లోన్ అప్లికేషన్ ప్రక్రియలో మీ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIR) అధిక పాత్ర పోషిస్తుంది, కావున మీకు ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే మీ లోన్ ఆమోదించబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీ క్రెడిట్ హిస్టరీ సరిగాలేక, మీ CIBIL స్కోరును మెరుగుపర్చుకోవాలనుకుంటే మీకున్న మార్గాలను అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. “క్రెడిట్ రిపేర్” సంస్థను సంప్రదించి వారికి అధికమొత్తంలో డబ్బు చెల్లించడం ఉత్తమ పరిష్కారం కాకపోవచ్చు." >CIBIL అనేది ఏ క్రెడిట్ రిపేర్ సంస్థకు అనుబంధమై లేదు.
సాధారణంగా, CIR తో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి:
మేము మీకు ఒక చర్యను సూచించడానికి ముందు, మీ క్రెడిట్ రిపోర్ట్ను చదివి అర్ధం చేసుకోవడం ముఖ్యం.
క్రింది దశలను అనుసరించండి:
1. స్కోర్ను కొనుగోలు చేయండి
మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ను కొనండి. ఇది మీకు కేవలం రూ. 550/- కే లభిస్తుంది మరియు 3 పని దినాల్లోనే మీ క్రెడిట్ రిపోర్ట్ను పొందవచ్చు.
2. క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించండి
మీ రిపోర్ట్ను అర్ధం చేసుకుని మెరుగుపడాల్సిన ప్రదేశాలను గుర్తించడానికి క్రింది దశలవారీ విధానాన్ని అనుసరించండి.
• మీ రిపోర్ట్లో ఓపెన్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు ఇక్కడ 2 సమస్యలు ఎదుర్కోవచ్చు:
దీనిని CIBIL యొక్క వివాద పరిష్కార ప్రక్రియ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చు. తప్పుగా తెలుపబడ్డ ఓపెన్ ఖాతాలు మీ క్రెడిట్ పలుకుబడిని తగ్గిస్తాయి.
“మాఫీ చేయబడిన” లేదా “సెటిల్ చేసుకున్న” ఖాతాను ఋణసంస్థలు ప్రతికూల దృక్పథంతో చూడవచ్చు. తప్పుగా ప్రస్తావించబడిన ఖాతా ఏదైనా ఉందేమో చూడండి. ఒకవేళ ఉంటే, CIBIL యొక్క వివాద పరిష్కార ప్రక్రియకు ఒక వివాదాన్ని సమర్పించండి
గడువు తర్వాతి రోజులు అనే విభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు “000” లేదా “XXX” కాకుండా వేరేవి వేటినైనా గుర్తిస్తే అది ప్రతికూలంగా పరిగణించబడవచ్చు. మీరు కొన్ని పేమెంట్లు తప్పితే, మీ బిల్లులు/EMIలు జాగ్రత్తగా చెల్లించేలా జాగ్రత్త వహించండి. మీ CIBIL స్కోర్ మెరుగవ్వడం ప్రారంభమవుతుంది. మీ స్కోరులో సానుకూల మార్పును చూడటానికి మీరు కనీసం 6-8 నెలలు వేచిచూడాలి (ప్రతికూల మార్పులేవీ లేకుండా అంతా సవ్యంగా కొనసాగితే)
3. చర్యను ప్రారంభించండి
పైన ఉదహరించిన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ఉపశమన చర్యను అర్ధం చేసుకోవడానికి మనం ప్రతి ఉదాహరణను విడిగా తీసుకుని అందుకు ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గమేమిటో చూద్దాం:
తప్పుగా పేర్కొనబడిన సమాచారాన్ని మీరు గుర్తించిన తర్వాత, ఇక్కడ క్లిక్ చేసి. వివాద పరిష్కార ప్రక్రియను ప్రారంభించండి. మీరు 30 రోజుల్లోగా CIBIL నుండి సమాధానం అందుకుంటారు. సదరు బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ మీ CIR లో కనిపించే సమాచారం సరియైనదేనని పునరుద్ఘాటిస్తే, ఇక మేము మీ రిపోర్ట్లో ఏ మార్పులూ చేయలేము. సంబంధిత బ్యాంకును నేరుగా సంప్రదించి ప్రక్రియను త్వరగా పూర్తిచేసుకోవడం మంచిది.
మీ ఉద్యోగం కోల్పోవడం ద్వారా లేదా ఇతర ఊహించని పరిస్థితుల వల్ల మీరు గతంలో చెల్లింపులు చేయకుండా తప్పితే, మీ ఆర్ధిక స్థితి మెరుగవ్వగానే సంబంధిత ఆర్ధిక సంస్థకు బకాయిపడ్డ మొత్తాన్ని తిరిగి చెల్లించడం మంచిది. అపరాధం లేని క్రెడిట్ హిస్టరీ భవిష్యత్తులో మెరుగైన క్రెడిట్ సదుపాయాలు పొందుకునేలా చేస్తుంది.
మీరు మీ ప్రదేశం మారేటప్పుడు, అవసరమైనప్పుడు మీ బ్యాంకు ఖాతాలు బదిలీ చేయడం లేదా మూసివేయడం మాత్రమే కాక కొనసాగుతున్న ఋణాలు మరియు క్రెడిట్ కార్డ్లను నిర్వహించుకోవడం కూడా వివేకవంతమైన చర్య. EMI పేమెంట్ మీ సేవింగ్స్ ఖాతాకు సంధానమై ఉంటే ఆ ఖాతాను మూసివేయకపోవడం (మరియు అందులో తగినంత డబ్బును ఉంచాలి) లేదా EMI డెబిట్ అవ్వడానికి ఇచ్చే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ను మీరు వాడుతున్న మరో బ్యాంకుకు బదిలీ చేయడం వంటివి తప్పకుండా చేయాలి. కానీ వీటన్నిటి మధ్యలో, చాలాసార్లు మనం క్రెడిట్ కార్డ్ జారీ చేసిన సంస్థకు ప్రదేశం మారుతున్నట్లు ముందుగానే చెప్పడాన్ని విస్మరిస్తాం, ఇది పేమెంట్లు తప్పడానికి, లేట్ పేమెంట్ ఫీజులు మరియు ఇతర సర్వీస్ ఛార్జీలు విధించబడటానికి దారితీసి చాపకింద నీరులా పెద్ద మొత్తంగా మారుతుంది. అటువంటి సందర్భంలో, మీ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించడం మీ బాధ్యత కావున పూర్తి మొత్తాన్ని చెల్లించివేయడం ఉత్తమ పరిష్కారం.
స్టేట్మెంట్ అందుకున్న, అందుకోకపోయినా, బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత క్రెడిట్ కార్డ్ హోల్డర్దే అని అధిక శాతం క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థల నియమ నిబంధనలు తెలియజేస్తున్నాయి. స్టేట్మెంట్ అందుకోని కారణంగా చెల్లింపు చేయకపోవడం అనేది తప్పిన పేమెంట్లకు ఒక పరిగణించదగ్గ కారణంగా ఉండదు (ఒకవేళ క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఒప్పందంలో ఇది ప్రస్తావించబడి ఉంటే). ఈ కారణం చేత మీరొకవేళ మీ చెల్లింపు చేయకుండా తప్పితే, లేట్ పేమెంట్ ఫీజు, సర్వీస్ ఛార్జీలు మొదలైనవి అదనంగా విధించబడతాయి. సమస్య ఎంత త్వరగా పరిష్కరించబడితే, మీ క్రెడిట్ హిస్టరీకి అంత మంచిది. బ్యాంకును సంప్రదించి ఒక సానుకూల పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవడం మంచిది
ఏదైనా క్రెడిట్ కార్డు లేదా ఋణాన్ని తీసుకోవడానికి ముందు, ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను తప్పనిసరిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మెయింటెనెన్స్ ఛార్జీలు (ఒక్కసారి విధించబడేవి, కొనసాగుతుండేవి), ఫీజులు, ఇన్సూరెన్స్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు, జరిమానాలు, వడ్డీ రేట్లు, బదిలీ ఛార్జీలు, ప్రీ-క్లోజర్ ఛార్జీలు మొదలైన వాటిని గురించి వాకబు చేయాలు
ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగితే ఆ విషయాన్ని బ్యాంకు విచారించి, అది కనుగొన్న అంశాల ఆధారంగా ఆ ఛార్జీలను ఉపసంహరించుకోవడం లేదా అలాగే ఉంచడం చేయవచ్చు. అట్టి వివాదాలు మీకు, బ్యాంకుకు మధ్య పరిష్కరించబడాలి, తద్వారా మీ క్రెడిట్ హిస్టరీ ప్రభావితం కాదు/అంతగా కాదు
క్రెడిట్ రిపేర్ సర్వీస్ మీ CIBIL క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నుండి ఏ సమాచారాన్ని తొలగించలేదు లేదా మార్చలేదు.
మీ తరుపున క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కొరకు అప్లై చేయమని ఏదైనా క్రెడిట్ రిపేర్ సంస్థకు మీరు అధికారం ఇస్తే మేము మీరు అందించిన ఇమెయిల్ అడ్రస్కు లేదా ఇంటి అడ్రస్కు రిపోర్ట్ను పంపిస్తాము (గోప్యత కొనసాగేలా చూడటానికి). మీ క్రెడిట్ సమాచారం గోప్యమైనది మరియు దానిని యధేచ్ఛగా షేర్ చేయకూడదు.
మీరు ఉచితంగా CIBIL యొక్క ఆన్లైన్ వివాద పరిష్కార ప్రక్రియను ఎంచుకోవచ్చు.
మీ క్రెడిట్ రిపోర్ట్కు మేము నేరుగా ఎలాంటి మార్పులు చేయలేము. సంబంధిత బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ అట్టి మార్పులను చేయడానికి మాకు అనుమతినివ్వాలి.