Skip to main content

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్

ఋణ ఆమోద ప్రక్రియను మీ క్రెడిట్ స్కోర్ ఎలా సుగమం చేస్తుందో అర్ధం చేసుకొనుట

వివాహం తర్వాత క్రొత్త జీవితం మొదలుపెడుతూ, మీ గృహానికి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? క్రొత్త హోమ్ థియేటర్ సిస్టంతో లేదా లేటెస్ట్ గాడ్జెత్తో మీ గృహాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారా? మీ కొరకు దీన్ని కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ సాధ్యం చేస్తుంది. మీకు నచ్చిన వస్తువుపై 100% నిధులు పొంది వాటిని స్వల్ప EMI రూపంలో తిరిగి చెల్లించండి.

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ అంటే ఏమిటి?

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ అనేది గృహావసర ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఒక క్రెడిట్/ఫైనాన్స్ విధానం.

Return to top

మీకు ఒక కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ ఇచ్చే ముందు ఋణాలిచ్చే సంస్థలు వేటి గురించి చూస్తాయి?

ఋణసంస్థలు మీ వార్షిక ఆదాయాన్ని మరియు క్రెడిట్ హిస్టరీని పరిశీలిస్తాయి. కంజ్యూమర్ డ్యూరబుల్ ఋణాలు, అన్సెక్యూర్డ్ ఋణాలు కావడంతో, ఋణసంస్థలు ప్రత్యేకించి మీరు తెరిగి చెల్లించిన చరిత్రను మరియు CIBIL స్కోరును పరిశీలిస్తాయి. మీ CIBIL స్కోరును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అందులో తప్పులేవీ లేవనీ, సమగ్రంగా రిపోర్ట్ అంతా ఋణసంస్థలు కోరుకునే విధంగా ఉందనీ నిర్ధారించుకుంటూ ఉండటం మంచిది.

ఇక్కడ క్లిక్ చేసి CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను ఉచితంగా పొందండి.

Return to top

వివిధ తరగతులకు సాధారణ వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ ఫీజులు ఎలా ఉంటాయి?

కంజ్యూమర్ డ్యూరబుల్ ఋణాలపై వడ్డీ ఒక సంస్థ నుండి మరో సంస్థకు భిన్నంగా ఉంటూ 12 నుండి 22% మధ్యలో ఉంటుంది. కొన్ని ఋణసంస్థలైతే వారి ప్రమోషనల్ ఆఫర్లలో భాగంగా 0% వడ్డీతో ఋణాన్ని అందిస్తాయి. అధిక శాతం ఋణసంస్థలు పొందే ఋణమొత్తంపై 1-3% మధ్య నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజును విధిస్తాయి.

Return to top

అవసరమయ్యే డాక్యుమెంట్లు ఏమిటి?

కంజ్యూమర్ డ్యూరబుల్ ఋణం పొందటానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు ఒక సంస్థ నుండి మరో సంస్థకు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా అవసరమయ్యే డాక్యుమెంట్ల జాబితా ఇలా ఉంటుంది: ఐడెంటిటీ ప్రూఫ్ (PAN కార్డ్, వోటర్ ID, ఆధార్ కార్డ్ మొదలైనవి.), అడ్రస్ ప్రూఫ్ (పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు మొదలైనవి.) మరియు ఇన్కం ప్రూఫ్ (తాజా వేతన స్లిప్).

Return to top

నేను ఋణాన్ని ముందే తీర్చివేయవచ్చా, అందుకు ఛార్జీలేవైనా ఉంటాయా? అనుసరించాల్సిన విధానం ఏమిటి?

ఉంటాయి, మీరు ఎప్పుడు కావాలనుకున్నా మీ ఋణాన్ని ముందుగా తీర్చివేయవచ్చు. అయితే, ఈ ఫోర్క్లోజర్ కాల వ్యవధి ఋణం విడుదలైన తేదీ నుండి మొదటి EMI తర్వాత మొదలై 6 నెలల వరకు ప్రతి ఋణ సంస్థకు భిన్నంగా ఉంటుంది. అధిక శాతం ఋణసంస్థలు కంజ్యూమర్ డ్యూరబుల్ ఋణాలపై ఫోర్క్లోజర్ ఛార్జీలను విధించవు, కానీ కొన్ని ఋణసంస్థలు మాత్రం అసలు మొత్తంపై 2-4% వరకు ఛార్జీలు విధిస్తాయి. గడువుకు ముందుగానే తీర్చివేయడానికి వారు అనుసరించే విధానాన్ని తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ఋణసంస్థను సంప్రదించవచ్చు.

Return to top

నేను ఏయే వ్యవధులకు ఋణాన్ని పొందవచ్చు?

కంజ్యూమర్ డ్యూరబుల్ ఋణాలు సాధారణంగా 8 నుండి 36 నెలల మధ్య మారే అనుకూల గడువు వ్యవధిని కలిగి ఉంటాయి.

Return to top

మీరు దేని కోసం చూడాలి?

ఎప్పుడూ వేర్వేరు ఋణసంస్థల నుండి వారి వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర వర్తించే ఛార్జీలను ముందుగానే తెలుసుకుని వాటిని పోల్చి అప్పుడు మీకు ఉత్తమ డీల్ అందించే ఋణసంస్థను ఎంపిక చేసుకోవడం మంచిది.మీరు అవగాహన పూర్వక నిర్ణయం తీసుకోవడంలో తొడ్పడే మీ ఋణార్హతను తెలుసుకోవడానికి

ఇక్కడ క్లిక్ చేయండి

Return to top