Skip to main content

పర్సనల్ లోన్స్

పర్సనల్ లోన్ అనేది ఒక స్వల్ప నుండి మధ్యస్థ టర్మ్ (అన్సెక్యూర్డ్) లోన్, ఇది మీకున్న ఇతర ఋణాలు తీర్చడానికి, ఒక విరామాన్ని ప్రణాళిక చేసుకోవడానికి, మీ గృహానికి నూతన సొబగులు దిద్దుకోవడానికి, లేదా ఒక విలాసవంతమైన వివాహాన్ని ప్రణాళిక చేసుకోవడానికి సామర్ధ్యాన్ని అందిస్తుంది. మీ అవసరాలకు తగిన వ్యక్తిగత ఋణాన్ని ఇప్పుడే కనుగొనండి!!

పర్సనల్ లోన్ అంటే ఏమిటి, దానిని దేని కొరకు ఉపయోగించవచ్చు?

పర్సనల్ లోన్ అనేది ఋణ గ్రహీతలు, వారికున్న వివిధ ఆర్ధిక అవసరాల కొరకు తీసుకునే ఒక అన్సెక్యూర్డ్ ఋణం. ఈ నిధులను ఉపయోగించే విధానంపై ఆంక్షలేవీ లేనందున దీనిని కొన్ని సార్లు ‘సకల-అవసరాల ఋణం’ అని కూడా పిలుస్తారు.

వ్యక్తిగత ఋణాలను పొందేవారు, ఆ నిధులను ఇతర ఋణాలు తీర్చుకోవడానికి, విహార యాత్రలకు, ఇళ్ళను తిరిగి ఫర్నిషింగ్ చేసుకోవడానికి, క్రొత్త ఉపకరణాలను కొనుగోలు చేయడానికి, వివాహ ఖర్చులకు, విద్య మరియు వైద్య ఖర్చులు మొదలైన వివిధ కారణాల కొరకు ఉపయోగిస్తారు. వ్యక్తిగత ఋణాలను న్యాయబద్ధంగా ఉపయోగించినప్పుడు అది మీ ఆర్ధిక స్థితితో పాటు క్రెడిట్ స్కోరును కూడా మెరుగు పరుస్తుంది.

Return to top

పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవాలి?

మీ జీవితంలోని ఆర్ధిక అవసరాలను తీర్చుకునే విషయంలో పర్సనల్ లోన్స్, మీకున్న చక్కటి మార్గాలు.

  • డెబ్ట్ కన్సాలిడేషన్ - మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా ఇతర అప్పులను సకాలంలో చెల్లించడం ద్వారా మీ అప్పులను ఒకే త్రాటి కిందికి తేవడానికి ఉపయోగపడుతుంది.
  • సత్వర ఆమోదం - పర్సనల్ లోన్ పొందేటప్పుడు, ఒక మంచి స్కోరుతో పాటు, తక్కువ డాక్యుమెంటేషన్ కూడా వేగవంతమైన ప్రాసెసింగ్కు ఉపకరిస్తుంది.
  • ఉపయోగించడంలో ఉండే అనుకూలత -మీరు నిధులు ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై పర్యవేక్షణ ఏదీ లేకపోవడం వలన, ఈ ఋణాన్ని ఏ రకమైన ఉపయోగానికైనా ఉపయోగించే వెసులుబాటును కలిగిస్తుంది.
  • అన్సెక్యూర్డ్ రకపు ఋణం - పర్సనల్ లోన్ పొందటానికి ఋణమిచ్చే సంస్థకు మీరు ఎటువంటి తాకట్టు/పూచీకత్తును సమర్పించాల్సిన అవసరం లేదు.
  • మీ క్రెడిట్ ప్రొఫైల్ను మెరుగుపరుస్తుంది -పర్సనల్ లోన్ అనేది మీ క్రెడిట్ రిపోర్ట్కు చేర్చబడే మరొక లైన్ ఆఫ్ క్రెడిట్, మీరు ఎప్పటికప్పుడు సమయానికి పేమెంట్స్ చేస్తూ దీనిని కొనసాగిస్తే, మీరు మీ క్రెడిట్ హిస్టరీ మరియు ప్రొఫైల్ను మెరుగుపర్చుకోవచ్చు.

Return to top

ఒక ఋణాన్ని మంజూరు చేసేముందు ఋణాలిచ్చే సంస్థలు దేనిగురించి చూస్తాయి?

మీ వ్యక్తిగత ఋణ అప్లికేషన్ ఆమోదించబడుతుందా లేదా తిరస్కరించబడుతుందా అనే విషయాన్ని నిర్ణయించే కారకాలు:

  • CIBIL స్కోర్ మరియు రిపోర్ట్: మీ క్రెడిట్ స్కోర్ మరియు రిపోర్ట్ అనేది మీ ఋణ ఆమోదాన్ని సుగమం చేసే అత్యంత ముఖ్యమైన పరామితుల్లో ఒకటి. మీరు ఋణమిచ్చే సంస్థలకు తనఖా/పూచీకత్తును అందించాల్సిన అవసరం ఏదీ లేదు కావున, మీరు ఒకవేళ చెల్లింపును ఎగవేస్తే వారి డబ్బును కోల్పోయే ప్రమాదంలో ఉంటారు. కావున, మీ లోన్ అప్లికేషన్ను ఆమోదించడానికి ముందు ఋణమిచ్చే సంస్థలు మీ క్రెడిట్ హిస్టరీని చాలా జాగ్రత్తగా విశ్లేషించి మూల్యీకరిస్తాయి. అధికంగా ఉండే CIBIL స్కోరు మీ ఋణం ఆమోదించబడే అవకాశాన్ని పెంచుతుంది.
  • ఉపాధి స్థితి: పర్సనల్ లోన్స్ అన్సెక్యూర్డ్ ఋణాలు కావడం వలన, ఋణాన్ని పొందగోరువారు గత కొన్నేళ్ళుగా స్థిర ఆదాయ వనరులను కలిగి ఉన్నారనీ, ఒక సుస్థిర ఉద్యోగాన్ని కలిగి ఉన్నారనీ నిర్ధారించుకోవడం ఋణాలిచ్చే సంస్థలకు తప్పనిసరి అవుతుంది. తరచూ ఉద్యోగాలు మారే చరిత్ర కల వ్యక్తి, ఋణ ఆమోదానికి ఒక ఆదర్శప్రాయమైనవారుగా పరిగణించబడకపోవచ్చు.
  • వార్షిక ఆదాయం: మీ వార్షిక ఆదాయం కూడా (జీతం మరియు ఇతర వనరుల నుండి) ఒక ముఖ్యమైన కారకం, ఇది మీ లోన్ను తిరిగి చెల్లించడానికి మిగులు సొమ్మును కలిగి ఉన్నారని సూచిస్తుంది.
  • EMI పేమెంట్: మీ క్రెడిట్ రిపోర్ట్ను మూల్యీకరించేటప్పుడు, ఋణమిచ్చే సంస్థలు, మీకున్న అన్ని ఋణాలు మరియు క్రెడిట్ కార్డ్ ఖాతాలకు సంబంధించి మీరు EMI తిరిగి చెల్లించే సరళిని మరియు ఫ్రీక్వెన్సీని పరిశీలిస్తారు. ఏ బకాయినీ మిగిల్చకుండా నెలవారీ పేమెంట్లు చేయడం అనేది, మీకున్న ఆర్ధిక క్రమశిక్షణను వ్యక్తపరుస్తుంది మరియు ఇది ఋణాలిచ్చే సంస్థలు మీకు ఋణాన్నివ్వడంపై ఒక నిర్ణయానికి రావడాన్ని సులభతరం చేస్తుంది.

Return to top

ఎంతెంత ఋణాన్ని, ఏయే వ్యవధులకు తీసుకోవచ్చు?

వ్యక్తిగత ఋణాలను కనిష్టంగా రూ. 10,000 నుండి రూ. 30,00,000/- వరకు తీసుకోవచ్చు. ఇది ఋణమిచ్చే సంస్థపై మరియు ఋణగ్రహీత తిరిగి చెల్లించగలిగే సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇది స్వల్ప కాల వ్యవధితో కూడిన లోన్ కావడం వలన, తిరిగి చెల్లించే మార్గాలు సాధారణంగా అనుకూలంగా ఉంటాయి, మరియు ఇవి ఋణమిచ్చే సంస్థ మరియు ఋణం పొందేవారి క్రెడిట్ ప్రవర్తన ఆధారంగా 12 నుండి 60 నెలల మధ్యలో ఉంటాయి. మీ వ్యక్తిగత ఋణార్హతను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Return to top

నేను అర్హత కలిగి ఉన్న వడ్డీ రేట్లు ఏమిటి?

వ్యక్తిగత ఋణాల వడ్డీరేట్లు వారి వ్యక్తిగత క్రెడిట్ హిస్టరీ మరియు ఋణంగా పొందుతున్న మొత్తంపై ఆధారపడి ఋణగ్రహీత నుండి ఋణగ్రహీతకు, ఋణదాత నుండి ఋణదాతకు మారుతుంటాయి. మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్, ను పొందండి, myCIBIL కు లాగిన్ అవ్వండి మరియు మీ CIBIL స్కోర్ మరియు ఇతర పరామితుల ఆధారంగా ఋణాలిచ్చే బ్యాంకులు మీకందించే ప్రత్యేక వడ్డీ రేట్లను (మరియు ఇతర సదుపాయాలను) పరిశీలించండి.

Return to top

 

ఋణమిచ్చే వడ్డీ రేటు వీటిపై ఆధారపడి ఉంటుంది:

  • మీ ఆదాయంతో పోల్చుతూ మీరు అందుకుంటున్న ఋణ మొత్తం
  • మీరు ఎంచుకుంటున్న ఋణ వ్యవధి
  • మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ నుండి పొందిన మీ క్రెడిట్ ప్రొఫైల్

Return to top

చెల్లించాల్సిన ఇతర ఫీజులు మరియు ఛార్జీలు ఏమిటి, వాటిని ఎప్పుడెప్పుడు చెల్లించాలి?

  1. మీరు పర్సనల్ లోన్ కొరకు అప్లై చేసినప్పుడు, ప్రాసెసింగ్ ఛార్జీలు సాధారణంగా, ఋణమొత్తంపై 2-3% గా ఉంటూ ఒక ఋణదాత సంస్థ నుండి మరో ఋణదాత సంస్థకు వ్యత్యాసం కలిగి ఉంటాయి.
  2. మీ ఋణాన్ని మీరు ముందుగా చెల్లిస్తే, అనగా, ఋణ వ్యవధి కంటే ముందే మీరు మీ ఋణాన్ని తీర్చివేస్తే, 2-3% మధ్య మారుతుండే ప్రీపేమెంట్ ఛార్జీలు విధించబడతాయి.

Return to top

ఒక ఋణం మంజూరు కావడానికి ఎంత సమయం పడుతుంది?

వ్యక్తిగత ఋణాలను వితరణ చేసే సమయం ఋణదాత సంస్థకు, ఋణదాత సంస్థకు మధ్య మారుతుంటుంది. మీ ఋణం ఆమోదించబడటానికి, మీకున్న ఋజువుల ఆధారంగా కనిష్టంగా 24 గంటల నుండి గరిష్టంగా 7 పని దినాల వరకు పట్టవచ్చు.

Return to top

వ్యక్తిగత ఋణానికి అప్లై చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

వ్యక్తిగత ఋణానికి అప్లై చేసుకునేటప్పుడు సమర్పించవలసిన డాక్యుమెంట్ల రకాలు ఒక ఋణదాత సంస్థ నుండి మరొక సంస్థకు మారవచ్చు. అయితే, అధిక శాతం ఋణమిచ్చే సంస్థలకు అవసరమయ్యే సాధారణ డాక్యుమెంట్లలో ఉండేవి:

వేతనదారులకు అవసరమయ్యే డాక్యుమెంట్లు:

  • ఐడెంటిటీ ప్రూఫ్: ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడి లేదా పాన్ కార్డ్
  • రెసిడెన్స్ ప్రూఫ్: ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడి లేదా వినిమయ బిల్లులు
  • వేతన ఖాతా యొక్క ఇటీవలి 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • గత 3 నెలల శాలరీ స్లిప్

స్వయం ఉపాధి కలిగిన వారికి అవసరమయ్యే డాక్యుమెంట్లు:

  • ఐడెంటిటీ ప్రూఫ్: ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడి లేదా పాన్ కార్డ్
  • రెసిడెన్స్ ప్రూఫ్: ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడి లేదా వినిమయ బిల్లులు
  • ఇన్కం ప్రూఫ్: గత రెండు సంవత్సరాలవి ఆడిట్ చేయబడిన ఆర్ధిక వివరాలు
  • గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్
  • ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్

Return to top

నేను దేని గురించి చూడాలి?

పర్సనల్ లోన్ కొరకు అప్లై చేసేటప్పుడు, మీ స్థోమతకు తగినంత ఋణాన్నే పొందేలా జాగ్రత్తవహించండి, లేదంటే మీరు మీ ఋణాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ దీర్ఘగా మరియు భారంగా ఉంటుంది, ఇది మీరొకవేళ బకాయి మొత్తాలు ఏవైనా కలిగి ఉంటే మీ క్రెడిట్ హిస్టరీని మరియు CIBIL స్కోరును ప్రభావితం చేయవచ్చు. మార్కెట్లో లభ్యమయ్యే ఋణాల్లో ఎక్కువ ఖరీదైన ఋణాల్లో పర్సనల్ లోన్ ఒకటి, కాబట్టి వీటికయ్యే వ్యయం మరియు ప్రయోజనాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించి అర్ధం చేసుకున్న తర్వాతనే వీటిని జాగ్రత్తగా ఎంచుకోండి.

Return to top

 

Document Checklist

DOCUMENTS REQUIREDPERSONAL LOANCREDIT CARDAUTO LOANHOME LOAN
Latest Credit Score & CIR*
Bank Statement
KYC docs (identity, signature & address proof)
Registration Papers   
Income Statement (such as salary slip)
Property Papers   
Last 3 years IT return ✓
(for self-employed only)
 ✓
(for self-employed only)
 

* This is an indicative list and may differ from lender to lender.

Loan Eligibility Calculator

Click here to check your loan eligibility and EMI calculator