంపై ఋణం

బంగారంపై ఋణం అంటే ఏమిటి?

గోల్డ్ లోన్ అనేది (దీనినే బంగారంపై ఋణం అంటారు) ఋణం కావాల్సిన వారు తమవద్ద ఉన్న బంగారు ఆభరణాలను (18-24 క్యారెట్ల పరిధిలోనివి) పూచీకత్తుగా తాకట్టు పెట్టి ఒక ఋణసంస్థ నుండి పొందే సెక్యూర్డ్ ఋణం. అందించబడే ఋణ మొత్తం, ప్రస్తుత మార్కెట్ విలువ మరియు బంగారం యొక్క నాణ్యతపై ఆధారపడి బంగారంలో కొంత శాతంగా, అంటే సాధారణంగా 80% వరకు ఉంటుంది.

Return to top

బంగారంపై ఋణం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

అది అంతర్జాతీయ విద్యకైనా, వివాహ ఖర్చులకైనా, మెడికల్ అత్యవసర పరిస్థితులను కవర్ చేయడానికి లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత ఉపయోగం కొరకైనా మీకున్న తక్షణ ఆర్ధిక అవసరాలను తీర్చడంలో పర్సనల్ లోన్ వంటిదే బంగారంపై ఋణం కూడా.

  • సత్వర వితరణ - బంగారంపై ఋణం అంటే సెక్యూర్డ్ ఋణం కావున డాక్యుమెంటేషన్ ఎంత తక్కువగా ఉంటే బంగారంపై ఋణం ప్రాసెసింగ్ అంత వేగవంతం అవుతుంది.
  • ఉపయోగించడంలో ఉండే అనుకూలత - మీరు నిధులు ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై పర్యవేక్షణ ఏదీ లేకపోవడం వలన, ఈ ఋణాన్ని ఏ రకమైన ఉపయోగానికైనా ఉపయోగించే వెసులుబాటును కలిగిస్తుంది.
  • సెక్యూర్డ్ రకపు ఋణం: ఋణమిచ్చే సంస్థకు మీరు తాకట్టు పెడుతున్న నగలు తప్ప మరే ఇతర తాకట్టు/పూచీకత్తును సమర్పించాల్సిన అవసరం లేదు.
  • స్వల్ప వడ్డీ రేటు: వ్యక్తిగత ఋణాలతో పోలిస్తే, బంగారు ఋణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి ఎందుకంటే వీటిలో బంగారం పూచీకత్తుగా పరిగణించబడుతుంది.
  • మీ నిరర్ధక ఆస్థిని ద్రవ్య రూపంలోనికి మార్చుకోవడం:నిరర్ధక ఆస్థి అయిన బంగారం తరచూ డబ్బును ఏర్పరిచే సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఆర్ధిక అవసరతల కొరకు మీకు డబ్బు అవసరమైనప్పుడు మూలధనాన్ని సమకూర్చుకోవడానికి బంగారు ఋణం చక్కటి పరిష్కారం. ఇది మీ ఇంట్లో కంటే బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థల లాకర్లలో ఉంటేనే మరింత సురక్షితంగా ఉంటుంది.

Return to top

సాధారణ వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ ఫీజులు ఎలా ఉంటాయి?

బంగారు ఋణాలపై వడ్డీ ఒక సంస్థ నుండి మరో సంస్థకు మారుతూ 9.24% నుండి 17% మధ్యలో ఉంటుంది. కొన్ని ఋణసంస్థలైతే పొందే ఋణ మొత్తంపై 1-3% మధ్య నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజును కూడా విధిస్తాయి. ఋణాన్ని పొందటానికి ముందే ఋణమిచ్చే సంస్థ నుండి వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు, లేట్ పేమెంట్ ఛార్జీలు మరియు ప్రీపేమెంట్ ఛార్జీల గురించి తెలుసుకోవడం మంచిది.

ఆఫర్లను పరిశీలించి, పోల్చిచూసి మీ ఋణం కొరకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Return to top

లోన్ అప్లికేషన్ను ప్రాసెస్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

బంగారంపై ఋణం పొందటానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు ఒక సంస్థ నుండి మరో సంస్థకు భిన్నంగా ఉంటాయి. అయితే, సాధారణంగా అవసరమయ్యే డాక్యుమెంట్ల జాబితా ఇలా ఉంటుంది: పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడెంటిటీ ప్రూఫ్ (PAN కార్డ్, వోటర్ ఐడి, ఆధార్ కార్డ్ మొదలైనవి) మరియు అడ్రస్ ప్రూఫ్ (పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు మొదలైనవి.).

Return to top

నేను ఋణాన్ని ముందుగానే తీర్చివేయవచ్చా? ముందుగానే తీర్చివేస్తే అందుకు ఛార్జీలేవైనా ఉంటాయా?

ఉంటాయి, మీరు ఎప్పుడు కావాలనుకున్నా మీ ఋణాన్ని ముందుగా తీర్చివేయవచ్చు. అధిక శాతం ఋణసంస్థలు బంగారు ఋణాలపై ఫోర్క్లోజర్ ఛార్జీలను విధించవు, కానీ కొన్ని ఋణసంస్థలు మాత్రం అసలు మొత్తంపై 2-4% వరకు ఛార్జీలు విధిస్తాయి. గడువుకు ముందుగానే తీర్చివేయడానికి వారు అనుసరించే విధానాన్ని తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ఋణసంస్థను సంప్రదించవచ్చు.

Return to top

నేను ఏయే వ్యవధులకు ఋణాన్ని పొందవచ్చు?

బంగారు ఋణాలనేవి స్వల్ప కాలిక ఋణాలు, ఇవి ఋణమిస్తున్న సంస్థపై ఆధారపడి 1 నెల నుండి 5 సంవత్సరాల వరకు అనుకూల గడువు వ్యవధులను కలిగి ఉంటాయి.

Return to top

మీరు దేని కోసం చూడాలి?

బంగారు ఋణాలనేవి బంగారాన్ని సెక్యూరిటీగా తీసుకుని ఇచ్చే సెక్యూర్డ్ ఋణాలు కావున, మీరు లోన్ తిరిగి చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మరియు మీకు నిజంగా అవసరమై, ఇబ్బంది పడకుండా తీర్చివేయగలరు అనుకున్నంత వరకే ఋణమొత్తాన్ని పొందాలి. లోన్ కట్టకుండా ఎగవేయడం మీ భవిష్యత్తు ఋణ అప్లికేషన్ రద్దు కావడంతో సహా మీ క్రెడిట్ స్కోర్ మరియు రిపోర్ట్పై తీవ్ర ప్రభావం చూపవచ్చు.

మీ ఋణ అర్హతను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి, దీని ఆధారంగా మీరు అవగాహనతో కూడిన నిర్ణయాన్ని తీసుకోవచ్చు.

Return to top

గడువు తేదీలోగా నేను నా బకాయిని తీర్చలేకపోతే ఏమి జరుగుతుంది?

ఎగవేసే వినియోగదారులపై తీసుకునే చర్యలు ఋణ సంస్థల మధ్య భిన్నంగా ఉంటాయి. కొన్ని ఋణ సంస్థలు బకాయిపడ్డ వ్యవధికి వడ్డీ ఛార్జీ విధిస్తాయి, ఇది వినియోగదారులు ఋణం కొరకు సాధారణంగా చెల్లించే వడ్డీ రేటుకంటే అధికంగా ఉంటుంది. లోన్ పేమెంట్ను ఎగవేస్తే ఇంకా మీరు ఏ సమయం లోపు మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలో తెలియజేస్తూ ఒక నోటీసు అందుకుంటారు. ఆఖరి నోటీస్ తేదీకి ఋణాన్ని చెల్లించకపోతే, ఋణ సంస్థలు బంగారు ఆభరణాలను వేలం వేసి బకాయి ఉన్న మొత్తాన్ని రాబట్టుకునే అవకాశం కూడా ఉంది.

Return to top