Skip to main content

వాహన ఋణాలు

కారు లేదా ద్విచక్ర వాహనం ఉంటే అది విలాసం అనుకునే రోజులు పోయాయి. ఈ రోజుల్లో ఒక స్వంత వాహనం కలిగి ఉండటం అనేది ఒక అవసరతగా పరిణమించింది. మీ మొదటి కార్; ఎంతో ఖర్చుతో మీ పాత మోడల్కు చేస్తున్న అప్గ్రేడ్; వాడిన కార్, కమెర్షియల్ వాహనం లేదా ద్విచక్ర వాహనం, వీటన్నిటికీ ఒక వాహనం ఋణం మీకు అందుబాటులోనికి తీసుకువస్తుంది

వాహన ఋణం అంటే ఏమిటి? అందులో ఏయే రకాలు ఉన్నాయి?

ఒక క్రొత్త లేదా ఉపయోగించిన ప్రైవేట్ లేదా కమర్షియల్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఋణగ్రహీతలు అందుకునే ఋణాన్ని వాహన ఋణం అంటారు. ఆటోలోన్స్ అనేవి సెక్యూర్డ్ ఋణాలు, ఇందులో వాహనమే పూచీకత్తుగా ఉంటుంది. క్రొత్త కార్లు, ఉపయోగించిన కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు కమర్షియల్ వాహనాల కొనుగోలుకు (వాడుకలో కమర్షియల్ వెహికిల్ లోన్ అంటారు) ఋణాలిచ్చే సంస్థలు ఈ ఋణాన్ని అందిస్తాయి.

Return to top

ఋణాన్ని పొందటం/తిరిగి చెల్లించడం ఎలా ఉంటుంది?

బ్యాంకులు సాధారణంగా క్రొత్తవాహనాలకు వాటి ధరలో 90% వరకు ఋణాన్ని, సెకండ్ హ్యాండ్ వాహనాలకు వాటి ధరపై 85% వరకు ఋణాన్ని అందిస్తాయి. ఋణమిచ్చే సంస్థకు వాహనం ఒక పూచీకత్తుగా (హైపోథికేట్) ఉంటుంది. మీ నెలవారీ ఆదాయం మరియు తిరిగి చెల్లించగలిగే మీ సామర్ధ్యంపై ఆధారపడి రీపేమెంట్ ఆధారపడి ఉంటుంది, మరియు దీని వ్యవధి సాధారణంగా 12-84 నెలలు ఉంటుంది.

Return to top

సాధారణ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?

వాహన రకం మరియు ఋణంగా పొందే మొత్తంపై ఆధారపడి ఋణమిచ్చే సంస్థలు వడ్డీ రేటను నిర్ణయిస్తాయి. వాహన ఋణాలకు వడ్డీ రేట్లు సాధారణంగా స్థిరపరచబడి ఉంటాయి.

Return to top

ఒక వాహన ఋణాన్ని మంజూరు చేసేముందు ఋణాలిచ్చే సంస్థలు దేనిగురించి చూస్తాయి?

గృహ ఋణంతో పోలిస్తే వాహన ఋణాన్ని ఆమోదించే ప్రక్రియ సులభంగా ఉంటుంది. అయితే, మీ లోన్ అప్లికేషన్ను ఆమోదించే ముందు ఋణమిచ్చే సంస్థలు పరిగణలోనికి తీసుకునే కొన్ని ప్రాధమిక ప్రమాణాలు:

  • CIBIL స్కోర్ మరియు రిపోర్ట్: ఇతర ఋణాల విషయంలో చూసినట్లే, ఋణమిచ్చే సంస్థలు వాహన ఋణాలకు కూడా మీ ప్రస్తుత క్రెడిట్ హెల్త్ మరియు మీ గత పేమెంట్ హిస్టరీ సరళి ఎలా ఉందనే అంశాలను పరిశీలిస్తాయి. ఋణమిచ్చే సంస్థలు మీ లోన్ అప్లికేషన్పై అంతిమ నిర్ణయం తీసుకోవడానికి ముందు అధిక CIBIL స్కోరు మరియు మంచి క్రెడిట్ ప్రొఫైల్ కొరకు చూస్తాయి. అధిక CIBIL స్కోరు, మీ ఋణం ఆమోదించబడే సంభావ్యతను పెంచుతుంది. CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను ఉచితంగా పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి!!
  • ఉపాధి మరియు ఆదాయ స్థితి: మొత్తం ఋణ వ్యవధిలో మీరు ఋణాన్ని తప్పకుండా తిరిగి చెల్లిస్తారని నిర్ధారించుకునేందుకు మీకు స్థిర ఉద్యోగం మరియు నిలకడైన నెలవారీ ఆదాయం ఉందా అని కూడా ఋణమిచ్చే సంస్థలు పరిశీలిస్తాయి.
  • ప్రస్తుత లోన్ రీపేమెంట్లు: ఋణమిచ్చే సంస్థలు ఋణామోదంపై వారి నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు మీకు ప్రస్తుతం ఉన్న EMI లపై కూడా ఓ కన్నేసి ఉంచుతాయి. అవి సాధారణంగా చెల్లిస్తున్న EMIకి, నెలవారీ రాబడికి మధ్య నిష్పత్తిని తెలుసుకుంటారు. మీరు కట్టాల్సిన EMI లు మీ ఆదాయంలో అధిక శాతంగా ఉండకూడదని నిర్ధారించుకోవాలి.

వాహన ఋణం పొందేముందు అవగాహనతో కూడిన నిర్ణయాన్ని తీసుకోవడానికి మీ ఋణార్హతను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Return to top

వాహన ఋణానికి అప్లై చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

వాస్తవానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు ఒక ఋణసంస్థ నుండి మరో ఋణసంస్థకు భిన్నంగా ఉంటాయి. అయితే ఋణమిచ్చే సంస్థలకు అవసరమయ్యే కనీస డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇయ్యబడింది: ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, వేతన మరియు బ్యాంక్ స్టేట్మెంట్.

Return to top

నాకయ్యే ఇతర ఖర్చులు, ఫీజులు లేదా ఛార్జీలు ఏమిటి?

అసలు వాహన ధరతో పాటు, మీరు పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ మొత్తం, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు మరియు స్టాంప్ డ్యూటీ వంటి అనుబంధ ఖర్చులను కూడా పరిశీలించాలి. లోన్కు అప్లై చేసే ముందు అన్ని ఛార్జీలు మరియు ఫీజుల గురించి ముందుగానే పరిశీలించడం ఎల్లప్పుడూ సూచనీయాంశమే.

Return to top

వేటి గురించి చూడాలి?

మీ వాహన డీలర్ సూచించే బ్యాంక్ వద్దే ఋణం పొందాల్సిన అవసరం లేదు, ఇతర ఋణసంస్థలు మెరుగైన ఋణ సదుపాయాలు అందిస్తే మీరు ఎప్పుడైనా వాటిని ఎంచుకోవచ్చు. అందువలన, ఒక ఋణ సంస్థ నుండి ఋణం పొందే విషయంలో అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ఋణసంస్థలను, వారు అందిస్తున్న రేట్లను పోల్చుతూ క్షుణ్ణంగా అధ్యయనం చేయండి.

పరిశీలించి, పోల్చి వాహన ఋణానికి అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Return to top

 

 

Document Checklist

DOCUMENTS REQUIREDPERSONAL LOANCREDIT CARDAUTO LOANHOME LOAN
Latest Credit Score & CIR*
Bank Statement
KYC docs (identity, signature & address proof)
Registration Papers   
Income Statement (such as salary slip)
Property Papers   
Last 3 years IT return ✓
(for self-employed only)
 ✓
(for self-employed only)
 

* This is an indicative list and may differ from lender to lender.

Loan Eligibility Calculator

Click here to check your loan eligibility and EMI calculator