Skip to main content

మీ బిజినెస్ కొరకు క్రెడిట్ యాక్సెస్‌ని మెరుగుపరచాలని అనుకుంటున్నారా? దానిని ఎలా చేయాలనేది ఇదిగో

వ్యాపారాభివృద్ధికి సకాలంలో, మెరుగైన ఫైనాన్స్ యాక్సెస్‌ను పొందడానికి, MSMESలు CIBIL ర్యాంక్ మరియు కమర్షియల్ క్రెడిట్ రిపోర్ట్‌లపై పరిజ్ఞానాన్ని పొందాలి.

మన దేశ ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యతా విభాగమైన MSME అభివృద్ధికి ఆర్థిక అవగాహన లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకిగా తరచుగా ఉదహరించబడుతుంది. వ్యాపారాభివృద్ధికి సకాలంలో, మెరుగైన ఫైనాన్స్ యాక్సెస్‌ను పొందడానికి, MSMEsలు CIBIL ర్యాంక్ మరియు కమర్షియల్ క్రెడిట్ రిపోర్ట్‌లపై పరిజ్ఞానాన్ని పొందాలి.

MSME రంగం భారత ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తుందని, ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా MSME రంగం పునరుజ్జీవనానికి మద్దతు ఇస్తోంది.  ఉదాహరణకు, ఆత్మనిర్భర్ భారత్ ప్రోత్సాహ ప్రకటన ECLGS ద్వారా MSME రుణాలపై 100 శాతం క్రెడిట్ గ్యారంటీని కోసం ఏర్పాటు చేయబడింది. ఇది ప్రారంభించినప్పటి నుంచి, ప్రారంభించినప్పటి నుంచి MSME రుణాలపై ECLGS సానుకూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మహమ్మారి ప్రభావానికి ఎక్కువగా గురైన MSME విభాగాలైన చాలా చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాలు, వాణిజ్యం, రవాణా మరియు ఆతిథ్యం వంటి ఒత్తిడిలో ఉన్న రంగాలలో పనిచేస్తున్న MSMEలకు చాలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ECLGS మద్దతు దాని లక్ష్యాన్ని సాధించింది. సకాలంలో ఈ అర్థిక చేకూర్పు అందించడం వల్ల, MSMEలు తమ వ్యాపారాలను పునరుద్ధరించడానికి మరియు స్థిరమైన వ్యాపారాభివృద్ధికి అవకాశాలను పెంచుకోవడానికి సాయపడింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ECLGS) ప్రభావాన్ని అంచనా వేయడానికి, ట్రాన్స్‌యూనియన్ CIBIL డిసెంబర్ 2021 లో ECLGS 1.0 మరియు 2.0 పంపిణీల ఆధారంగా (31 మార్చి 2021 వరకు తయారు చేయబడింది) ECLGS రుణ విశ్లేషణ అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ అధ్యయనంలో భాగంగా ట్రాన్స్‌యూనియన్ CIBIL అన్ని భౌగోళిక ప్రాంతాలకు చెందిన MSMEలపై సర్వే నిర్వహించింది. 65 శాతం MSMEలు ECLGS ఆర్థిక చేకూర్పు తమ వ్యాపారానికి ఆర్థిక ఇబ్బందుల్లో సహాయపడిందని, 68 శాతం మంది భవిష్యత్తు సానుకూల దృక్పథంపై విశ్వాసంతో ఉన్నారని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.  తమ కంపెనీ క్రెడిట్ హిస్టరీ, CIBIL ర్యాంక్ ECLGS బట్వాడా చేయడాన్ని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించాయని 85 శాతం మంది ప్రతిస్పందకులు అంగీకరించారు.

మన దేశ ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యతా విభాగమైన MSME అభివృద్ధికి ఆర్థిక అవగాహన లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకిగా తరచుగా ఉదహరించబడుతుంది. వ్యాపారాభివృద్ధికి సకాలంలో, మెరుగైన ఫైనాన్స్ యాక్సెస్‌ను పొందడానికి, MSMEsలు CIBIL ర్యాంక్ మరియు కమర్షియల్ క్రెడిట్ రిపోర్ట్‌లపై పరిజ్ఞానాన్ని పొందాలి.

CIBIL ర్యాంక్ అంటే ఏమిటి?

రాబోయే 12 నెలల్లో MSME నిరర్థక ఆస్తులుగా (NPA)గా మారే సంభావ్యతను అంచనా వేయడానికి CIBIL ర్యాంక్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. 1 నుంచి 10 స్కేల్‌పై క్రెడిట్ హిస్టరీ డేటా ఆధారంగా MSMEలకు CIBIL ర్యాంక్‌‌ను ఇస్తుంది, తక్కువ రిస్క్ ఉన్న MSMEకు CIBIL ర్యాంక్ -1 ఉత్తమ ర్యాంకు, అత్యంత ప్రమాదకరమైన MSMEలకు CIBIL ర్యాంక్ -10గా ఇవ్వబడుతుంది. వాణిజ్య రుణాలను ఆమోదించడానికి ముందు బ్యాంకులు, రుణ సంస్థలు MSME ర్యాంక్ మరియు కమర్షియల్ క్రెడిట్ రిపోర్ట్‌ను మదింపు చేస్తాయి. కొన్ని బ్యాంకులు మరియు క్రెడిట్ సంస్థలు MSMEలకు రుణాలపై CIBIL ర్యాంక్ ఆధారిత ధరలను కూడా అందిస్తాయి, దీని ద్వారా మెరుగైన CIBIL ర్యాంక్ ఉన్న MSME రుణంపై తక్కువ వడ్డీ రేటును పొందవచ్చు. 
వేగంగా మరియు సులభంగా రుణాలు పొందడానికి మెరుగైన CIBIL ర్యాంక్‌ను ఎలా రూపొందించుకోవాలి?

సులభమైన మరియు వేగంగా క్రెడిట్ పొందడానికి CIBIL ర్యాంక్ ప్రాముఖ్యతను MSMEలు అర్థం చేసుకోవడం కీలకం. MSMEలు తమ స్వంత క్రెడిట్ హెల్త్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలి. MSMEలు ఆర్థిక అవకాశాలను పొందడానికి సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వీటిని చేయవచ్చు:

  • మీ సంస్థ పరిమాణంతో సంబంధం లేకుండా, పన్ను రిటర్నులు లేదా క్రెడిట్ స్టేట్‌మెంట్‌లు వంటి మీ కంపెనీ డాక్యుమెంటేషన్‌ను మీరు సిద్ధంగా ఉంచడం ఎప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వ్యవస్థీకృత ఆర్థిక రికార్డులు లేకపోవడం వల్ల మీ కంపెనీ అధికారిక మార్గాల ద్వారా క్రెడిట్ పొందడంలో ఇబ్బందిని ఎదుర్కొంటుంది.
  • మీ మొత్తం క్రెడిట్ ప్రవర్తనను మెరుగుపరుచుకోండి, మీ సంస్థ తిరిగి చెల్లింపులు మరియు రుణం తీసుకునే సరళిలో క్రమశిక్షణతో కూడిన విధానాన్ని తీసుకొనిరండి. మీ కంపెనీ CIBIL ర్యాంక్ ఆరు కంటే తక్కువగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు, తరువాత దానిని ఒకటి నుండి నాలుగు మధ్య పెంచడానికి క్రమపద్ధతిలో పని చేయవచ్చు. ఈ ర్యాంక్ ఆరోగ్యకరమైన ప్రొఫై‌ల్‌ను ప్రతిబింబిస్తుంది, తక్కువ రేటుతో అధికారిక రుణానికి ప్రాప్యతను అనుమతిస్తుంది.
  • మీ సంస్థ డబ్బు ఖర్చు చేయడం మరియు నిధులను పొదుపు చేయడంలో జాగరూకతతో కూడిన వైఖరి ఉండాలి. మీ వ్యాపార వ్యూహాన్ని రూపొందించేటప్పుడు, అవసరమైనతే సహాయాన్ని అందించే కంటింజెన్సీ ఫండ్ మీకు ఉండాలి. మీరు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించాలి మరియు మీ కంపెనీకి తలెత్తే అత్యంత చౌకైన రుణ అవకాశాలను గుర్తించాలి. 
  • ఒక MSME యజమానిగా, మీ CIBIL కంపెనీ క్రెడిట్ రిపోర్ట్‌లో ‌ ఎలాంటి గడువుతీరిన బకాయిలు లేదా అపరాధాలు లేవని మీరు ధృవీకరించుకోవాలి. ఏవైనా వ్యత్యాసాలు సంభవిస్తే మీరు మీ రుణదాతను సంప్రదించాలి. మీ నివేదికలోని డేటాకు సంబంధించి వివాదం తలెత్తితే ట్రాన్స్‌యూనియన్ CIBIL ను సంప్రదించవచ్చు. వివాద రకాన్ని బట్టి సంబంధిత బ్యాంకు/ ఆర్థిక సంస్థ దృష్టికి తీసుకెళ్తారు. అప్‌డేట్ చేసిన డేటాను రుణ సంస్థలు సమర్పించిన తర్వాత మాత్రమే CIBIL మీ కంపెనీ క్రెడిట్ రిపోర్టులో మార్పులు చేయగలదని దయచేసి గమనించండి.

క్లుప్తంగా చెప్పాలంటే, MSMEలు తమ వ్యాపార లక్ష్యాలను మరియు అభివృద్ధి ప్రణాళికలను సాధించడానికి చౌకైన మరియు వేగవంతమైన రుణాల లభ్యత ఎల్లప్పుడూ కీలక సహాయకారిగా ఉంది. క్రెడిట్ బిల్డింగ్ మరియు పర్యవేక్షణకు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అవలంబించడం ద్వారా; మీ వ్యాపారం/సంస్థ ఎల్లప్పుడూ రుణానికి సిద్ధంగా ఉండవచ్చు. అభివృద్ధి కథతో ముందుకు సాగడానికి, MSME యజమానిగా మీరు ఆరోగ్యకరమైన కంపెనీ క్రెడిట్ రికార్డును నిర్వహించడం మరియు వేగంగా రుణ యాక్సెస్ కోసం సిద్ధం కావడం చాలా అవసరం.

Disclaimer: The information posted to this blog was accurate at the time it was initially published. We do not guarantee the accuracy or completeness of the information provided. The information contained in the TransUnion blog is provided for educational purposes only and does not constitute legal or financial advice. You should consult your own attorney or financial adviser regarding your particular situation. This site is governed by the TransUnion Interactive privacy policy located here.