మీ క్రెడిట్ చర్యలు మీ CIBIL స్కోరును
ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.
సిమ్యులేటర్ అంటే ఏమిటి?
స్కోర్ సిమ్యులేటర్ అనేది మీ ప్రస్తుత CIBIL రిపోర్ట్పై వివిధ ఋణ ప్రవర్తనలను ఆధారం చేసుకుని సిమ్యులేట్ చేయబడిన CIBIL స్కోర్ను అందించే ఒక టూల్. వివిధ ఋణ ప్రవర్తనలు మీ ప్రస్తుత CIBIL స్కోర్ను ఏవిధంగా ప్రభావితం చేయగలవో తెలుసుకోవడానికి మరియు దాని ఆధారంగా మీరు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకొనేలా చేయడానికి ఈ ఫీచర్ రూపకల్పన చేయబడింది.
స్కోర్ సిమ్యులేటర్ ఎలా పనిచేస్తుంది?
ఈ క్రింది వంటి వివిధ రకాల అనుకరణల నుండి ఎంచుకొనే వీలును స్కోర్ సిమ్యులేటర్ కలిగిస్తుంది
ఒక నిర్దిష్ట సిమ్యులేషన్ను ఎంచుకొన్నప్పుడు, సిమ్యులేషన్కు అవసరమైన కొన్ని అదనపు వివరాలను మిమ్మల్ని అడుగుతారు, ఉదాహరణకు మీరు క్రొత్త క్రెడిట్ కార్డును జోడించడానికి ఎంచుకుంటే, మిమ్మల్ని ‘క్రెడిట్ లిమిట్’ ఎంత అని అడుగుతారు. అదనపు వివరాలను ఎంటర్ చేసిన మీదట మీరు మీ సిమ్యులేటెడ్ CIBIL స్కోర్ను చెక్ చేసుకోగలుగుతారు.
నేను స్కోర్ సిమ్యులేటర్ను ఎక్కడ కనుగొనగలను?
స్కోర్ సిమ్యులేటర్కు యాక్సెస్ పొందాలంటే (1-నెల, 6-నెలలు లేదా 1-సంవత్సరం అపరిమిత యాక్సెస్) ఒక యాక్టివ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కలిగి ఉండాలి. మీరు ఒక యాక్టివ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ను పొందితే, మీ CIBIL ఖాతాలో స్కోర్ సిమ్యులేటర్ ట్యాబ్ క్రింద స్కోర్ సిమ్యులేటర్ను యాక్సెస్ చేయగలుగుతారు. పెయిడ్ సబ్స్క్రిప్షన్ కొరకు రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మీరు ఇప్పటికే పెయిడ్ సబ్స్క్రిప్షన్ కలిగి ఉంటే, లాగిన్ అయి పరిశీలించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
స్కోర్ సిమ్యులేటర్ను ఉపయోగిస్తే అది నా స్కోరుపై ప్రభావం చూపిస్తుందా?
<pస్కోర్ సిమ్యులేటర్ మీ ప్రస్తుత CIBIL స్కోరుపై ప్రభావం చూపించదు. స్కోర్ సిమ్యులేటర్ను ఉపయోగిస్తే మీ CIBIL రిపోర్టుపై ఉన్న ఏ వివరం మారదు/ అప్డేట్ కాదు. వివిధ క్రెడిట్ ప్రవర్తనలు మీ CIBIL స్కోరును ఎలా ప్రభావితం చేస్తాయో అనే విషయాన్ని మాత్రమే స్కోర్ సిమ్యులేటర్ సూచిస్తుంది.
స్కోర్ సిమ్యులేటర్ నాకు ఎలా సహాయపడుతుంది?
లోన్ అప్లికేషన్ ప్రక్రియలో CIBIL స్కోరు కీలక పాత్రను పోషిస్తుంది. మీ CIBIL స్కోరును వివిధ రకాల క్రెడిట్ ప్రవర్తనలు ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉందో అర్ధం చేసుకోవడం, మీ ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవడానికి అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
లీగల్ డిస్క్లెయిమర్లు: భిన్న క్రెడిట్ సాదృశ్యాలు మీ CIBIL స్కోరును ఎలా ప్రభావితం చేస్తాయో అర్ధం చేసుకోవడంలో సహాయపడటానికి స్కోర్ సిమ్యులేటర్ తయారుచేయబడింది. అయితే, ఎటువంటి ఫలితానికైనా హామీనివ్వడానికి స్కోర్ సిమ్యులేటర్ను ఒక అంచనా సాధనంగా ఉపయోగించలేము. సిమ్యులేటర్ కేవలం అవగాహన కలిగించడానికి మరియు సమాచారం అందించడానికి మాత్రమే ఉద్దేశించబడినది మరియు దీన్ని యూజర్ ఎంచుకున్న సాదృశ్యాల ఆధారంగా ఒక ఊహిత స్కోరుకు సూచనగా మాత్రమే ఉపయోగించాలి. ఇది ఒక అంచనా మాత్రమే మరియు ఇది హామీ ఇవ్వబడిన ఫలితాన్ని అందించదు. ఏవైనా సాంకేతిక సమస్యలతో సహా తలెత్తే అన్ని దోషాలకు TransUnion CIBIL కారణం కాదు లేదా బాధ్యత వహించదు. ఇంకా, సిమ్యులేటర్చే అందించబడ్డ సమాచారం / టూల్స్ ఫలితాలపై ఆధారపడి తీసుకున్న ఎటువంటి నిర్ణయాలు లేదా చర్యల ద్వారా కలిగే పరిణామాలకు TransUnion CIBIL కారణం కాదు మరియు / లేదా బాధ్యత వహించదు. యూజర్కు ఏ విధంగానైనా కలిగే నష్టాలు / క్లెయిములు / డ్యామేజీలకు TransUnion CIBIL జవాబుదారిగా మరియు/లేదా బాధ్యురాలిగా ఉండదు. అట్టి బాధ్యతలన్నిటినీ TransUnion CIBIL తిరస్కరిస్తుంది.