CIBIL ర్యాంక్ అంటే ఏమిటి?
మీ CCR ను ఒక సంఖ్యా రూపంలోనికి సంగ్రహపరిచే కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ (CCR) నుండి CIBIL ర్యాంకు ఉత్పాదించబడుతుంది. ఇందులో సాధించగలిగే అత్యుత్తమ ర్యాంకుగా 10 ఉంటూ ఇది 1 నుండి 1 స్కేలు మధ్యలో అందించబడుతుంది. ఇప్పుడు ఈ ర్యాంకు ప్రస్తుత క్రెడిట్ ఎక్స్పోజర్ రూ. 50 కోట్ల వరకు కలిగి ఉన్న సంస్థలకు మాత్రమే లభ్యమవుతుంది.
CIBIL ర్యాంక్ ఎలా లెక్కించబడుతుంది?
గతంలో తిరిగి చెల్లించిన ప్రవర్తన మరియు ఋణ వినియోగం అనేవే CIBIL ర్యాంకును లెక్కించడానికి ఉపయోగించే ప్రధాన పరామితులు.
CIBIL కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ (CCR) అంటే ఏమిటి?
CIBIL కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ అనేది వేర్వేరు క్రెడిట్ సంస్థల నుండి అందుకున్న సమాచారాల నుండి సంకలనం చేసిన మీ ఋణ చెల్లింపు చరిత్ర యొక్క వాస్తవ రికార్డు. ఋణమిచ్చే సంస్థలు అవగాహనతో కూడిన నిర్ణయాలను - వేగంగా మరియు విషయ ప్రధానంగా తీసుకొనేలా సహాయపడటమే CCR యొక్క ఉద్దేశం.
CIBIL ర్యాంక్ మరియు CCR ను ఎవరు పొందగలరు?
CIBIL సభ్యులలో ప్రధాన బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థలు ఉంటాయి, ఇవి రెసిప్రోసిటీ (ఇచ్చి పుచ్చుకునే) ఒప్పందం ఆధారంగా CIBIL నుండి సమాచారం పొందవచ్చు, అంటే CIBIL కు తమ వివరాలను సంపూర్తిగా అందించిన సంస్థలు మాత్రమే CIBIL క్రెడిట్ రిపోర్ట్లను పొందటానికి అనుమతించబడతాయి. సభ్యులు ఇక కేవలం విలువైన ఋణ నిర్ణయాలు తీసుకొంటే సరిపోతుంది. ఎవరైనా ఇతర వ్యక్తులకు లేదా సంస్థకు వెల్లడి చేయడం నిషిద్ధం. CIBIL సభ్యులకు CCR ను మాత్రమే యాక్సెస్ చేసే ఎంపిక కూడా ఉంటుంది. సంస్థలు నేరుగా CIBIL నుండే వారి CIBIL ర్యాంకు మరియు కంపెనీ క్రెడిట్ రిపోర్ట్లకు యాక్సెస్ను కోరవచ్చు. మీ దానిని ఇప్పుడే పొందండి
నా CCR కు CIBIL ర్యాంకు ఎందుకు లేదు?
ఇప్పుడు CIBIL ర్యాంకు కరంట్ క్రెడిట్ ఎక్స్పోజర్ రూ. 50 కోట్ల వరకు కలిగి ఉన్న సంస్థలకు లభ్యమవుతుంది. CIBIL ర్యాంకు లేకపోవడం అనేది ప్రతికూలాంశమేమీ కాదనే విషయాన్ని దయచేసి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ CIBIL కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ (CCR) ఆధారంగా మీ సంస్థ క్రెడిట్ ప్రదర్శనను మీరు మూల్యీకరించవచ్చు.
CIBIL ర్యాంకుకు, CIBIL స్కోరుకు మధ్య వ్యత్యాసం ఏమిటి?
CIBIL ర్యాంకుకు, క్రెడిట్ రేటింగ్కు మధ్య వ్యత్యాసం ఏమిటి?
క్రెడిట్ రేటింగ్లను వ్యాపారాలు వాటి గౌరవ పూచీకత్తుగా ఉపయోగించిన చరిత్ర ఉంది. క్రెడిట్ రేటింగ్లను సాధారణంగా రేటింగ్ పొందే సంస్థలు అభ్యర్ధిస్తాయి, ఆ తర్వాత క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు సంస్థ అందించిన డాక్యుమెంట్లను మూల్యీకరించి సంస్థ నిర్వాహకులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత విడుదల చేస్తాయి. CIBIL ర్యాంకు మరియు క్రెడిట్ రేటింగ్కు మధ్య ఉండే ప్రాధమిక వ్యత్యాసం ఏమిటంటే రేటింగ్ పొందే సంస్థ రేటింగ్ ఇచ్చే సంస్థకు అందించే సమాచారంతో పోల్చినప్పుడు ర్యాంకు అనేది ఋణ సంస్థల (CCR) నుండి పొందే విషయ సమాచారం నుండి ఉత్పాదించబడుతుంది.
CCR పై సమాచారాన్ని నేనెలా పరిష్కరించుకోవాలి?
విధిగా నింపిన ఆన్లైన్ వివాద పత్రాన్ని సబ్మిట్ చేయటమే ఒక వివాదాన్ని సమర్పించడానికి సులభమైన మార్గం. ఒక ఆన్లైన్ వివాద అభ్యర్ధన చేయడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.