Skip to main content

తరచూ అడిగే క్రెడిట్ ప్రశ్నలు

CIBIL, దాని ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి అత్యంత సాధారణంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

1. CIBIL స్కోర్ అంటే ఏమిటి మరియు నా CIBIL స్కోరును ఏయే కారకాలు ప్రభావితం చేయవచ్చు?
CIBIL స్కోరు అనేది 3 అంకెల సంఖ్యతో తెలిపే మీ క్రెడిట్ చరిత్ర సారాంశం, ఇది మీ CIBIL రిపోర్టులోని ‘ఖాతాలు’ మరియు ‘విచారణలు’ విభాగంలో 300 నుండి 900 మధ్య ఉంటుంది. మీ స్కోరు 900 కు ఎంత దగ్గరగా ఉంటే మీ లోన్ అప్లికేషన్ ఆమోదించబడే అవకాశాలు అంత అధికంగా ఉంటాయి.

ఈ వీడియో చూడండి సిబిల్ స్కోరు గురించి మరింత తెలుసుకోవడానికి.

2. నా CIBIL స్కోరును ఎలా మెరుగుపరచుకోగలను?
మీరు మంచి ఋణ చరిత్రను కలిగి ఉండటం ద్వారా CIBIL స్కోరును మెరుగుపరచుకోవచ్చు, ఇది ఋణాలిచ్చే సంస్థలు ఋణాలను ఆమోదించడానికి తప్పనిసరి. మీ స్కోరును మెరుగుపరచుకోవడానికి సహాయపడే ఈ 6 అంచెలను అనుసరించండి:

  • ఎల్లప్పుడూ మీ బకాయిలను సకాలంలో చెల్లించండి: ఋణాలిచ్చే సంస్థలు ఆలస్య చెల్లింపులను ప్రతికూలాంశంగా భావిస్తాయి.
  • మీ బ్యాలెన్సులను తక్కువగా కొనసాగించండి: ఎల్లప్పుడూ మితిమీరి క్రెడిట్ను వినియోగించకుండా, మీ క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించుకుంటూ వివేకంతో వ్యవహరించండి.
  • ఆరోగ్యమైన క్రెడిట్ మిక్స్ కొనసాగించండి: సెక్యూర్డ్ (గృహఋణం, వాహన ఋణం వంటివి) మరియు అన్ సెక్యూర్డ్ (పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల వంటివి) ఋణాలను సమతూకంలో కలిగి ఉండటం మంచిది. మరీ ఎక్కువ అన్ సెక్యూర్డ్ ఋణాలు ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తాయి.
  • క్రొత్త ఋణాల కొరకు ఓ మోస్తరు సంఖ్యలో అప్లై చేయండి: మీరు ఎల్లప్పుడూ అధిక ఋణం కోసం ఎదురు చూస్తున్నారనే భావన కలిగించాలి అనుకోరు; క్రొత్త ఋణం కోసం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయండి.
  • మీ కో-సైన్డ్, గ్యారంటీడ్ మరియు జాయింట్ ఖాతాలను ప్రతినెలా పర్యవేక్షించుకోండి: : కో-సైన్డ్, గ్యారంటీడ్ లేదా జాయింట్గా కలిగియున్న ఖాతాలకు, చెల్లించని పేమెంట్లకు మీరు సమాన బాధ్యత కలిగి ఉంటారు. మీ జాయింట్ హోల్డర్ (లేదా గ్యారంటీ పొందిన వ్యక్తి) నిర్లక్ష్యం మీ అవసరతలో మీరు ఋణం పొందే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.
  • సంవత్సరం పొడవునా మీ క్రెడిట్ చరిత్రను తరచూ సమీక్షిస్తూ ఉండండి: లోన్ అప్లికేషన్ తిరస్కరణ రూపంలో ఇబ్బంది కలిగించే ఆశ్చర్యాలకు గురికాకుండా ఉండటానికి మీ CIBIL స్కోరును మరియు రిపోర్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండండి

3. నా రిపోర్ట్లో నేనొక తప్పును గుర్తించాను. నేను ఒక వివాదం ఎలా లేవనెత్తాలి? ఒక వివాదం పరిష్కరించబడటానికి ఎంత సమయం పడుతుంది?
మాకు ఒక వివాదం సమర్పించడానికి, క్రింద తెలిపిన ఆన్లైన్ వివాద ప్రక్రియను అనుసరిస్తే సరిపోతుంది.

ఇక్కడ నొక్కండి మరింత తెలుసుకోవడానికి.

 

దయచేసి గమనించండి - ఆన్లైన్ వివాద ఫారంలోని ఒక్కో సెక్షన్కు వెళ్తూ వివిధ అంశాలు మరియు సమాచారాలపై ఒకే వివాదంలో వివాదం సమర్పించవచ్చు (అంటే వ్యక్తిగత, సంప్రదింపు, ఉద్యోగం, ఖాతా వివరాలు మరియు విచారణ).

ఒక్కసారి వివాదాన్ని సమర్పించిన తర్వాత, CIBIL మీ క్రెడిట్ రిపోర్ట్లోని సంబంధిత ప్రదేశం/ఖాతా/విభాగాన్ని “వివాదంలో ఉంది”గా మార్చుతుంది.

క్రెడిట్ సంస్థలు స్పందించే సమయంపై ఆధారపడి ఒక వివాదం పరిష్కరించడానికి సుమారు 30 రోజులు పడుతుంది.