Skip to main content

మీ CIBIL స్కోర్ మరియు

రిపోర్ట్ను అర్ధం చేసుకోండి

CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అనేది మీ క్రెడిట్ చరిత్ర యొక్క మూడంకెల సంఖ్యా సారాంశం. CIBIL రిపోర్ట్ (CIR, అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని కూడా పిలువబడుతుంది) లో కనిపించే క్రెడిట్ చరిత్రను ఉపయోగించి స్కోర్ ఉత్పాదించబడుతుంది. CIR అనేది ఒక వ్యక్తి, కొంత కాల వ్యవధిలో అన్ని రకాల ఋణాలు మరియు క్రెడిట్ సంస్థలకు చేసిన క్రెడిట్ చెల్లింపుల చరిత్ర. CIR మీ సేవింగ్స్, పెట్టుబడులు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను కలిగి ఉండదు.

 

మీ సిబిల్ స్కోరు మరియు నివేదిక క్రెడిట్ స్కోరు మరియు నివేదిక కంటే ఎక్కువ మరియు మీ స్కోర్‌తో మీరు చేయగలిగేది చాలా ఎక్కువ.

మరింత తెలుసుకోవడానికి క్రింది వీడియోపై క్లిక్ చేయండి.

myCIBIL రిపోర్ట్లో ఉన్న నా అకౌంట్ నంబర్ మరియు మెంబర్ నేమ్ వివరాలను నేనెలా తెలుసుకోవచ్చు?

అకౌంట్ నంబర్ లేదా మెంబర్ వివరాలను తెలుసుకోవడానికి మీరు మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను కొనుగోలు చేయవచ్చు. వివిధ ఋణ సంస్థలు మరియు ఉత్పత్తుల నుండి మీ క్రెడిట్ హిస్టరీ యొక్క పూర్తి వివరాలను ఈ రిపోర్ట్ కలిగి ఉండి, పైన చెప్పిన సమాచారాన్నంతా పరిశీలించడానికి మీకు వీలు కలిగిస్తుంది.

 

మరింత తెలుసుకోవడానికి క్రింది వీడియోపై క్లిక్ చేయండి.

భారతీయ ప్రాంతీయ భాషలలో ఇప్పుడు అందుబాటులో ఉన్న మీ సిబిల్ స్కోరు మరియు నివేదిక గురించి మరింత తెలుసుకోండి

Tamil | Malayalam | Kannada | Hindi | Telugu

 

myCIBIL రిపోర్ట్ను నేనెలా చదవాలి?

గృహ ఋణం, వాహన ఋణం, క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాలపై మీరు పొందిన ఋణాలపై మీ CIBIL రిపోర్ట్ వివరణాత్మక సమాచారం కలిగి ఉంటుంది. మీరు కావాల్సిన ప్రతిసారీ పరిశీలించడానికి మీ CIR ను అర్ధం చేసుకోండి అనే డాక్యుమెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. CIBIL రిపోర్ట్ యొక్క వివిధ వివరాలను తెలిపే ఒక ట్యూటోరియల్ను కూడా చూడవచ్చు.CIBIL రిపోర్ట్లోని లోని ముఖ్యమైన విభాగాలు క్రింద ఇవ్వబడ్డాయి

 

 

  • CIBIL స్కోర్

300-900 మధ్య ఉండే మీ CIR లోని ‘ఖాతాలు’మరియు ‘విచారణలు’ లో కనిపించే మీ క్రెడిట్ ప్రవర్తన ఆధారంగా మీ CIBIL స్కోర్ లెక్కించబడుతుంది. 700 కు పైగా స్కోర్ ఉంటే అది మంచి స్కోరుగా పరిగణించబడుతుంది.

Cibil Score

  • వ్యక్తిగత సమాచారం

    ఈ విభాగంలో మీ పేరు, పుట్టినతేదీ, లింగం మరియు పాన్, పాస్పోర్ట్ సంఖ్య, ఓటర్ నంబర్ వంటి గుర్తింపు సంఖ్యలను కలిగి ఉంటుంది.

    Personal Information
  • సంప్రదింపు సమాచారం

    ఈ విభాగంలో మీ చిరునామా మరియు టెలిఫోన్ నంబర్లు ఇవ్వబడతాయి, ఇందులో 4 చిరునామాల వరకు ఉండవచ్చు

    Contact Information
  • ఉద్యోగ సమాచారం

    సభ్యులు (బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థలు) నివేదించిన విధంగా నెలవారీ లేదా వార్షిక ఆదాయం.

    Employment Information
  • ఖాతా సమాచారం

    ఈ విభాగం ఋణ సంస్థ పేరు, ఋణ సదుపాయ రకాలు (గృహ ఋణం, వ్యక్తిగత మొదలైనవి), ఖాతా సంఖ్యలు, ఓనర్-షిప్ వివరాలు, తెరిచిన తేదీ, ఆఖరిసారి చెల్లింపు చేసిన తేదీ, ఋణ మొత్తం, ప్రస్తుత బ్యాలెన్స్ మరియు మీరు చేసిన చెల్లింపుల నెలవారీ రికార్డు (3 సంవత్సరాల నుండి) వంటి ఋణ సదుపాయాల వివరాలను కలిగి ఉంటుంది.

    Account Information
  • విచారణ సమాచారం

    మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసిన ప్రతిసారి సంబంధిత బ్యాంక్ లేదా ఋణ సంస్థ మీ CIR ను పొందుతుంది. దీన్ని సిస్టం మీ క్రెడిట్ చరిత్రలో గుర్తిస్తుంది మరియు ఇదే విషయం “విచారణలు”గా తెలుపబడుతుంది.

 

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIR) లో ఉపయోగించే వివిధ పదాలకు అర్ధం ఏమిటి?
మీ CIR ను మెరుగ్గా అర్ధం చేసుకోవడానికి పదకోశం చూడండి.

 

నాకొక యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ ఉంది. నేను చెల్లించాల్సి లేకపోయినప్పటికీ వివరాలు నా ఖాతాలో ఎందుకు కనిపిస్తున్నాయి?
ప్రైమరీ కార్డు మరియు యాడ్-ఆన్ క్రెడిట్ కార్డు, రెండింటిపై విధించబడే ఛార్జీలను చెల్లించే బాధ్యత కూడా ప్రైమరీ కార్డ్ హోల్డర్దే అనే విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏవైనా చెల్లింపులు చేయకుండా ఎగవేస్తే, అది ప్రైమరీ మరియు యాడ్-ఆన్ కార్డ్ హోల్డర్లు ఇద్దరు CIR లలో కనిపిస్తుంది.

 

నేను గ్యారంటీర్గా ఉన్న లోన్లు నా రిపోర్ట్లో ఎందుకు కనిపిస్తున్నాయి?
బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థలు కొన్ని లోన్ల విషయంలో, అవి అందించే లోన్ మొత్తానికి సెక్యూరిటీగా గ్యారంటార్ కావాలని అడుగుతాయి. అది ఎలాంటి లోన్ అయినా సరే దానికి ఉండే గ్యారంటీర్, లోన్ తిరిగి చెల్లించడానికి సమాన బాధ్యతను కలిగి ఉంటారు. కాబట్టి, ప్రధాన అప్లికెంట్ చెల్లించలేకపోతే ఆ బాధ్యతను తాను తీసుకుంటానని లోన్ ఇస్తున్న సంస్థకు గ్యారంటీర్ హామినిస్తున్నారు. ప్రధాన అప్లికెంట్ లోన్ చెల్లించకుండా ఎగవేస్తే అది మీ క్రెడిట్ స్కోరును కూడా ప్రభావితం చేస్తుంది.

 

రిపోర్ట్లో నా పేరుపై తెలుపబడిన లోన్ అకౌంట్లను నేను గుర్తించలేకపోతున్నాను. నేను మరికొన్ని వివరాలు పొందవచ్చా?

మీ లోన్ అకౌంట్ గురించి మరిన్ని వివరాల కొరకు మీరు మీ CIBIL రిపోర్ట్ యొక్క ఖాతా సమాచార విభాగాన్ని రిఫర్ చేయండి.

(మీరు ఇక్కడ అందుబాటులో ఉన్న ఒక CIBIL సబ్స్క్రిప్షన్ ప్లాన్తో మీ క్రెడిట్ ప్రొఫైల్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు:  https://www.cibil.com/choose-subscription)

 

నేను నా అన్ని లోన్లు బ్యాంకుకు సకాలంలో ముగించివేసి NOC పొందాను. అయినప్పటికీ నా రిపోర్ట్లో ఇంకా ఔట్స్టాండింగ్ ఎందుకు చూపిస్తుంది?
సవరింపులు చేసిన వివరాలను CIBIL కు సమర్పించినట్లు క్రెడిట్ సంస్థ నుండి ఏదైనా నిర్ధారణ అందుకుంటే, దాని అప్డేటెడ్ స్టేటస్ను ఇక్కడ చూడవచ్చు:https://www.cibil.com/choose-subscription

 

విచారణలు మీ CIBIL స్కోరును ప్రభావితం చేయగలవా? మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

విచారణలు మీ CIBIL స్కోరును ఎలా ప్రభావితం చేస్తాయో అనే అంశంపై మరింత సమాచారం కొరకు ఈ వీడియోలను భారత ప్రాంతీయ భాషల్లో చూడండి:

Tamil | Malayalam | Kannada | Hindi | Telugu

 

 సమాచార భద్రత అంటే ఏమిటి?

TransUnion CIBIL వద్ద, మంచి ఉద్దేశం కొరకు సమాచారం ఇవ్వాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నాం. మా వ్యాపారం ప్రధానంగా మా వినియోగదారుల వివరాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ వివరాలను భద్రంగా ఉంచుతూ వాటి సంరక్షణకు హామీ ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. అయితే, మోసాలకు వ్యతిరేకంగా నిరంతరం మేము చేస్తున్న పోరాటంలో మీ సహకారం మాకు అవసరం. క్రెడిట్ మోసాలకు మరియు గుర్తింపు అపహరణకు లోనవ్వడం ఎంత సులభమో ఎప్పుడైనా గ్రహించారా? డిజిటల్ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఆన్లైన్లో మీ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసి మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడవేసుకునే అనేక మార్గాలు ఉన్నాయి.
బ్రౌచర్ డౌన్లోడ్ చేయండి