Skip to main content

క్రెడిట్ కార్డ్

క్రెడిట్ కార్డ్, పేరులో ఉన్నట్లే, మీ వేతనం లేదా నెలవారీ ఆదాయానికి మించి మీకు క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఋణంగా పొందిన డబ్బును వస్తువులు మరియు సేవల కొరకు ఖర్చు చేసే అనుకూలతను క్రెడిట్ కార్డ్ అందిస్తుంది, ఈ డబ్బును తర్వాత ఒక తేదీనాటికి ఏ వడ్డీలేకుండా తిరిగి చెల్లించవచ్చు.

క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?

క్రెడిట్ కార్డ్ అనేది, బ్యాంకు లేదా ఋణ సంస్థ ముందస్తుగా నిర్ధారించిన క్రెడిట్ పరిమితి వరకు ఋణంపై కొనుగోళ్ళు చేసేందుకు యూజర్కు వీలు కలిగిస్తూ జారీచేసే ఒక ప్లాస్టిక్ కార్డు రూపంలో వస్తుంది (దీనిని ప్లాస్టిక్ మనీ అని కూడా అంటారు). క్రెడిట్ పరిమితి అంటే క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఖర్చు చేయగలిగే లేదా అప్పు తీసుకోగలిగే గరిష్ట మొత్తం. ఈ పరిమితి ఋణగ్రహీత ఆదాయం, ఆదాయ మూలం, క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ, మరియు ఇతర వ్యక్తిగత వివరాలపై ఆధారపడి ఉంటుంది కావున వేర్వేరు ఋణ గ్రహీతలకు ఇది భిన్నంగా ఉంటుంది.

Return to top

అదెలా పని చేస్తుంది?

క్రెడిట్ కార్డ్ ఉందంటే, మీ నెలవారీ ఆదాయం పెరిగినట్లు కాదు, ఇది కేవలం మీరు ఋణం పొందగలిగే లేదా కొనుగోలు చేయగలిగే సామర్ధ్యం పెరిగిందని సూచిస్తుంది. మీ క్రెడిట్ కార్డుపై చేసిన కొనుగోళ్ళు వాస్తవానికి మీరు ఋణమిచ్చే సంస్థ నుండి అప్పుగా పొందిన సొమ్ము. ప్రతినెల, మీరు చేసిన వ్యయానికి సంబంధించిన వివరాలతో కూడిన స్టేట్మెంట్ పొందుతారు, వడ్డీ ఛార్జీలు విధించబడకుండా ఉండాలంటే ఇందులో ఉండే మొత్తాన్ని గడువు తేదీ లోగా చెల్లించాలి.

Return to top

నేను క్రెడిట్ కార్డ్ ఎందుకు పొందాలి?

క్రెడిట్ కార్డును కలిగి ఉండటం, నెలవారీగా పూర్తి / పాక్షిక మొత్తాన్ని తిరిగి చెల్లిస్తూ మీ బడ్జెట్కు మించి కొనుగోళ్ళు జరిపే వీలు కలిగిస్తుంది. ఇది స్వల్ప కాలపు నోటీస్తో సొమ్మును అప్పుగా పొంది వాయిదాల్లో (అవసరమైతే) తిరిగి చెల్లించే వీలు కలిగించే సదుపాయం. క్రెడిట్ కార్డ్, రివార్డ్ పథకాలు మరియు ప్రయోజనాల రూపంలో ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది; ఎయిర్లైన్లపై కొంత నిర్దిష్ట మొత్తాన్ని ఖర్చు చేస్తే మీరు మైల్స్ కేటాయించబడతాయి, షాపింగ్, మొదలైన వాటిపై కొంత నిర్దిష్ట మొత్తాన్ని ఖర్చు చేస్తే రివార్డ్ పాయింట్లు కేటాయించబడతాయి (ఇది ఒక కార్డు నుండి మరొక కార్డుకు మరియు ఋణమిచ్చే సంస్థల ఆధారంగా మారుతుంది). ఈ ఆఫర్లు కాలానుగుణంగా మారుతుంటాయి, కానీ సమకూడిన పాయింట్లను క్రెడిట్ కార్డ్ను జారీ చేసిన సంస్థ విధానాల ఆధారంగా తర్వాతి కాలంలో వివిధరకాలైన ఇతర ఐటెమ్స్ కొరకు రిడీమ్ చేసుకోవచ్చు.

 

Return to top

క్రెడిట్ కార్డులలోని వివిధ రకాలు ఏమిటి?

ఇటీవలి కాలంలో భారత ఆర్ధిక వ్యవస్థలోనికి పలు బ్యాంకులు, ఋణ సంస్థలు మరియు NBFCలు రంగప్రవేశం చేయడంతో అందించబడే క్రెడిట్ కార్డుల రకాలు అధికమయ్యాయి. మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాలైన క్రెడిట్ కార్డులు:

 • సిగ్నేచర్, ప్లాటినం, గోల్డ్ లేదా సిల్వర్: మీ ఆదాయం, ప్రస్తుతం ఉన్న EMI లు లేదా ఏవైనా ఇతర ఆర్ధి బాధ్యతలపై ఆధారపడి వీటిలో ఒక కార్డును ఋణ సంస్థలు కేటాయిస్తాయి.
 • మైల్స్ కార్డ్: తరచూ విమాన ప్రయణం చేసేవారికి
 • ఫ్యూయెల్ కార్డ్: ఇంధనంపై విధించబడే సర్ఛార్జీని మాఫీ చేస్తుంది
 • లైఫ్స్టైల్ కార్డ్స్: వివిధ రకాల జీవన విధానాలకు, అవసరాలు మరియు ఖర్చులకు సరిపోయేలా అందించబడే ప్రీమియం కార్డులు
 • మూవీ కార్డ్: వీక్లీ లేదా మంత్లీ ఆఫర్లతో ప్రత్యేకించి మూవీలు చూసే ఆసక్తి అధికంగా ఉన్న వారికి
 • క్యాష్బ్యాక్ కార్డ్: కొన్ని కార్డులు రివార్డ్ పాయింట్లతో పాటు అన్ని ఖర్చులపై క్యాష్బ్యాక్ అందిస్తాయి కాగా, కొన్ని కార్డులు మాత్రం కొన్ని తరగతులపై మాత్రమే క్యాష్బ్యాక్ను అందిస్తాయి
 • కో-బ్రాండెడ్ కార్డ్: సాధారణంగా బ్యాంక్ మరియు అనుబంధ సంస్థచే సంయుక్తంగా అందించబడతాయి

అందించబడే కార్డ్ రకము, ఋణం పొందగలిగే సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రతి రకానికి చెందిన కార్డ్ భిన్న ఆఫర్లు, పథకాలు మరియు రివార్డ్ పాయింట్లను అందిస్తుంది.

Return to top

ఒక క్రెడిట్ కార్డ్కు అప్లై చేసేముందు సరిచూసుకోవాల్సిన అంశాలు ఏమిటి?

క్రెడిట్ కార్డ్ను న్యాయంగా ఉపయోగించినప్పుడు మీ ఆర్ధికాంశాలను సులభతరం చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. క్రెడిట్ కార్డ్కు అప్లై చేసే ముందు పరిశీలించాల్సిన అంశాలు:

 • క్రెడిట్ కార్డ్ పరిమితి: దీనిని మీకు ఋణమిస్తున్న సంస్థ సాధారణంగా మీ ఆదాయం మరియు ఉద్యోగ నేపథ్యం ఆధారంగా మీకొరకు నిర్ణయిస్తుంది.
 • వార్షిక ఫీజు: మీ కార్డుకు చెల్లించాల్సిన వార్షిక ఫీజు ఏమైనా ఉందా లేదా జీవితకాల ఉచిత కార్డా అని ఎల్లప్పుడూ తెలుసుకోవాలి.
 • బిల్లింగ్ సైకిల్ మరియు పేమెంట్ చేసే పద్ధతులు: బిల్లింగ్ సైకిల్ మరియు వివిధ రకాల పేమెంట్ పద్ధతులను తెలుసుకోవడం ముఖ్యం, దీని ద్వారా తగినవిధంగా మీ ఖర్చులను ప్రణాళిక చేసుకొని క్రెడిట్ కార్డ్ బిల్లును సమయానికి చెల్లించడానికి వీలుగా, నెలాఖర్లో మిగులు సొమ్మును కలిగి ఉండవచ్చు.
 • ఆలస్య రుసుము లేదా వడ్డీ: కార్డ్ను ఖరారు చేసుకునేటప్పుడు మీ క్రెడిట్ కార్డ్ బిల్లుపై ఆలస్య రుసుము ఛార్జీలు లేదా ఏదైనా చెల్లింపు చేయకపోతే లేదా పాక్షికంగా చేస్తే అందుకు విధించబడే వడ్డీ ఎంత ఉందో పరిశీలించండి.

మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ను తీసుకునే ముందు మీ క్రెడిట్ కార్డ్ అర్హతను తెలుసుకుని అవగాహనతో నిర్ణయం తిసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Return to top

సెక్యూర్డ్ మరియు అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ల మధ్య ఉండే వ్యత్యాసం ఏమిటి?

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్కు మీరు మొదటగా బ్యాంకుకు కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, మీరు చెల్లింపు చేయని పక్షంలో బ్యాంకు ఈ మొత్తాన్ని పూచీకత్తుగా ఉపయోగించుకుంటుంది. క్రెడిట్ చరిత్ర లేని వారు లేదా క్రెడిట్ చరిత్ర బాగాలేని వారు సాధారణంగా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తారు.

ఇతర అన్ని రకాల క్రెడిట్ కార్డులు అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులే, ఎందుకంటే వాటికి పూచీకత్తులు ఏవీ ఉండవు.

 

Return to top

ఋణాలిచ్చే సంస్థలు దేని కోసం చూస్తాయి?

<pమొదట మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను పరిశీలించడం మంచిది, మీరు అవగాహనా రాహిత్యంతో కాకుండా పూర్తి విశ్వాసంతో క్రెడిట్ కార్డ్కు అప్లై చేయవచ్చు. ఋణమిచ్చే సంస్థలు మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను పరిశీలించి మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ను మూల్యీకరించి ఆమోదిస్తారు. అధిక CIBIL స్కోర్ కలిగి ఉండేలా జాగ్రత్తపడటం, చెల్లింపు ఎగవేతలు ఏవీలేకుండా చూచుకోవడం మరియు మంచి క్రెడిట్ చరిత్రను కలిగి ఉండటం, మీకు నచ్చిన క్రెడిట్ కార్డును పొందుకునే అవకాశాలను మరింత అధికం చేస్తాయి.

Return to top

ఆలస్యంగా పేమెంట్ చేస్తే క్రెడిట్ కార్డుపై విధించబడే ఛార్జీలు ఏమిటి?

మీరు మీ నెలవారీ క్రెడిట్ కార్డ్ బిల్లును బొత్తిగా చెల్లించకపోతే అప్పుడు మీరు ఔట్స్టాండింగ్ మొత్తంపై వడ్డీతో పాటు లేట్ పేమెంట్ ఛార్జీలను (ఇవి ఒక ఋణసంస్థ నుండి మరొక ఋణ సంస్థకు మారుతుంటాయి) కూడా చెల్లించాల్సి ఉంటుంది (ఇది గరిష్టంగా 36% వరకు ఉండవచ్చు).

మీరు ఒకవేళ గడువు తేదీ నాటికి “మినిమం ఎమౌంట్ డ్యూ” చెల్లించకపోతే, మీ ఔట్స్టాండింగ్ మొత్తంపై విధించబడే వడ్డీరేటుతో పాటు లేట్ పేమెంట్ ఛార్జీలు కూడా విధించబడతాయి. ఈ లేట్ పేమెంట్ ఫీజు రూ. 250-1000 మధ్య ఉంటుంది, ఇది ఆర్ధిక సంస్థ లేదా కార్డ్ రకంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాక, గడువు తేదీనాటికి పేమెంట్ చేయకపోతే, అది CIBIL స్కోరుపై ప్రభావం చూపిస్తుంది, ఇది తిరిగి మీ భవిష్యత్ ఋణ సామర్ధ్యాన్ని మరియు బేరసారాలు జరిపే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Return to top

క్రెడిట్ కార్డ్ ఔట్స్టాండింగ్పై వడ్డీ రేటు ఎలా లెక్కించబడుతుంది?

మీరు గడువు తేదీ నాటికి కేవలం కనీస బకాయి మొత్తాన్ని కట్టినా లేదా అసలు ఏ పేమెంట్ చేయకపోయినా మీ ఔట్స్టాండింగ్పై వర్తించే విధంగా వడ్డీ రేటు విధించబడుతుంది. క్రెడిట్ కార్డ్ను జారీ చేసే సంస్థల్లో అధిక శాతం, యావరేజ్ డైలీ బ్యాలెన్స్ విధానాన్ని అనుసరిస్తాయి. గ్రేస్ వ్యవధిలో లేదా వడ్డీ రహిత వ్యవధిలో పేమెంట్ చేయలేదని అనుకుంటే (తరచూ ఈ వ్యవధి 45-60 రోజులు ఉంటుంది). వడ్డీ రేటు సంవత్సరానికి గరిష్టంగా 36% ఉండవచ్చు. మనం క్రింది ఉదాహరణ చూద్దాం –

తేదీలావాదేవీ వివరాలుమొత్తం
సెప్టెంబర్ 10కొనుగోలుచేసిన గాడ్జెట్15000
సెప్టెంబర్ 15కొనుగోలు చేసిన ఆభరణాలు5000
సెప్టెంబర్ 18పేమెంట్ గడువు తేదీ 
అక్టోబర్ 15పేమెంట్ విధానం2000
అక్టోబర్ 16ఇంధన కొనుగోలు1000
అక్టోబర్ 17చేసిన పేమెంట్15000

 

*సదరు వ్యక్తి గడువు తేదీ దాటిన తర్వాత పేమెంట్ చేసారు కాబట్టి, ఉన్న ఔట్స్టాండింగ్ మొత్తంపై వడ్డీ మరియు లేట్ పేమెంట్ జరిమానా విధించబడుతుంది.

ఈ ఛార్జీలు ఈ క్రింది విధంగా లెక్కించబడతయి -

నెలకు 2.65% రేటుతో సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు (అంటే 28 రోజులకు) 15000 పై వడ్డీ ((15000 x 2.65 x 12 x 28)/365)/100 = 365.91

నెలకు 2.65% రేటుతో అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 17 వరకు (అంటే 3 రోజులకు) 13000 పై వడ్డీ ((13000 x 2.65 x 12 x 3)/365)/100 = 33.97

నెలకు 2.65% రేటుతో సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 17 వరకు (అంటే 30 రోజులకు) 5000 పై వడ్డీ ((5000 x 2.65 x 12 x 30)/365)/100 = 130.68

నెలకు 2.65% రేటుతో అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 18 వరకు (అంటే 2 రోజులకు) 3000 పై వడ్డీ ((3000 x 2.65 x 12 x 2)/365)/100 = 5.22

నెలకు 2.65% రేటుతో అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 18 వరకు క్రొత్త ఖర్చులు (అంటే 3 రోజులకు) 1000 పై వడ్డీ ((1000 x 2.65 x 12 x 3)/365)/100 = 2.61

ఈ విధంగా మొత్తం వడ్డీ = (365.91 + 33.97 + 130.68 +5.22 + 2.61) =538.39

Return to top

కొన్ని పేమెంట్లు ఆలస్యంగా లేదా పాక్షికంగా చేస్తే అవి నా CIBIL స్కోరును ప్రభావితం చేస్తాయా?

క్రెడిట్ కార్డ్ పేమెంట్లను ఎప్పుడూ సమయానికి చేయాలి, ఎందుకంటే వీటిపై లేట్ పేమెంట్ ఫీజు కనీస బకాయి మొత్తంపై 15% లేదా మొత్తం ఔట్స్టాండింగ్ బ్యాలెన్స్పై 2.5% గా ఉంటూ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాక, ఆలస్యం చేసిన లేదా పాక్షికంగా చెల్లించిన ప్రతి చెల్లింపు మీ CIBIL స్కోరుపై ప్రభావం చూపిస్తూ, మరొక క్రెడిట్ లైన్ పొందటాన్ని క్లిష్టతరం చేస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ ఖాతాను మూసివేసేటప్పుడు గమనించుకోవాల్సిన మరో విషయం; బ్యాంక్ మీ ఖాతాను మూసివేసిందని నిర్ధారించుకోండి, లేదంటే ఛార్జీలు విధించబడుతూ అదంతా బకాయి మొత్తంలా కనిపిస్తుంది, ఇది మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను ప్రభావితం చేస్తుంది.

Return to top

ఉత్తమ క్రెడిట్ కార్డును ఎలా ఎంపిక చేసుకోవాలి?

ఈ రోజున క్రెడిట్ కార్డును ఎంపిక చేసుకునే విషయంలో వ్యక్తులు పొరపాట్లు చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్, పలురకాల సదుపాయాలు మరియు ప్రయోజనాలతో భిన్న రూపాల్లో లభ్యమవుతుంది, ఇంకా మీ జీవన విధానం, కొనుగోలు మరియు తిరిగి చెల్లించే సామర్ధ్యాల ఆధారంగా కూడా దీనిపై ఒక నిర్ణయానికి రావచ్చు. మీకున్న అవసరమేంటో మొదట అర్ధం చేసుకొని, మీకు ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతలను విశ్లేషించుకుని తిరిగి చెల్లించగలిగే మీ సామర్ధ్యాన్ని మూల్యీకరించుకోవడమే అత్యుత్తమ క్రెడిట్ కార్డ్ను ఎంచుకోవడానికి ఏకైక మార్గం. ప్రతి క్రెడిట్ కార్డ్ అందించే సదుపాయాలు మరియు ప్రయోజనాలపై, ఒకవేళ మోసం లేదా దొంగతనం జరిగితే అవి కలిగి ఉండే భద్రత ఫీచర్లతో సహా వివిధ ఫీజులు, ఛార్జీలు లేదా వడ్డీ రేట్ల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయండి.

మీ తాజా CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ ఆధారంగా మీ క్రెడిట్ స్కోరును పొందడానికి మరియు ఉత్తమ క్రెడిట్ కార్డులను పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Return to top

 

Document Checklist

DOCUMENTS REQUIREDPERSONAL LOANCREDIT CARDAUTO LOANHOME LOAN
Latest Credit Score & CIR*
Bank Statement
KYC docs (identity, signature & address proof)
Registration Papers   
Income Statement (such as salary slip)
Property Papers   
Last 3 years IT return ✓
(for self-employed only)
 ✓
(for self-employed only)
 

* This is an indicative list and may differ from lender to lender.

Loan Eligibility Calculator

Click here to check your loan eligibility and EMI calculator