Skip to main content

ఉచిత CIBIL స్కోర్

మరియు రిపోర్ట్

ఉచిత CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ అంటే ఏమిటి?  
CIBIL సంవత్సరానికి ఒకసారి మీకు CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను ఏ ఛార్జీ లేకుండా అందిస్తుంది.

 

CIBIL నుండి ఉచిత CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను ఎలా పొందగలను?

మీరు ఇప్పటికే myCIBIL సభ్యులైతే, స్క్రీన్పై కుడివైపు పైన ఉన్న ‘నా ఖాతా’ ట్యాబ్కు వెళ్ళి పేజీపై ఉన్న ‘మీ ఉచిత రిపోర్ట్ను పొందండి’ లింకును క్లిక్ చేయండి. లాగిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు సభ్యులు కాకపోతే, మీ ఉచిత CIBIL స్కోరు మరియు రిపోర్ట్ను పొందటానికి ఇక్కడ క్లిక్ చేసి క్రింద తెలిపిన ప్రక్రియను అనుసరిస్తే సరిపోతుంది.

నాకు “నా ఖాతా”పేజీలో ‘మీ ఉచిత CIBIL స్కోరు మరియు రిపోర్ట్ పొందండి’అనే లింక్ కనిపించట్లేదు.

‘నా ఖాతా' పేజీలో ‘మీ ఉచిత రిపోర్ట్ను పొందండి’ అనే లింక్ మీకు కనిపించకపోతే మీరు ఇప్పటికే ఈ సంవత్సరంలో ఉచిత CIBIL స్కోర్ మరియు రిపోర్ట్కు అప్లై చేసుకున్నారని అర్ధం. మా అన్లిమిటెడ్ ప్లాన్లలో దేన్నైనా మీరు కొనుగోలు చేసి ఉంటే, మీ అన్లిమిటెడ్ ప్లాన్ ముగిసిన తర్వాత ‘మీ ఉచిత రిపోర్ట్ను పొందండి’ అనే లింక్ తిరిగి లభ్యమవుతుంది.


ఒక సంవత్సరం కాకముందే నాకు మరొక CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ కావాలంటే?
మీరు ఇప్పటికే ఈ సంవత్సరానికి మీ ఉచిత CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను పొంది, మీ క్రెడిట్ చరిత్రను పర్యవేక్షించుకోవడాన్ని ఇంకా కొనసాగించాలంటే మా అన్లిమిటెడ్ యాక్సెస్ ప్లాన్ ఒకదానిని మీరు కొనుగోలు చేయవచ్చు. ఇంకా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


నేను గుర్తింపు ధృవీకరణ ప్రక్రియను పూర్తిచేయలేకపోయాను, ఇప్పుడు నా ఉచిత CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను ఎలా అందుకోగలను? మీ ఆన్లైన్ ఆథెంటికేషన్ విజయవంతం కాకపోతే, మీ గుర్తింపు ధృవీకరణను పూర్తిచేయడానికి CIBIL కస్టమర్ సపోర్ట్కు మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. మీ ధృవీకరణ ప్రక్రియను పూర్తిచేయగానే మీ ఖాతాను యాక్సెస్ చేయగలుగుతారు.


నా ఉచిత CIBIL స్కోర్ మరియు రిపోర్ట్తో ఏయే అదనపు సదుపాయాలు పొందుతాను?
మీ CIBIL స్కోర్ ఆధారంగా వ్యక్తిగతీకరణం చేసిన లోన్ మరియు క్రెడిట్ కార్డ్ ఆఫర్లను పొందుతారు. మీ CIBIL రిపోర్ట్లో ఏవైనా విభేదాలు లేదా తప్పులు కనుగొంటే ఆన్లైన్లో వివాదాన్ని కూడా సమర్పించవచ్చు.


నో హిట్ అంటే ఏమిటి?

అంటే మీరు సమర్పించిన వివరాల ఆధారంగా, మీ క్రెడిట్ రిపోర్ట్ను కనుగొనలేకపోయాము. అయినప్పటికీ లోన్ ఆఫర్ల విభాగం ద్వారా లోన్ మరియు క్రెడిట్ కార్డ్ ఆఫర్లను పరిశీలించి అప్లై చేసుకోవడానికి myCIBIL ఖాతాకు సౌలభ్యత కలిగి ఉంటారు. మీ క్రెడిట్ చర్యలకు సంబంధించి ఏదైనా ఆర్ధిక సంస్థ ఏదైనా సమాచారాన్ని నివేదించినప్పుడు లేదా సమర్పించినప్పుడు మీ రిపోర్ట్ లభ్యమవుతుంది. మీ రిపోర్ట్ లభ్యతను తెలుసుకోవడానికి మీ myCibil ఖాతాకు లాగిన్ అవ్వండి.

 

నా ఉచిత CIBIL స్కోర్ మరియు రిపోర్ట్లో ఏవైనా అవకతవకలు కనుగొంటే వివాదాన్ని సమర్పించడం ఎలా?
మాకు ఒక వివాదం సమర్పించడానికి, క్రింద తెలిపిన ఆన్లైన్ వివాద ప్రక్రియను అనుసరిస్తే సరిపోతుంది.

మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో లింక్‌పై క్లిక్ చేయండి.

 


దయచేసి గమనించండి - ఆన్లైన్ వివాద ఫారంలోని ఒక్కో సెక్షన్కు వెళ్తూ వివిధ అంశాలు మరియు సమాచారాలపై ఒకే వివాదంలో వివాదం సమర్పించవచ్చు (అంటే వ్యక్తిగత, సంప్రదింపు, ఉద్యోగం, ఖాతా వివరాలు మరియు విచారణ).
ఒక్కసారి వివాదాన్ని సమర్పించిన తర్వాత, CIBIL మీ క్రెడిట్ రిపోర్ట్లోని సంబంధిత ప్రదేశం/ఖాతా/విభాగాన్ని “వివాదంలో ఉంది”గా మార్చుతుంది.

క్రెడిట్ సంస్థలు స్పందించే సమయంపై ఆధారపడి ఒక వివాదం పరిష్కరించడానికి సుమారు 30 రోజులు పడుతుంది.