Skip to main content

సరిపోల్చండి, ఎంచుకోండి మరియు దరఖాస్తు చేయండి

వ్యక్తిగత రుణాలు మరియు క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు.

అంతరాయం లేని అనుభవం.

ఇప్పటికే సభ్యుడు? ఇప్పుడు లాగిన్ అవ్వండి

ఆఫర్ల రకాలు మార్కెట్ ప్లేస్ రుణ ఉత్పత్తులను అందిస్తాయి

మీ అవసరాలకు తగినట్లుగా రుణ ఆఫర్లను అందుకోండి.

వ్యక్తిగత ఋణం: వ్యక్తిగత రుణం అనేది బ్యాంకులు/ఆర్థిక సంస్థలు మీకు అందించే చిన్న నుండి మధ్యకాలిక అసురక్షిత క్రెడిట్. ఈ రకమైన రుణం తప్పనిసరిగా అనేక రకాల ప్రయోజనాలను కలగజేసే రుణం, మీరు మీ తక్షణ అవసరాలను తీర్చుకోడానికి ఈ రుణాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

క్రెడిట్ కార్డ్: క్రెడిట్ కార్డ్ అనేది మీకు వచ్చే జీతం లేదా నెలవారీ ఆదాయానికి మించిన నగదు రహిత లావాదేవీలు చేయడంలో మీకు సహాయపడే ముందస్తుగా సెట్ చేయబడిన క్రెడిట్ పరిమితితో బ్యాంకులచే నిర్వహించబడే ఆర్థిక సాధనం. ఎలాంటి వస్తువులు అయినా మరియు సేవలను కొనుగోలు చేయడానికి అరువుగా తీసుకున్న డబ్బును ఉపయోగించుకునే సౌలభ్యాన్ని ఇది మీకు ఈ క్రెడిట్ కార్డు అందిస్తుంది, చివరికి మీరు ఎటువంటి వడ్డీ లేకుండానే సరైన తేదీలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వాహన ఋణం: ఆటో రుణాలు సురక్షిత రుణాలు, ఇందులో మీరు కొనుగోలు చేసిన వాహనాన్ని తాకట్టుగా ఉంచబడును. కొత్త కార్లు, వాడిన కార్లు, ద్విచక్ర వాహనాలు (సాధారణంగా ద్విచక్ర వాహన రుణం అని పిలుస్తారు) మరియు వాణిజ్య వాహనాల కోసం (సాధారణంగా వర్తక సంబంధమైన వాహన రుణం అంటారు) బ్యాంకులు/ఆర్థిక సంస్థలు దీనిని అందిస్తాయి. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గృహ ఋణం: గృహ రుణం అనేది మీరు ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దానిని తాకట్టుగా ఉంచడం వలన పొందే సురక్షిత రుణం. సకాలంలో వాయిదాల ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉండును. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ఆస్తి పేరు లేదా డీడ్‌ను వడ్డీతో సహా తిరిగి చెల్లించే వరకు ఆస్తి టైటిల్ లేదా ప్రమాణపత్రాన్ని కలిగి ఉంటుంది, ఆ తర్వాత ఆస్తి మీకు పేరున తిరిగి బదిలీ చేయబడుతుంది. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వ్యాపార ఋణం: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న ఏదైనా వ్యాపారాన్ని విస్తరించడానికి మూలధనాన్ని సమీకరించడంలో ఈ వ్యాపార రుణం సహాయపడుతుంది. భారతదేశంలోని బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్.బి.ఎఫ్.సి)లు విస్తరిస్తున్న సంస్థ తక్షణ అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి వ్యాపార రుణాలను అందిస్తాయి. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆస్తిపై ఋణం: ఆస్తిపై రుణం అంటే మీరు మీ ఆస్తి తనఖాపై బ్యాంకు నుండి పొందే రుణం. ఈ రకమైన రుణం సురక్షిత రుణం కేటగిరీ కిందకు వస్తుంది. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

* ఆఫర్‌లు వారి క్రెడిట్ పాలసీ ప్రకారం రుణదాతలు చేసే అవసరమైన డాక్యుమెంట్ చెక్ మరియు వెరిఫికేషన్‌పై కూడా ఆధారపడి ఉంటాయి.

తరచూ అడిగే ప్రశ్నలు:

1. ఆఫర్‌ల మార్కెట్‌ప్లేస్ అంటే ఏమిటి?

ఆఫర్‌ల మార్కెట్‌ప్లేస్ అనేది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్, ఇది మీ ఎంపిక కోసం మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ ఆధారంగా టైలర్-మేడ్ రుణం మరియు క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లను అందుబాటులో ఉంచుతుంది. దేశంలోని అగ్రశ్రేణి రుణదాతలతో రుణగ్రహీతలను కలిపే ఆన్‌లైన్ రుణాల మార్కెట్‌ప్లేస్. ఇక్కడ మీరు రుణదాత అర్హత ప్రమాణాల ఆధారంగా క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణం, గృహ రుణం మరియు ప్రాపర్టీపై రుణం కోరకు ఆఫర్‌లను పొందుతారు.

2. ఆఫర్‌ల మార్కెట్‌ప్లేస్‌ను ఎందుకు ఉపయోగించాలి?

ఆఫర్‌ల మార్కెట్‌ప్లేస్‌లో మీరు వడ్డీ రేట్లు, క్రెడిట్ పరిమితులు, వార్షిక రుసుములు మరియు ఆఫర్ ఇతర ఫీచర్‌లను సరిపోల్చవచ్చు మరియు పాల్గొనే బ్యాంక్/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌తో మీకు ఇష్టమైన రుణం లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు మీ రుణ ప్రయాణంలో ముందుకు సాగడానికి వివిధ ఆఫర్‌ల మధ్య రుణాన్ని ఎంచుకోవచ్చు.

3. నేను ఏ రకమైన రుణ ఆఫర్‌ల నుండి ఎంచుకోవచ్చు?

ప్రతిపాదనల మార్కెట్‌ప్లేస్‌తో, మీరు రుణదాత అర్హత ప్రమాణాల ఆధారంగా క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణం, గృహ రుణం మరియు ప్రాపర్టీపై రుణం వంటి ఏ రకమైన రుణపు ఐచ్ఛికల మధ్య అయినా ఎంచుకోవచ్చు...

4. నేను ఆఫర్‌ల మార్కెట్‌ప్లేస్‌లో క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చా?

అవును, ఆఫర్‌ల మార్కెట్‌ప్లేస్ క్రెడిట్ కార్డ్‌లతో సహా ఎంచుకోవడానికి బహుళ క్రెడిట్ ఆప్షన్‌లను అందిస్తుంది.

5. ప్రతిపాదనల మార్కెట్‌ప్లేస్‌లో ప్రతిపాదనలను ఎలా తనిఖీ చేయాలి?

మీరు మీ CIBIL స్కోర్ మరియు నివేదికను తనిఖీ చేయడానికి సైన్ అప్ చేసిన తర్వాత, మీరు డ్యాష్‌బోర్డ్‌లోని రుణ ప్రతిపాదనల విభాగానికి వెళ్ళవచ్చు. ఈ విభాగంలో, మీకు అందుబాటులో ఉన్న బహుళ క్రెడిట్ ఐచ్ఛిక నుండి ఎంచుకోవచ్చు. మీకు ప్రదర్శించబడే ఆఫర్‌లు మీ ఇటీవలి CIBIL స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి.

6. నా CIBIL స్కోర్ మరియు నివేదిక ఎందుకు ముఖ్యమైనవి?

లోన్ అప్లికేషన్ ప్రక్రియలో CIBIL స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. ఒక దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఫారం‌‌ను నింపి దానిని ఋణసంస్థకు అందించిన తర్వాత, ఋణసంస్థ మొదటగా ఆ దరఖాస్తుదారుని CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌‌ను పరిశీలిస్తుంది. CIBIL స్కోర్ తక్కువగా ఉంటే, ఋణమిచ్చే సంస్థ ఇక మీ అప్లికేషన్‌‌ను పరిగణించకపోవచ్చు మరియు దానిని ఆ క్షణంలోనే తిరస్కరించవచ్చు. CIBIL స్కోర్ అధికంగా ఉంటే, ఋణసంస్థ అప్లికేషన్‌‌ను పరిశీలించి దరఖాస్తుదారుడు ఋణం పొందటనికి అర్హులా కాదా అని నిర్ణయించడానికి ఇతర వివరాలను పరిగణలోనికి తీసుకుంటారు. CIBIL స్కోరు ఋణ సంస్థకు తొలి అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది, స్కోరు ఎంత ఎక్కువ ఉంటే, మీ లోన్ సమీక్షించబడి ఆమోదించబడే అవకాశాలు అంత అధికంగా ఉంటాయి. ఋణం ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా ఋణసంస్థపై ఆధారపడి ఉంటుంది, మీకు లోన్ / క్రెడిట్ కార్డ్ మంజూరు చేయాలా వద్దా అని CIBIL ఏ విధంగానూ నిర్ణయించదు.

7. నా CIBIL స్కోరును ఎలా మెరుగుపరచుకోగలను?

మీరు మంచి ఋణ చరిత్రను కలిగి ఉండటం ద్వారా CIBIL స్కోరును మెరుగుపరచుకోవచ్చు, ఇది ఋణాలిచ్చే సంస్థలు ఋణాలను ఆమోదించడానికి తప్పనిసరి. మీ స్కోరును మెరుగుపరచుకోవడానికి సహాయపడే ఈ 6 అంచెలను అనుసరించండి:

  • ఎల్లప్పుడూ మీ బకాయిలను సకాలంలో చెల్లించండి: ఋణాలిచ్చే సంస్థలు ఆలస్య చెల్లింపులను ప్రతికూలాంశంగా భావిస్తాయి.
  • మీ బ్యాలెన్సులు తక్కువగా కొనసాగించండి: ఎల్లప్పుడూ మితిమీరి క్రెడిట్‌‌ను వినియోగించకుండా, మీ క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించుకుంటూ వివేకంతో వ్యవహరించండి.
  • క్రొత్త ఋణాల కొరకు ఓ మోస్తరు సంఖ్యలో అప్లై చేయండి: మీరు ఎల్లప్పుడూ అధిక ఋణం కోసం ఎదురు చూస్తున్నారనే భావన కలిగించాలి అనుకోరు; క్రొత్త ఋణం కోసం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయండి.
  • మీ కో-సైన్డ్, గ్యారంటీడ్ మరియు జాయింట్ ఖాతాలను ప్రతినెలా పర్యవేక్షించుకోండి: కో-సైన్డ్, గ్యారంటీడ్ లేదా జాయింట్‌‌గా కలిగియున్న ఖాతాలకు, చెల్లించని పేమెంట్లకు మీరు సమాన బాధ్యత కలిగి ఉంటారు. మీ జాయింట్ హోల్డర్ (లేదా గ్యారంటీ పొందిన వ్యక్తి) నిర్లక్ష్యం మీ అవసరతలో మీరు ఋణం పొందే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.
  • సంవత్సరం పొడవునా మీ క్రెడిట్ చరిత్రను తరచూ సమీక్షిస్తూ ఉండండి: లోన్ అప్లికేషన్ తిరస్కరణ రూపంలో ఇబ్బంది కలిగించే ఆశ్చర్యాలకు గురికాకుండా ఉండటానికి మీ CIBIL స్కోరును మరియు రిపోర్టును ఎప్పటికప్పుడు పర్యవెక్షిస్తూ ఉండండి.