లోన్ తిరస్కరణలు మరియు వివాదాలు

CIBIL రికార్డులలో నా పేరుపై నివేదించబడిన డీఫాల్టుల కారణంగా నా లోన్ తిరస్కరించబడింది. నా పేరును CIBIL డీఫాల్టర్ల జాబితా నుండి ఎలా తొలగించుకోగలను?
CIBIL అసలు డీఫాల్టర్ల జాబితాను నిర్వహించదు. సభ్య ఋణ సంస్థలు నివేదించిన దాని ప్రకారం మేము వ్యక్తుల క్రెడిట్ చరిత్రను నిర్వహిస్తాము. ఒక లోన్ను మంజూరు చేయడానికి తీసుకునే నిర్ణయం ఋణసంస్థ కలిగి ఉండే ఋణ విధానంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ చరిత్రను వివరంగా పరిశీలించి, మీ పేరుపై ఏవైనా అవకతవకలు /తప్పులను గుర్తిస్తే, ఇక్కడ క్లిక్ చేసి మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను కొనుగోలు చేయవచ్చు.

 

నా CIBIL రిపోర్టులో ఏ రకమైన తప్పులు కనిపించవచ్చు?

 • ఓనర్షిప్

  మీ CIR రిపోర్టులో ఉన్న కొన్ని వ్యక్తిగత వివరాలు లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలు / విచారణలు మీకు చెందినవి కాకపోతే.

 • తప్పుగా ఉన్న వ్యక్తిగత వివరాలు:

  పేరు, చిరునామా, జన్మదినం, PAN, టెలిఫోన్ నంబర్, ఆదాయం వంటి మీ వ్యక్తిగత / సంప్రదింపు / ఉద్యోగ సమాచారంతో పాటుగా మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కూడా ఋణ సంస్థలు సమర్పిస్తాయి. అప్పుడు ఈ వివరాలన్నిటి ఆధారంగా మీ కొరకు CIBIL ఒక సమగ్ర ప్రొఫైల్ను రూపొందిస్తుంది. మీరు ఇచ్చిన తప్పు వివరాలు తప్పులతో ఉండే CIBIL స్కోర్ జనరేట్ అవ్వడానికి కారణమవుతాయి. అందువల్ల, సమాచారంలో మార్పు వచ్చిన ప్రతి సందర్భంలో మీ క్రెడిట్ సంస్థలకు ఆ సమాచారాన్ని నివేదించడమనేది చాలా ముఖ్యమైన విషయం.

 • తప్పుగా ఉన్న ఖాతా వివరాలు

  ఋణ సంస్థలు సాధారణంగా 30-45 రోజుల్లో CIBIL కు వివరాలను సమర్పిస్తాయి మరియు మీరు ఈ - 45 రోజుల్లో CIBIL రిపోర్టును కొనుగోలు చేయడం జరిగితే అది అప్డేట్ అయినదిగా ఉండకపోవచ్చు. ఇది మీ CIBIL రిపోర్ట్లో ప్రస్తుత బ్యాలెన్స్ లేదా ఓవర్డ్యూ మొత్తం తప్పుగా కనిపించడానికి దారితీస్తుంది. అయితే, ఒకవేళ ఆ ఖాతాతో ముడిపడి ఉన్న ‘నివేదించిన తేదీ’ (ఋణ సంస్థ వివరాలను సమసమర్పించిన తేదీ) 2 నెలల కంటే పాతదై, చేసిన చెల్లింపు మొత్తం ఇంకా రిపోర్ట్లో కనిపించకపోతే, మీరు ఒక వివాదం సమర్పించవచ్చు. (ఒక వివాదం సమర్పించడమెలాగో చూడటానికి (ఇక్కడ క్లిక్ చేయండి).

నేను నా ఖాతాను క్లోజ్ చేశాను / తీర్చివేశాను, అయినా నా రిపోర్ట్ లో అవి కనిపిస్తున్నాయి. నా CIBIL రిపోర్ట్ను నేనెలా అప్డేట్ చేయవచ్చు?
క్రెడిట్ సమాచార సంస్థలు (రెగ్యులేషన్) చట్టం 2005 ప్రకారం, క్రెడిట్ సంస్థ నుండి ధృవీకరణ లేకుండా డేటాబేస్లో CIBIL ఎటువంటి సమాచారాన్ని మార్చలేదు. ఋణ సంస్థలు వివరాలను CIBIL కు 30 - 45 రోజుల్లో సమర్పిస్తాయి. మీరు మీ ఖాతాను మూసివేసిన /చెల్లించివేసిన 45 రోజుల్లో CIBIL స్కోర్ మరియు రిపోర్టును కొనుగోలు చేయడం జరిగితే అది CIBIL రికార్డులలో అప్డేట్ అయినదిగా ఉండకపోవచ్చు. మీ ఖాతా యొక్క తాజాస్థితిని పరిశీలించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

CIBIL రిపోర్టులోని డేటాకు మార్పులను చేయడం లేదా నా సమాచారాన్ని అప్డేట్ / తొలగించడం వంటివి CIBIL చేయగలదా?
మీ CIBIL రిపోర్టులో నేరుగా CIBIL ఏ విధమైన మార్పులనూ చేయలేదు. సంబంధిత ఋణసంస్థ మార్పును అన్నుమతించి, అందిస్తేనే మీ CIBIL రిపోర్ట్ను అప్డేట్ చేయడం సాధ్యమవుతుంది.

 

నా రిపోర్ట్లో నేనొక తప్పును గుర్తించాను. నేను ఒక వివాదం ఎలా లేవనెత్తాలి? ఒక వివాదం పరిష్కరించబడటానికి ఎంత సమయం పడుతుంది?
మాకు ఒక వివాదం సమర్పించడానికి, క్రింద తెలిపిన ఆన్లైన్ వివాద ప్రక్రియను అనుసరిస్తే సరిపోతుంది:

steps for a dispute

మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో లింక్‌పై క్లిక్ చేయండి.

 

దయచేసి గమనించండి - ఆన్లైన్ వివాద ఫారంలోని ఒక్కో సెక్షన్కు వెళ్తూ వివిధ అంశాలు మరియు సమాచారాలపై ఒకే వివాదంలో వివాదం సమర్పించవచ్చు (అంటే వ్యక్తిగత, సంప్రదింపు, ఉద్యోగం, ఖాతా వివరాలు మరియు విచారణ).

 

ఋణ సంస్థ నుండి మీ రిపోర్ట్ అందుకున్నారు:

ఇందుకు ప్రత్యామ్నాయంగా, మాకు క్రింది చిరునామాకు వ్రాయడం ద్వారా కూడా మీరొక వివాదాన్ని గురించిన అభ్యర్ధనను తెలుపవచ్చు: TransUnion CIBIL లిమిటెడ్, వన్ ఇండియాబుల్స్ సెంటర్, టవర్ 2A, 19వ ఫ్లోర్, సేనాపతి బాపట్ మార్గ్, ఎల్ఫిన్స్టోన్ రోడ్, ముంబై - 400 013.

ఒక్కసారి వివాదాన్ని సమర్పించిన తర్వాత, CIBIL మీ క్రెడిట్ రిపోర్ట్లోని సంబంధిత ప్రదేశం/ఖాతా/విభాగాన్ని “వివాదంలో ఉంది”గా మార్చుతుంది.

క్రెడిట్ సంస్థలు స్పందించే సమయంపై ఆధారపడి ఒక వివాదం పరిష్కరించడానికి సుమారు 30 రోజులు పడుతుంది.

ఇక్కడ నొక్కండివివాద పరిష్కార ప్రక్రియను అర్థం చేసుకోవడానికి.

steps for a dispute

 

నా రిపోర్ట్ అసంపూర్తిగా ఉంది. నా రిపోర్టుకు CIBIL సమాచారాన్ని జోడించగలదా?
మీ CIBIL రిపోర్టుకు నేరుగా ఎటువంటి సమాచారాన్ని CIBIL కలపలేదు. మీ CIBIL రిపోర్ట్పై లభ్యమయ్యే సమాచారం ఋణ సంస్థలు / క్రెడిట్ సంస్థలు (CIలు) మాకు నివేదించిన సమాచారాన్ని బట్టి ఉంటుంది. CIBIL కు సంపూర్తియైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే CI లపై ఉన్న బాధ్యత. ఈ సమాచారాన్ని అన్ని CI ల నుండి ఖచ్చితంగా అప్డేట్ చేసి సమకూర్చడమే CIBIL యొక్క బాధ్యత. ఏదైనా సమాచారం లేకపోతే దాన్ని CIBIL కు నివేదించడానికి దయచేసి మీ క్రెడిట్ సంస్థను సంప్రదించండి.

 

బ్రాంచ్ వివరాలు ఎంటర్ చేయకుండా నేను వివాదాన్ని సమర్పించలేకపోతున్నాను? నేనేమి చేయాలి?
కొన్ని బ్యాంకులు, మీరు ఋణం పొందిన శాఖ లేకుండా మీ వివాదాన్ని పరిష్కరించలేవు. కాబట్టి, వివాద సమర్పణను మొదలుపెట్టేటప్పుడు మీ నుండి బ్యాంకు వివరాలను సేకరించే ప్రక్రియను ఆటోమేటిక్ చేశాము. బ్రాంచి వివరాలను అందిస్తే అది మీ వివాదాన్ని సరియైన బ్రాంచ్కు మళ్ళించడానికి బ్యాంకుకు వీలు కలిగిస్తుంది మరియు ఇది వివాద పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంలో తోడ్పడుతుంది. ఒకవేళ మీవద్ద బ్రాంచ్ వివరాలు లేకపోతే, మీరు సంబంధిత క్రెడిట్ సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది.

 

నేను ఒక నిర్దిష్ట ఖాతా / విచారణపై ఒకటి కంటే ఎక్కువ వివాదాలను ఎందుకు సమర్పించలేను?
మీరు ఓనర్పై లేదా ఒక ఖాతా / విచారణలలోని ప్రదేశాలపై ఏదో ఒకదానిపై వివాదం సమర్పించగలరు.

మీరు ఓబర్షిప్పై వివాదం సమర్పిస్తే (ఖాతా మీకు చెందినది కాదు) ఇతర ప్రదేశాలపై వివాదం సమర్పించడం సంబద్ధమైనది కాదు.

మీరు మీకు చెందిన ఒక ఖాతా / విచారణలలోని ప్రదేశంపై వివాదం సమర్పిస్తుంటే, అప్పుడు ఓనర్షిప్పై వివాదం సమర్పించడం అసంబద్ధం అవుతుంది.

 

మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో లింక్‌పై క్లిక్ చేయండి.

 

నేను వివాదాన్ని సమర్పించిన తర్వాత CIBIL ఏమి చేస్తుంది?
మీరు వివాదం సమర్పించిన తర్వాత, CIBIL ఆ వివాదాన్ని అంతర్గతంగా పరిశీలించి, దానిని సంబంధిత క్రెడిట్ సంస్థకు పంపిస్తుంది. ఆ అభ్యర్ధనకు CI స్పందించిన తర్వాత, CIBIL తక్షణమే ఆ మార్పులను అప్డేట్ చేస్తుంది (వర్తిస్తే), మరియు దాని స్థితిని మీకు ఇమెయిల్ ద్వారా తెలియపరుస్తుంది.

వివాద పరిష్కార ప్రక్రియను అర్ధం చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

నేను సమర్పించిన వివాదపు స్థితిని నేను ఎలా తెలుసుకోగలను?
మీ వివాద స్థితికి సంబంధించిన ఆటోమేటెడ్ ఇమెయిల్ నోటిఫికేషన్ను మీరు ప్రతి 7 రోజులకొకసారి అందుకుంటారు.

 

నా CIBIL రిపోర్ట్పై సమాచారాన్ని సరిదిద్దడానికి నేను ఒక వివాదం సమర్పించాను కానీ నాకు ఋణమిచ్చిన సంస్థను సంప్రదించాలని నేనొక నోటిఫికేషన్ అందుకున్నాను. ఎందుకు?
సంబంధిత క్రెడిట్ సంస్థ అనుమతించనిదే మీ CIBIL రిపోర్టుకు CIBIL ఏ మార్పూ చేయలేదు. క్రెడిట్ సంస్థ అందించిన సమాచార ఆధారిత డేటాను CIBIL మార్చడం వీలుపడదు లేదా క్రెడిట్ సంస్థ మీ వివాదాన్ని తిరస్కరించిందని దీనర్ధం కావచ్చు. తదుపరి సమాచారం కోసం మీరు సంబంధిత క్రెడిట్ సంస్థ (CI) ను నేరుగా సంప్రదించవచ్చు లేదా మీరు మరొక్కసారి వివాద అభ్యర్ధనను సమర్పించవచ్చు, అప్పుడు మేము దానిని సంబంధిత CI తో మరోసారి నిర్ధారించుకుంటాము.

 

రిపోర్టును అప్డేట్ చేయడానికి ముందే CIBIL వినియోగదారునితో ఎందుకు సంప్రదించదు?
మీ CIBIL రిపోర్ట్పై లభ్యమయ్యే సమాచారం ఋణ సంస్థలు / క్రెడిట్ సంస్థలు (CIలు) CIBIL కు నివేదించిన సమాచారాన్ని బట్టి ఉంటుంది. CIBIL కు వాస్తవాలను ఖచ్చితంగా తెలియజేసే బాధ్యత CI కలిగి ఉంటుంది. అన్ని CI ల నుండి ఈ సమాచారాన్ని సమకూర్చి ఖచ్చితంగా అప్డేట్ చేయడమే CIBIL బాధ్యత. మీ CIBIL రిపోర్ట్లో ఏదైనా డేటా తప్పుగా ఉండటం మీరు కనుగొంటే, మీరు ఒక వివాద పరిష్కర ప్రక్రియను ప్రారంభించవచ్చు మరియు సంబంధిత CI తో ఆ తప్పులను ధృవీకరించుకుంటాము. ఏ మార్పులైనా మీ CIBIL రిపోర్టులో ప్రతిబింబించేలా CIBIL లో అప్డేట్ కావడానికి సంబంధిత CI చే అనుమతించబడాలి

 

వివాదం యొక్క ఫలితాలతో నేను సంతృప్తి చెందకపోతే ఎలా?
మీరు సంబంధిత క్రెడిట్ సంస్థ (CI) ను నేరుగా సంప్రదించడాన్ని ఎంచుకోవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా, మీరు వివాద అభ్యర్ధనను మళ్ళీ సమర్పించవచ్చు, అప్పుడు మేము దానిని మళ్ళో సంబంధిత CI తో నిర్ధారించుకుంటాము. సంబంధిత CI నిర్ధారణ లేకుండా మేము CIBIL రిపోర్టులో ఎటువంటి మార్పులు చేయలేమని గమనించండి.

 

రిపోర్టులో ఉన్న కొంత సమాచారం వివాదంలో ఉన్నదనే సందేశాన్ని నేను చూశాను? దీనర్ధం ఏమిటి?
మీ CIBIL రిపోర్ట్ లోని కొన్ని విభాగాలలోని సమాచారం వివాదంలో ఉందని ఒక హెచ్చరిక (క్రింది చిత్రంలో హైలైట్ చేసిన విధంగా) తెలుపుతుంది. వివాదం పరిష్కరించబడిన తర్వాతే అలర్ట్ నోటిఫికేషన్ తొలగించబడుతుంది.

raise a dispute

 

30 రోజుల్లో CI వివాదాన్ని పరిష్కరించకపోతే CIBIL ఎటువంటి చర్య తీసుకుంటుంది?
సంబంధిత క్రెడిట్ సంస్థ నిర్ధారించకుండా డేటాబేస్లోని ఏ సమాచారాన్ని CIBIL మార్చడం వీలుపడదు. వివాదం పరిష్కరించబడే వరకు బ్యాంకు / CI కు ప్రతిరోజూ రిమైండర్ పంపించే ఒక ఆటోమేటెడ్ విధానాన్ని మేము కలిగి ఉన్నాము.

 

వివాదం విషయంలో బ్యాంకు స్పందించిన తర్వాత సమాచారాన్ని అప్డేట్ చేయడానికి CIBIL ఎంత సమయం తీసుకుంటుంది?
ఋణమిచ్చిన క్రెడిట్ సంస్థలు (CI) నుండి మేము సరిదిద్దబడిన డేటా అందుకున్న తర్వాత, తక్షణమే మేము రికార్డులలో అప్డేట్ చేస్తాము.

 

నా ఖాతా 2 నెలల కంటే ఎక్కువ కాలంగా అప్డేట్ చేయబడలేదు. నేను ఏమి చేయాలి?
మీ ఖాతా అప్డేట్ కాకపోవడానికి 2 కారణాలు ఉండవచ్చు:

 • మీ ఇటీవలి డేటాని క్రెడిట్ సంస్థ CIBIL కు సమర్పించి ఉండకపోవచ్చు
 • మీ ఖాతాపై ఒక వివాదం కొనసాగుతూ ఉండవచ్చు

మీ క్రెడిట్ సంస్థను మీరు నేరుగా సంప్రదించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా వారిని అభ్యర్ధించవచ్చు..

 

నా ఖాతా వివరాలను అప్-డేట్ చేయాలని నేను CI ను సంప్రదించాను, అయితే నేను ఏ తదుపరి సమాచారాన్ని అందుకోలేదు?
CIBIL రికార్డుల్లోని మీ ఖాతాను అప్డేట్ చేయమని మీరు ఋణ సంస్థను నేరుగా సంప్రదించి ఉంటే, మీకు అప్డేట్ పంపాల్సిన బాధ్యత CI కలిగి ఉంటుంది. మీ ఖాతా యొక్క తాజా స్థితిని తెలుసుకోవడానికి మీరు మీ క్రెడిట్ సంస్థను సంప్రదించవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా, మీ ఖాతా యొక్క తాజా స్థితిని తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు.