మీ ఋణ ప్రవర్తన మీ CIBIL స్కోరును మరియు దాని ఫలితంగా మీ ఋణ లభ్యతను ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? స్కోర్ సిమ్యులేటర్ అనేది మీరు వివిధ క్రెడిట్-సంబంధిత దృశ్యాల నుండి ఎంచుకోవడానికి అనుమతించే ఒక సాధనం.
మీ ప్రస్తుత CIBIL స్కోర్‌ను మార్పులేకుండా ఉంచుతూనే, మీరు అవగాహన పూర్వక నిర్ణయాలు తీసుకోవడానికి మరియు భవిష్యత్తులో విచక్షణతో ఋణ ఎంపికలు చేసుకోవడానికి స్కోర్ సిమ్యులేటర్ సహాయపడుతుంది.
స్కోర్ సిమ్యులేటర్ అనేది మీ ప్రస్తుత CIBIL రిపోర్ట్‌పై వివిధ ఋణ ప్రవర్తనలను ఆధారం చేసుకుని సిమ్యులేట్ చేయబడిన CIBIL స్కోర్‌ను అందించే ఒక టూల్. వివిధ ఋణ ప్రవర్తనలు మీ ప్రస్తుత CIBIL స్కోర్‌ను ఏవిధంగా ప్రభావితం చేయగలవో తెలుసుకోవడానికి మరియు దాని ఆధారంగా మీరు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకొనేలా చేయడానికి ఈ ఫీచర్ రూపకల్పన చేయబడింది.
ఈ క్రింది వంటి వివిధ రకాల అనుకరణల నుండి ఎంచుకొనే వీలును స్కోర్ సిమ్యులేటర్ కలిగిస్తుంది
ఒక నిర్దిష్ట సిమ్యులేషన్‌ను ఎంచుకొన్నప్పుడు, సిమ్యులేషన్‌కు అవసరమైన కొన్ని అదనపు వివరాలను మిమ్మల్ని అడుగుతారు, ఉదాహరణకు మీరు క్రొత్త క్రెడిట్ కార్డును జోడించడానికి ఎంచుకుంటే, మిమ్మల్ని ‘క్రెడిట్ లిమిట్’ ఎంత అని అడుగుతారు. అదనపు వివరాలను ఎంటర్ చేసిన మీదట మీరు మీ సిమ్యులేటెడ్ CIBIL స్కోర్‌ను చెక్ చేసుకోగలుగుతారు.
స్కోర్ సిమ్యులేటర్‌కు యాక్సెస్ పొందాలంటే (1-నెల, 6-నెలలు లేదా 1-సంవత్సరం అపరిమిత యాక్సెస్) ఒక యాక్టివ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉండాలి. మీరు సక్రియ చెల్లింపు సభ్యత్వాన్ని కలిగి ఉన్న తర్వాత, మీరు మీ CIBIL ఖాతాలోని స్కోర్ సిమ్యులేటర్ ట్యాబ్‌లో స్కోర్ సిమ్యులేటర్ సాధనాన్ని యాక్సెస్ చేయగలరు. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కొరకు రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఇప్పటికే పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉంటే, ఇక్కడ క్లిక్ చేయండి లాగిన్ అవ్వండి మరియు ఇప్పుడే తనిఖీ చేయండి.
స్కోర్ సిమ్యులేటర్ మీ ప్రస్తుత CIBIL స్కోరుపై ప్రభావం చూపించదు. స్కోర్ సిమ్యులేటర్‌ను ఉపయోగిస్తే మీ CIBIL రిపోర్టుపై ఉన్న ఏ వివరం మారదు/ అప్‌డేట్ కాదు. వివిధ క్రెడిట్ ప్రవర్తనలు మీ CIBIL స్కోరును ఎలా ప్రభావితం చేస్తాయో అనే విషయాన్ని మాత్రమే స్కోర్ సిమ్యులేటర్ సూచిస్తుంది.
లోన్ అప్లికేషన్ ప్రక్రియలో CIBIL స్కోరు కీలక పాత్రను పోషిస్తుంది. మీ CIBIL స్కోరును వివిధ రకాల క్రెడిట్ ప్రవర్తనలు ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉందో అర్ధం చేసుకోవడం, మీ ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవడానికి అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.