Skip to main content

సంస్థల వివాదాల పరిష్కరణ

దిగువ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో వివాద అభ్యర్థనను ప్రారంభించండి

CIBIL కంపెనీ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CCR) సంస్థ వివరాలను కలిగి ఉంటుంది. ఉదా: చిరునామా, సంప్రదింపు వివరాలు, మొదలైనవి., ఖాతా సమాచారం మరియు విచారణలు. మీ CCR పై ఉండే ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే లేదా అప్డేట్ చేయాల్సి వస్తే, మీ రిపోర్ట్ను పరిష్కరించడానికి / అప్డేట్ చేయడానికి మేమెంతో సంతోషిస్తాము.

CIBIL నుండి వాణిజ్య సంస్థలు కొనుగోలు చేసిన కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ (CCR) పై లేదా క్రెడిట్ సంస్థ పొందిన CCR పై వివాదాలను సమర్పించవచ్చు. సరిదిద్దగలిగే వివిధ రకాల తప్పులను అర్ధం చేసుకోవడానికి క్రింద జాబితా చేసిన వివాద రకాలను చూడండి. వివాదాలలోని రకాలు

1. సంస్థ / ఖాతా వివరాలు:

- వివాదం సమర్పించగలిగే ప్రాంతాలు:  

 

సంస్థ వివరాలు: ఖాతా వివరాలు
  • సంస్థ పేరు
  • క్రెడిట్ రకం
  • సంస్థ రిజిస్టర్డ్ అడ్రస్
  • అసెట్ తరగతి
  • సంస్థ బ్రాంచి అడ్రస్
  • మంజూరైన తేదీ
  • టెలిఫోన్ నెంబర్లు
  • మంజూరైన మొత్తం/ అధిక క్రెడిట్
  • PAN (సంస్థ)
  • ప్రస్తుత బ్యాలెన్స్
  • ప్రమోటర్/డైరెక్టర్/ప్రొప్రయిటర్/భాగస్వామి పేరు
  • బ్యాంక్ రిమార్కు
  • బంధుత్వం
  • స్థితి
  • లీగల్ కాన్స్టిట్యూషన్
  • ఉద్దేశపూర్వక డీఫాల్టర్గా వర్గీకరించబడిన తేదీ
  • సిటీ
  • వ్యాజ్యం దాఖలైన స్థితి
  • రాష్ట్రం
  • వ్యాజ్యం వేసిన తేదీ
  • PIN కోడ్
  • వ్యాజ్యం మొత్తం

2. ఓనర్షిప్
ఒక ఖాతా ఓనర్షిప్ గురించి కూడా మీరు వివాదాన్ని సమర్పించవచ్చు. ఖాతాకు ఓనర్షిప్ కలిగి ఉండటం అనే పదం, మీ కంపెనీ CCR లో ఉండే ఒక ఖాతా మీకు చెందినది కాదు లేదా అసలు మొత్తం రిపోర్ట్ తప్పు అని అర్ధం.

 

3. డూప్లికేట్ ఖాతా
మీ CCR లో ఒకే ఖాతా ఒకటి కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంటే, దానిని సరిదిద్దటానికి మీరొక అభ్యర్ధన చేయవచ్చు.

 

 వివాద పరిష్కార ప్రక్రియ

Company dispute resolution banner_english

 

విధిగా నింపిన ఆన్లైన్ వివాద పత్రాన్ని సబ్మిట్ చేయటమే ఒక వివాదాన్ని సమర్పించడానికి సులభమైన మార్గం.ఒక ఆన్లైన్ వివాద అభ్యర్ధన చేయడానికి దయచేసి క్రింద క్లిక్ చేయండి.

వారి CCR లో కనిపించే వివరాల్లో ఉండే తప్పులకు వాణిజ్య సంస్థలు CIBIL కు వివాదాలను సమర్పించవచ్చు. ఈ సేవను అందిస్తున్నందుకు CIBIL వాణిజ్య సంస్థల నుండి రుసుము వసూలు చేయదు.

ఇందుకు ప్రత్యామ్నాయంగా, మాకు క్రింది చిరునామాకు వ్రాయడం ద్వారా కూడా మీరొక వివాదాన్ని గురించిన అభ్యర్ధనను తెలుపవచ్చు:

TransUnion CIBIL లిమిటెడ్, వన్ ఇండియాబుల్స్ సెంటర్, టవర్ 2A, 19వ ఫ్లోర్, సేనాపతి బాపట్ మార్గ్, ఎల్ఫిన్స్టోన్ రోడ్, ముంబై - 400 013.

వివాదాలలోని రకాలు

సంస్థ / ఖాతా వివరాలు

ఓనర్షిప్

డూప్లికేట్ ఖాతా