Skip to main content

క్రెడిట్ స్కోర్ మరియు లోన్ ఆమోదాలు

ఋణ ఆమోద ప్రక్రియను మీ క్రెడిట్ స్కోర్ ఎలా సుగమం చేస్తుందో అర్ధం చేసుకొనుట

ఋణం అంటే ఏమిటి?

ఒక నిర్ణీత కాల వ్యవధికి ఒక బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ నుండి అప్పుగా తీసుకునే మొత్తాన్ని ఋణం అంటారు. ఋణం అనేది ఖచ్చితంగా అప్పే, మరియు దీన్ని ఋణమిచ్చిన సంస్థకు వడ్డీతో సహా తిరిగి పూర్తిగా చెల్లించాలి.

నేడు, మన ఆర్ధిక విషయాలను నిర్వహించుకోవడంలో సహాయం చేస్తూ మన ఆర్ధిక మరియు సామాజిక జీవనంలో ఒక అంతర్లీనమైన పాత్రను పోషిస్తున్నాయి. అది ప్రణాళిక చేసుకున్న అంతర్జాతీయ విద్య కావచ్చు, ఒక కలల గృహం కావచ్చు, లేదా ఒక అత్యవసర నిధుల ఆవశ్యకత కావచ్చు, లేదా వ్యాపార విస్తరణ కావచ్చు, దానిని సాకారం చేసుకోవడానికి అత్యుత్తమ మార్గాలు ఋణాలే. అయితే, మీ లోన్ అప్లికేషన్ను మూల్యీకరించడానికి ఋణమిచ్చే సంస్థలు మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను పరిశీలిస్తారని తెలుసుకోవడం ముఖ్యం.

మీ స్కోర్ ఎంత అధికంగా ఉంటే మీరు ఋణం పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, గృహ ఋణం, వాహన ఋణం లేదా కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్, వంటి ఏ లోన్ అయినా మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్తో ఇప్పుడు మీ ఋణావశ్యకతను మరింత క్రమమైన విధానంలో ప్రణాళిక చేసుకోవచ్చు.

ఋణాలలోని రకాలు

సాధారణ ప్రశ్నలు

EMI అంటే ఏమిటి?

EMI అనేది సమానంగా విభజించబడ్డ నెలవారీ వాయిదా, బ్యాంకుకు లేదా ఋణమిచ్చిన సంస్థకు నెలవారీ చెల్లించాల్సిన మొత్తం. ఇందులో అసలు మొత్తం మరియు ఆ మొత్తంపై వడ్డీ, ఋణ వ్యవధిలోని నెలలకు సమానంగా విభజించబడి ఉంటుంది. ఈ EMI ని ఋణంగా తీసుకున్న మొత్తం అంతా తీరే వరకు నెలలోని ఒక నిర్ధారిత తేదీన చెల్లిస్తూ ఉంటారు. మీ EMI ని ముందుగానే లెక్కించుకోవడం, మీ బడ్జెట్ను ప్రణాళిక చేసుకోవడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ప్రతి నెలా ఎంత మొత్తం చెల్లించాలో మీరు ఖచ్చితమైన అవగాహన కలిగి ఉంటారు.

Return to top

అందుబాటులో ఉన్న వివిధ రకాల వడ్డీ రేట్లు ఏమిటి?

 

  1. స్థిర వడ్డీ రేటు:
    ఒక లోన్పై లేదా తనఖాపై స్థిర వడ్డీ రేటు అనేది ఋణ వ్యవధి అంతటిలో ముందుగానే నిర్ణయించిన వడ్డీ రేటు వద్ద స్థిరంగా ఉంటుంది. ఇది ఋణం తీసుకునేవారు వారి భవిష్యత్ పేమెంట్లను ప్రణాళిక చేసుకోవడానికి అవకాశం కలిగిస్తుంది. సాధారణంగా పర్సనల్ లోన్స్ మరియు క్రెడిట్ కార్డులు స్థిర వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి.
  2. ఫ్లోటింగ్ వడ్డీ రేటు:
    ఫ్లోటింగ్ వడ్డీ రేటు మార్కెట్తో లేదా సూచీతో పాటు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. ఫ్లోటింగ్ రేట్లు సాధారణంగా గృహ ఋణాలకు అందించబడతాయి; ఫ్లోటింగ్ రేటును లెక్కించడానికి ప్రైమ్ లెండింగ్ రేట్ లేదా బేస్ రేట్ను ఒక ప్రామాణికంగా ఉపయోగిస్తారు మరియు విధించబడే వడ్డీ రేటు అనేది ప్రైమ్ ఇంటరస్ట్ రేట్/బేస్ రేట్ మరియు కొంత నిర్దిష్ట అదనపు మొత్తం (క్రెడిట్ సంస్థచే విధింపబడినంత)గా ఉంటుంది.

Return to top

Document Checklist

DOCUMENTS REQUIREDPERSONAL LOANCREDIT CARDAUTO LOANHOME LOAN
Latest Credit Score & CIR*
Bank Statement
KYC docs (identity, signature & address proof)
Registration Papers   
Income Statement (such as salary slip)
Property Papers   
Last 3 years IT return ✓
(for self-employed only)
 ✓
(for self-employed only)
 

* This is an indicative list and may differ from lender to lender.

Loan Eligibility Calculator

Click here to check your loan eligibility and EMI calculator