సరిక్రొత్త CIBIL స్కోర్ గురించి మీరు తెలుసుకోవాల్సినదంతా తెలుసుకోండి

 1. CIBIL స్కోరు ఎందుకు మారుతుంది?

మీ CIBIL స్కోరు ఒక స్కోరింగ్ అల్గారిధమ్ ద్వారా విడుదలవుతుంది, ఇది భారీ సంఖ్యలో డేటా పాయింట్లను మరియు మాక్రో స్థాయి క్రెడిట్ ట్రెండ్లను పరిగణలోనికి తీసుకుంటుంది. లోన్లపై ఎగవేత సంభావ్యతను, వినియోగదారుల ఋణ-యోగ్యత మరియు వారు ఋణాన్ని తిరిగి చెల్లించే అవకాశాన్ని ఊహించడానికి CIBIL స్కోరును మరింత సమగ్రం చేస్తూ స్కోర్ సామర్ధ్యాన్ని పెంచుతూ ఉండటానికి క్రొత్త డేటా పాయింట్లు మరియు ట్రెండ్లను చేర్చడానికి ఈ అల్గారిధంకు క్రమ వ్యవధుల్లో మార్పులు చేస్తుండటం అవసరం.

 

 1. క్రొత్త CIBIL స్కోర్ నాకు ఎలా సహాయపడుతుంది?

క్రెడిట్ లైఫ్సైకిల్ లోని అన్ని దశల్లో క్రొత్త CIBIL స్కోర్ పలు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇదివరకే ఋణాలను పొందియున్న వినియోగదారులకు, వారి క్రెడిట్ ప్రవర్తనపై మరింత సమగ్ర అవగాహనను పొందటంలో క్రొత్త CIBIL స్కోరు సహాయపడుతుంది. స్కోరును విడుదల చేయడానికి క్రెడిట్ వ్యవధిని పెంచడం మరియు పరిగణలోనికి తీసుకునే రీపేమెంట్ చరిత్రలను పెంచడం ద్వారా ఇది సాధ్యమయ్యింది. ఋణ సంస్థలు ఋణ ఎగవేతదారులను ఊహించగలిగే ఖచ్చితత్వాన్ని పెంచడం ద్వారా, ఋణ సంస్థలు మరింత తరచుగా ఋణం అందించడానికి మరియు మెరుగైన సదుపాయాలను అందించడానికి క్రొత్త CIBIL స్కోరు వీలు కలిగిస్తుంది.

క్రెడిట్ ప్రొఫైల్లో మరియు వినియోగదారుల రీపేమెంట్ ప్రవర్తనలో చోటుచేసుకునే స్వల్ప మార్పులను కూడా క్రొత్త CIBIL స్కోరు పరిగణలోనికి తీసుకుంటుంది. ఇలా చేయడం ఋణసంస్థలు అధిక ఖచ్చితత్వంతో రిస్క్ ప్రొఫైల్లను యాక్సెస్ చేయడానికి, మరియు గతంలో వారు ఋణం తిరస్కరించిన వారికి ఋణం అందించడానికి సహాయపడుతుంది.

 

 1. నా క్రొత్త CIBIL స్కోరు, పాత CIBIL స్కోరుకు ఎందుకు భిన్నంగా ఉంటుంది?

క్రొత్త CIBIL స్కోర్ కూడా పాత CIBIL స్కోర్ లాగే 300 మరియు 900 మధ్య ఉంటుంది. అయితే, CIBIL స్కోరును విడుదల చేసే స్కోరింగ్ అల్గారిధం మారిన కారణంగా, క్రొత్త CIBIL స్కోరు సంఖ్యా విలువ, పాత CIBIL స్కోరు సంఖ్యా విలువకు భిన్నంగా ఉండవచ్చు.

 

క్రొత్త CIBIL స్కోర్

పాత CIBIL స్కోర్

36 నెలల క్రెడిట్ చరిత్ర ఆధారంగా

కేవలం 24 నెలల క్రెడిట్ చరిత్ర ఆధారంగా

6 నెలల కంటే తక్కువ వ్యవధికి క్రెడిట్ చరిత్రను కలిగి ఉన్న వినియోగదారుల స్కోరును కూడా లెక్కిస్తుంది

వినియోగదారులు ఒక సంఖ్యారూపంలో స్కోరును పొందాలంటే ఆరు నెలల క్రెడిట్ చరుత్రను నిర్మించుకోవాల్సి వచ్చేది

 

 

 1. నేను ఏ ఋణాన్ని ఎగగొట్టకపోయినా నా స్కోరు ఎందుకు పడిపోయింది?

పాత CIBIL స్కోరుతో పోల్చితే క్రొత్త CIBIL స్కోరు భిన్నంగా ఉండటానికి కారణం ఈ స్కోర్లను విడుదల చేయడానికి వేర్వేరు స్కోరింగ్ అల్గారిధంలను ఉపయోగించడమే. దీని ఫలితంగా, CIBIL రిపోర్టులో ఉండే ఒకే డేటాకు పాత CIBIL స్కోరుతో పొల్చితే క్రొత్త స్కోరు తక్కువగా ఉండటానికి దారితీస్తుంది. క్రొత్త CIBIL స్కోరులో ఈ తగ్గుదల మీ క్రెడిట్ ప్రొఫైల్ దిగజారిపోయిందని సూచించదు మరియు మీ క్రెడిట్ అప్లికేషన్ను ఋణ సంస్థలు పరిగణించే విధానంలో ఎటువంటి మార్పుకు దారితీయదు.

 

 1. myCIBIL డ్యాష్బోర్డుపై కనిపించే నా క్రొత్త CIBIL స్కోరు నా పాత CIBIL స్కోరు కంటే తక్కువగా ఉంది? ఇది నా లోన్ అప్లికేషన్పై ప్రభావం చూపిస్తుందా?

పాత CIBIL స్కోరుతో పోల్చితే క్రొత్త CIBIL స్కోరు భిన్నంగా ఉండటానికి కారణం ఈ స్కోర్లను విడుదల చేయడానికి వేర్వేరు స్కోరింగ్ అల్గారిధంలను ఉపయోగించడమే. దీని ఫలితంగా, CIBIL రిపోర్టులో ఉండే ఒకే డేటాకు పాత CIBIL స్కోరుతో పొల్చితే క్రొత్త స్కోరు తక్కువగా ఉండటానికి దారితీస్తుంది. క్రొత్త CIBIL స్కోరులో ఈ తగ్గుదల మీ క్రెడిట్ ప్రొఫైల్ దిగజారిపోయిందని సూచించదు మరియు మీ క్రెడిట్ అప్లికేషన్ను ఋణ సంస్థలు పరిగణించే విధానంలో ఎటువంటి మార్పుకు దారితీయదు.

 

 1. క్రొత్త స్కోరు నా ఋణార్హతపై ప్రభావం చూపుతుందా?

క్రొత్త CIBIL స్కోర్ కూడా పాత CIBIL స్కోర్ లాగే 300 మరియు 900 మధ్య ఉంటుంది. అయితే, CIBIL స్కోరును విడుదల చేసే స్కోరింగ్ అల్గారిధం మారిన కారణంగా, క్రొత్త CIBIL స్కోరు సంఖ్యా విలువ, పాత CIBIL స్కోరు సంఖ్యా విలువకు భిన్నంగా ఉండవచ్చు.

మీ క్రొత్త CIBIL స్కోరు మీ ఋణాన్ని ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ఋణ సంస్థల అభిప్రాయాన్ని ప్రభావితం చేయవు. అయితే, ఇంకా స్పష్టమైన అవగాహనకు, దయచేసి మీకు ఋణ సంస్థల ఋణ విధానాలను ఒక్కొక్కదానిని పరిశీలించండి.

 

 1. బ్యాంకు వద్ద ఉన్న స్కోరుకు, నా CIBIL డ్యాష్బోర్డుపై కనిపిస్తున్న స్కోరుకు వ్యత్యాసం ఎందుకు ఉంది?

మీ క్రెడిట్ అప్లికేషన్ను సమీక్షించేటప్పుడు ఋణసంస్థలు మీ CIBIL స్కోరును ఒక పరామితిగా పరిగణిస్తారు. మా సభ్యులైన బ్యాంకులు మరియు క్రెడిట్ సంస్థలన్నీ ఇప్పుడు క్రొత్త CIBIL స్కోరుకు మారే ప్రక్రియలో ఉన్నాయి. అయితే, ఒకవైపు రీక్యాలిబ్రేషన్ ప్రక్రియ, మరోవైపు క్రొత్త స్కోరుకు మారే పని కొనసాగుతూ ఉండగా కొన్ని సంస్థలు మాత్రం ఇంకా పాత CIBIL నే ఉపయోగిస్తున్నాయి. దీని ఫలితంగా, మీ లోన్ అప్లికేషన్ను మూల్యీకరించేటప్పుడు ఋణసంస్థ పొందిన స్కోరు (పాత CIBIL స్కోర్) మీరు మీ డ్యాష్బోర్డుపై చూస్తున్న CIBIL స్కోరు (క్రొత్త CIBIL స్కోర్)కు భిన్నంగా ఉండవచ్చు. అయితే, ఋణ సంస్థలు మీ క్రెడిట్ అప్లికేషన్ను ఆమోదించడం లేదా తిరస్కరించడంపై ఈ వ్యత్యాసం ఎలాంటి ప్రభావం కలిగి ఉండదు..

మా సభ్య బ్యాంకులు మరియు క్రెడిట్ సంస్థలన్నీ క్రొత్త CIBIL స్కోరుకు మారినప్పుడు, బ్యాంకు వద్ద ఉండే CIBIL స్కోరుకు, మీ CIBIL డ్యాష్బోర్డుపై కనిపించే స్కొరుకు మధ్య ఇక వ్యత్యాసమేమీ ఉండదు.

 

 1. నేను పాత వెర్షన్ స్కోరు ఆధారంగా లోన్ అప్లై చేసాను, ఇప్పుడు ఆ లోన్ అప్లికేషన్ సంగతి ఏమవుతుంది?

క్రొత్త CIBIL స్కోరు రావడం మీ ఋణాన్ని ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ఋణ సంస్థల అభిప్రాయాన్ని ప్రభావితం చేయదు. అయితే, ఇంకా స్పష్టమైన అవగాహనకు, దయచేసి మీకు ఋణ సంస్థల ఋణ విధానాలను ఒక్కొక్కదానిని పరిశీలించండి..

 

 1. క్రొత్త స్కోరు ఆధారంగా ఋణ సంస్థ ఒకవేళ నా లోన్ను ఆమోదించకపోతే ఎలా?

ఒక లోన్ను మంజూరు చేయడానికి తీసుకునే నిర్ణయం ఋణసంస్థ కలిగి ఉండే ఋణ విధానంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఋణసంస్థలు పాత CIBIL స్కోరుకు, క్రొత్త CIBIL స్కోరుకు భిన్న కటాఫ్ విలువలను కలిగి ఉండవచ్చు. ఋణసంస్థ మీ లోన్ అప్లికేషన్ను క్రొత్త CIBIL స్కోర్ ఆధారంగా మూల్యీకరించి ఉంటే అట్టి ఋణసంస్థ వద్ద అదివరకే క్రొత్త CIBIL స్కోరుకు నిర్వచించబడిన కటాఫ్ స్కోర్ వివరాలు ఉంటాయి.

ఋణసంస్థల విధానాలలో CIBIL స్కోర్ ఒక ప్రామాణికాంశం అయినప్పటికీ, CIBIL స్కోర్ యొక్క క్రొత్త మరియు పాత వెర్షన్ల స్కోర్ల మధ్య ఉండే వ్యత్యాసం మీ క్రెడిట్ ప్రొఫైల్ మారిందని సూచించదు, తద్వారా ఋణసంస్థలు మీ క్రెడిట్ అప్లికేషన్ను పరిగణించే విధానంపై మరియు మీ క్రెడిట్ అప్లికేషన్ను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి వారు తిసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపించదు అని దయచేసి గమనించండి.

 

 1. క్రొత్త CIBIL స్కోరును ప్రభావితం చేసే కారకాలు ఏవి?

ఋణ వినియోగం, పేమెంట్ హిస్టరీ (ఆలస్య చెల్లింపులు చేసిన సందర్భాలు మరియు బకాయి మొత్తాల పరిమాణం), క్రెడిట్ అప్లికేషన్లు మరియు క్రెడిట్ రకాల సమతూకం వంటి అంశాలకు తోడుగా క్రొత్త CIBIL స్కోరు

 • డెప్త్ ఆఫ్ క్రెడిట్ (అంటే., మీకున్న అన్నిటికంటే పాత క్రెడిట్ ఖాతాను తెరిచినప్పటి నుండి మీరు కలిగియున్న క్రెడిట్ చరిత్ర) ను కూడా కలిగి ఉంది.
 • ఔట్స్టాండింగ్ బ్యాలెన్సుల దీర్ఘకాలిక ట్రెండ్
 • క్రెడిట్ రికార్డులలోని లావాదేవీల చరిత్ర
 • వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం మరియు బకాయి మొత్తానికి మధ్య నిష్పత్తి
 • తెరిచిన క్రొత్త ఖాతాలు మరియు మూసిన ఖాతాల సంఖ్య

మీ క్రెడిట్ కార్డ్లోని ఈ అంశాల సంపూర్ణ విలువలు మరియు నాణ్యత లక్షణాలు మీ క్రొత్త CIBIL స్కోరుపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు.

 

 1. నా క్రొత్త CIBIL స్కోరుని చూడాలంటే నేనేదైనా చేయాలా?

మీ క్రొత్త CIBIL స్కోరు ఇప్పటికే మీ CIBIL డ్యాష్బోర్డ్లో రీఫ్రెష్ అయింది. కాబట్టి మీ క్రొత్త CIBIL స్కోరును చూడాలంటే మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి మీ డ్యాష్బోర్డ్కు లాగిన్ కావడమే. మీ క్రెడిట్ చరిత్రకు సంబంధించి అత్యంత సంబద్ధమైన తాజా సమాచారాన్ని అందించడానికి మేము తీసుకున్న నిర్ణయంలో భాగంగా, CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను మీరు రీఫ్రెష్ చేసిన ప్రతిసారీ మీరొక క్రొత్త CIBIL స్కోర్ పొందుతారు.

 

 1. నా ఉచిత వార్షిక క్రెడిట్ రిపోర్టుతో నేను క్రొత్త CIBIL స్కోరును పొందుతానా?

పొందుతారు, మీ ఉచిత వార్షిక క్రెడిట్ రిపోర్టుతో మీరు క్రొత్త CIBIL స్కోరును పొందుతారు?

 

 1. నేను నా పాత స్కోరును చూడవచ్చా?

మీ డ్యాష్బోర్డ్పై తాజా CIBIL స్కోర్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి డ్యాష్బోర్డ్పై కనిపిస్తున స్కోర్ క్రొత్త CIBIL స్కోరు. మీరు మీ యాక్టివ్ CIBIL స్కోర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్తో డ్యాష్బోర్డ్ యొక్క స్కోర్ చరిత్ర విభాగంలో మీ పాత వెర్షన్ CIBIL స్కోర్లు (12 నెలల వ్యవధి వరకు) చూడటం కొనసాగించవచ్చు.

 

 1. నేను CIBIL స్కొర్ యొక్క అన్ని వెర్షన్లను చుడాలనుకుంటే ఎలా, నేను స్కోర్ వెర్షన్ను ఎంచుకోవచ్చా?

డ్యాష్బోర్డుపై కనిపించే తాజా CIBIL స్కోరు, CIBIL స్కోర్ యొక్క క్రొత్త వెర్షన్ది. మీరు డ్యాష్బోర్డ్పై CIBIL స్కోర్ వెర్షన్ను మార్చడం లేదా ఎంపిక చేసుకోవడం వీలుపడదు. మా సభ్యులైన బ్యాంకులు మరియు క్రెడిట్ సంస్థలన్నీ ఇప్పుడు క్రొత్త CIBIL స్కోరుకు మారే పనిలో పడ్డాయి. ఈ మార్పు ప్రక్రియ పూర్తయితే ఇక మార్కెట్ అంతటా ఒకే వెర్షన్ వినియోగంలో ఉంటుంది.

 

 1. నా డ్యాష్బోర్డ్మీద నా CIBIL స్కోర్ యొక్క పాత వెర్షన్ను చూడవచ్చా?

ఒక యాక్టివ్ CIBIL సబ్స్క్రిప్షన్తో, డ్యాష్బోర్డ్పై ఉండే స్కోర్ చరిత్ర విభాగంలో 12 నెలల వ్యవధి వరకు రీఫ్రెష్ అయిన మీ CIBIL స్కోర్లను (పాత వెర్షన్) చూడగలుగుతారు.

 

 1. నా క్రెడిట్ సమ్మరీలో ఏమి మారింది?

మీ CIBIL రిపోర్ట్లోని అతి ప్రాముఖ్యమైన అంశాలపై త్వరిత సంగ్రహాన్ని అందించడానికి క్రెడిట్ సమ్మరీ అనే ఫీచర్ ఏర్పాటుచేయబడింది. క్రెడిట్ సమ్మరీ ఫీచర్లో అందించబడిన వివరాల్లో మార్పు ఉండదు.

 

 1. నా స్కోర్ విశ్లేషణలో ఏమి మారింది?

మీ క్రొత్త CIBIL స్కోరు, ఇప్పుడు స్కోర్ విశ్లేషణను కూడా అందిస్తుంది. ఈ స్కోర్ విశ్లేషణ, మెరుగుపర్చుకునే అవకాశముండి మీ CIBIL స్కోరును ప్రభావితం చేస్తున్న కొన్ని ప్రత్యేక అంశాలకు వివరణను అందిస్తుంది. క్రొత్త CIBIL స్కోరును లెక్కించడానికి ఉపయోగించబడే అల్గారిధం ఎక్కువ అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది కాబట్టి, క్రొత్త CIBIL స్కోరుతో పాటు వచ్చే స్కోర్ విశ్లేషణ, మీరు స్కోరును బాగా అర్ధం చేసుకోవడంలో సహాయం చేయడానికి ఎక్కువ అంశాలను గురించిన వివరణను కలిగి ఉంటుంది.

  

 1. నా స్కోరును మెరుగుపర్చుకోవడానికి నేను ఏమి చేయాలి?

మీరు మంచి ఋణ చరిత్రను కలిగి ఉండటం ద్వారా CIBIL స్కోరును మెరుగుపరచుకోవచ్చు, ఇది ఋణాలిచ్చే సంస్థలు ఋణాలను ఆమోదించడానికి తప్పనిసరి. మీ స్కోరును మెరుగుపరచుకోవడానికి సహాయపడే ఈ 6 అంచెలను అనుసరించండి:

 • ఎల్లప్పుడూ మీ బకాయిలను సకాలంలో చెల్లించండి: ఋణాలిచ్చే సంస్థలు ఆలస్య చెల్లింపులను ప్రతికూలాంశంగా భావిస్తాయి.
 • మీ బ్యాలెన్సులను తక్కువగా కొనసాగించండి: ఎల్లప్పుడూ మితిమీరి క్రెడిట్ను వినియోగించకుండా, మీ క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించుకుంటూ వివేకంతో వ్యవహరించండి.
 • ఆరోగ్యమైన క్రెడిట్ మిక్స్ కొనసాగించండి: సెక్యూర్డ్ (గృహఋణం, వాహన ఋణం వంటివి) మరియు అన్ సెక్యూర్డ్ (పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల వంటివి) ఋణాలను సమతూకంలో కలిగి ఉండటం మంచిది. మరీ ఎక్కువ అన్ సెక్యూర్డ్ ఋణాలు ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తాయి.
 • క్రొత్త ఋణాల కొరకు ఓ మోస్తరు సంఖ్యలో అప్లై చేయండి: మీరు ఎల్లప్పుడూ అధిక ఋణం కోసం ఎదురు చూస్తున్నారనే భావన కలిగించాలి అనుకోరు; క్రొత్త ఋణం కోసం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయండి.
 • మీ కో-సైన్డ్, గ్యారంటీడ్ మరియు జాయింట్ ఖాతాలను ప్రతినెలా పర్యవేక్షించుకోండి: కో-సైన్డ్, గ్యారంటీడ్ లేదా జాయింట్గా కలిగియున్న ఖాతాలకు, చెల్లించని పేమెంట్లకు మీరు సమాన బాధ్యత కలిగి ఉంటారు. మీ జాయింట్ హోల్డర్ (లేదా గ్యారంటీ పొందిన వ్యక్తి) నిర్లక్ష్యం మీ అవసరతలో మీరు ఋణం పొందే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.
 • సంవత్సరం పొడవునా మీ క్రెడిట్ చరిత్రను తరచూ సమీక్షిస్తూ ఉండండి: లోన్ అప్లికేషన్ తిరస్కరణ రూపంలో ఇబ్బంది కలిగించే ఆశ్చర్యాలకు గురికాకుండా ఉండటానికి మీ CIBIL స్కోరును మరియు రిపోర్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండండి.

 

 1. CIBIL రిపోర్ట్కు ఏదైనా క్రొత్త సమాచారం జోడించబడిందా?

CIBIL రిపోర్టులో ఉండే సమాచారంలో మార్పేమీ లేదు. ఇక్కడ మారిందల్లా మీ CIBIL స్కోరును లెక్కించడానికి అల్గారిధం మీ సమాచారాన్ని ఉపయోగించే విధానమే.

 

 1. రిపోర్ట్లో ఏవైనా తప్పులు చూస్తే నేను వివాదం సమర్పించగలుగుతానా?

అవును. మీ CIBIL రిపోర్ట్లో ఏవైనా తప్పులు కనిపిస్తే, మీ CIBIL డ్యాష్బోర్డ్లో ఉండే ‘వివాదం సమర్పించండి’ ను క్లిక్ చేయడం ద్వారా సంబంధిత విభాగంపై వెంటనే ఒక వివాదం సమర్పించాలి. మీ వివాదాన్ని పరిష్కరించుకునే ప్రక్రియ ఖచ్చితంగా ఇదివరకటి లాగే ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి దాని గురించి చదవవచ్చు.

 

 1. క్రొత్త స్కోరుకు పాపులేషన్ ర్యాంకింగ్ ఉందా?

మీ డ్యాష్బోర్డ్ ఒక పాపులేషన్ ర్యాంకింగ్ విభాగాన్ని కలిగి ఉంటుంది, ఇది CIBIL స్కోరు లభ్యంగా ఉన్న ఇతర వినియోగదారులతో పోలిస్తే మీరు CIBIL స్కోరు పరంగా ఏ స్థానంలో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తుంది. డ్యాష్బోర్డ్పై కనిపించే పాపులేషన్ ర్యాంకింగ్ ఇప్పుడు క్రొత్త CIBIL స్కోరుపై ఆధారపడి ప్రదర్శించబడుతుంది.

 

 1. నేను వ్యక్తిగతీకరించిన లోన్ ఆఫర్ల విభాగంలో చూసే ఆఫర్లపై ఈ క్రొత్త స్కోర్ ప్రభావం చూపుతుందా?

మీ డ్యాష్బోర్డ్పై వ్యక్తిగతీకరిచిన లోన్ ఆఫర్ల విభాగం మీ ఋణార్హత ఆధారంగా ఋణ్సంస్థలు మీకందించే ఆఫర్లను కలిగి ఉంటుంది. మీ ఋణార్హతను లెక్కించడానికి ఉపయోగించే అంశాలలో CIBIL స్కోర్ ఒకటి. క్రొత్త CIBIL స్కోర్ ఆధారంగా పాల్గొంటున్న సంస్థలన్నీ అందించిన కటాఫ్ స్కోర్లను చేర్చడానికి వీలుగా ఈ విభాగంలో లభ్యమయ్యే లోన్ ఆఫర్లకు ప్రామాణికత సవరించబడింది.

 

 1. నా స్కోర్ మారినప్పుడు నాకు అలర్ట్ ఎందుకు రాలేదు?

లేట్ పేమెంట్లు, క్రొత్త క్రెడిట్ అప్లికేషన్లు వంటి మీ CIBIL రిపోర్ట్లో నివేదించబడిన వివరాల కారణంగా మీ స్కోరులో మార్పు జరిగితే మిమ్మల్ని అప్రమత్తం చేయడమే స్కోర్ మార్పు అలర్ట్ యొక్క ఉద్దేశం. మీ డ్యాష్బోర్డ్పై కనిపిస్తున్న క్రొత్త CIBIL స్కోరు, మీ పాత CIBIL స్కోరుకు భిన్నమైన సంఖ్యా విలువను కలిగి ఉండవచ్చు. అయితే, స్కోర్లలో ఉండే ఈ వ్యత్యాసం మీ క్రెడిట్ ప్రొఫైల్లో ఎటువంటి మార్పును సూచించదు. CIBIL రిపోర్టులో ఉండే అవే వివరాలు మీ క్రొత్త మరియు పాత CIBIL స్కోర్లలోని భిన్నమైన సంఖ్యా విలువలకు కారణమైనందున మీ క్రొత్త CIBIL స్కోరు దానంతటదే రీఫ్రెష్ అయినప్పుడు మీకు అలర్ట్ సందేశం రాలేదు. రెండు స్కోర్ వెర్షన్లను విడుదల చేయడానికి ఉపయోగించిన వేర్వేరు స్కోరింగ్ అల్గారిధంల వల్లే ఈ వ్యత్యాసం ఏర్పడుతుంది..

గమనిక:మీ CIBIL స్కోరులో ఏవైనా తదనంతర మార్పులు జరిగితే మీరొక అలర్ట్ నోటిఫికేషన్ అందుకుంటారు.

 

 1. స్కోర్ సిమ్యులేటర్ ఇకముందు క్రొత్తది మరియు వృద్ధి చేయబడిన CIBIL స్కోరు ఆధారంగా ఒక సిమ్యులేటెడ్ స్కోరును అందిస్తుందా?

అవును. క్రొత్త CIBIL స్కోరును అంతర్లీనం చేయడానికి వీలుగా మేము మా స్కోర్ సిమ్యులేటర్ను నవీకరించాము. కాబట్టి, ఇప్పటి నుండి, క్రెడిట్ ప్రవర్తనను అనుకరించి మీ క్రొత్త CIBIL స్కోరుపై ఉండగలిగే ప్రభావాన్ని తెలుసుకోవడానికి మీరు స్కోర్ సిమ్యులేటర్ను ఉపయోగించిన ప్రతిసారీ మీరు పొందే సిమ్యులేటెడ్ స్కోరు ఒక క్రొత్త అల్గారిధం ఆధారంగా విడుదలవుతుంది.