Skip to main content

లోన్‌కి సిద్ధంగా ఉండటానికి MSMEలు స్వీకరించాల్సిన మూడు దశలు

Print

MSMEలు "సూక్ష్మ, చిన్న లేదా మధ్యస్థ సంస్థలు"గా ప్రారంభమై ఉండవచ్చు,కానీ అవి త్వరగా ఈ స్థాయిని దాటిపోతున్నాయి. సమ్మిళిత చొరవలు మరియు ఆఫర్‌లు వ్యాపారాలను ప్రారంభించడంలో వాటికి సహాయపడటంలో బలమైన మరియు కీలకమైన పాత్ర పోషించిన భారత ప్రభుత్వం వారిని ముందుకు నడిపిస్తోంది. దీనికి అదనంగా, 2019 బడ్జెట్ GST-రిజిస్టర్డ్ MSMEలు అన్నింటికీ అదనపు ప్రయోజనాన్ని ప్రవేశపెట్టింది - 2% వడ్డీ రాయితీ కోసం రూ.350 కోట్లు కేటాయించారు, ఇది తాజా మరియు ఇంక్రిమెంటల్ లోన్‌లకు వర్తిస్తుంది. రూ.5,000 కోట్ల ఒత్తిడిలో ఉన్న అసెట్ ఫండ్‌ను సృష్టించడం ద్వారా MSME రంగానికి మెరుగైన రుణాలు పొందవచ్చని ఇటీవలి RBI రిపోర్ట్ సూచించింది.

ఇప్పుడు, ఈ ప్రోత్సాహాలు తమ కోసం పెద్ద మరియు మెరుగైన గుర్తింపును ఏర్పరుచుకోవడానికి సాయపడుతున్నప్పటికీ, MSMEలు తమ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి క్రెడిట్ మరియు లోన్‌లుఎలా సహాయపడతాయో నేర్చుకుంటున్నాయి. వారి సంస్థలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంలో సాయపడటానికి వారికి వేగవంతమైన, చౌకైన మరియు జాగ్రత్తగా మార్గనిర్దేశం చేయబడిన నిధుల లభ్యత అవసరం.

గత 2 సంవత్సరాలలో, CIBIL ర్యాంక్ MSMEలకు వారి రుణ ఎంపికల గురించి బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది మరియు ఈ వ్యాపార రుణాలకు వేగంగా, చౌకగా లభించడాన్ని సులభతరం చేసింది. ఎలా? CIBIL ర్యాంక్ అనేది కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ మరియు గత చెల్లింపుల సరళి యొక్క సంఖ్యా సారాంశం, అలాగే కంపెనీ భవిష్యత్తు తిరిగి చెల్లించే సామర్థ్యానికి సూచిక. రుణదాతలు వ్యాపార లోన్‌ని ఆమోదించాలా వద్దా, అలాగే వారు ఎంత మంజూరు చేయాలనేది నిర్ణయించడంలో వారికి సహాయపడటానికి దీనిని ఉపయోగిస్తారు. అధికారిక లోన్‌ ముఖచిత్రం ఎలా పనిచేస్తుందో MSMEలకు తెలుసు కాబట్టి, వారు తమ లోన్‌-అర్హతను పెంచుకోవడానికి బాగా సన్నద్ధం అవుతారు మరియు వారికి చాలా అవసరమైనప్పుడు వ్యాపార లోన్‌ అవకాశాలను పెంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు.

దిశగా పనిచేసేటప్పుడు MSMEలు గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి:

  1. లోన్‌దాతలకు సకాలంలో, ప్రతిసారీ చెల్లించండి.

ప్రతి రుణదాత-రుణగ్రహీత సంబంధం ముఖ్యమైనది, ప్రత్యేకించి రుణదాతలు రుణం తీసుకున్న కంపెనీ తిరిగి చెల్లించే విధానాలను CIBILకు నివేదిస్తారు - ఇది CIBIL ర్యాంక్‌ను నిర్ణయించడంలో కీలకమైన అంశంగా ఉంటుంది. తమ రుణదాతలకు MSMEలు సకాలంలో మరియు/లేదా రుణ కాలవ్యవధిలోపు తిరిగి చెల్లించడంపై దృష్టి పెట్టాలి, చెల్లింపులు డిఫాల్ట్ లేదా ఆలస్యం కావడాన్ని పరిహరించాలి. సకాలంలో చెల్లింపులు అధిక CIBIL ర్యాంక్ రూపొందించుకోవడానికి దోహదం చేస్తాయి. వచ్చేసారి వారు క్రెడిట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, వారి లోన్‌ ఆమోదం ప్రక్రియలో అధిక ర్యాంకు అనేది కీలక పాత్ర పోషిస్తుంది.

  1. జాగ్రత్తగా క్రెడిట్ కోసం అప్లై చేయండి.

MSMEలు తమ అభివృద్ధి వ్యూహాలను ప్లాన్ చేస్తున్నప్పుడు, వారు అధికారిక లోన్ ల్యాండ్‌స్కేప్ (వారికి లభ్యమయ్యే రుణదాతల) నుంచి రుణానికి దరఖాస్తు చేసుకోవడానికి చూడాలి. ఏదేమైనా, వేగంగా మరియు సులభంగా నిధులను పొందే ప్రయత్నంలో, వారు ప్రత్యామ్నాయ రుణ వనరులను ఆశ్రయించవచ్చు. అప్పుడు, ఈ నిధుల వనరులకు గ్యారంటీగా వివిధ పూచీకత్తులను డిమాండ్ చేయవచ్చు మరియు/లేదా MSMEలు తమ విలువైన వస్తువులను (ఆస్తిని కూడా) తాకట్టు పెట్టడానికి ఒత్తిడి చేయవచ్చు. మరీ ముఖ్యంగా, ఈ రకమైన లోన్‌లుఅధిక వడ్డీ రేట్లు వసూలు చేయవచ్చు.

బదులుగా, MSMEలు తమ కంపెనీ క్రెడిట్ హిస్టరీ మరియు రీపేమెంట్ సామర్థ్యాన్ని బట్టి మెరుగైన ఆఫర్‌లతో అధికారిక క్రెడిట్ ల్యాండ్‌స్కేప్‌లోని రుణదాతలను ఎంచుకోవడం ద్వారా రుణ ఉచ్చులో పడటాన్ని నివారించవచ్చు. మరీ ముఖ్యంగా, MSMEలు నిజంగా అవసరమైనంత మాత్రమే రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని గుర్తుంచుకోవాలి - ఇది రుణ ఉచ్చు నుండి బయటపడటానికి వారికి సహాయపడుతుంది.

  1. CIBIL ర్యాంక్ మరియు కంపెనీ క్రెడిట్ రిపోర్ట్ (CCR) ని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

CIBIL ర్యాంక్ అనేది MSME యొక్క మెరుగైన ఆర్థిక స్థితి మరియు తిరిగి చెల్లించే సామర్థ్యానికి ప్రతిబింబం. ర్యాంక్ మరియు CCR ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వారి క్రెడిట్ లావాదేవీలను పర్యవేక్షించడం, అలానే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని గుర్తించడంలో వారికి సహాయపడుతుంది. అంతేకాక, కంపెనీ ర్యాంక్ 1 కు ఎంత దగ్గరగా ఉంటే, లోన్‌ ఆమోదం పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వంటి కొన్ని రుణదాతలు MSMEలకు వాటి CIBIL ర్యాంక్ ఆధారంగా వ్యాపార లోన్‌లపై డిస్కౌంట్ వడ్డీ రేటును అందిస్తున్నాయి. MSMEలు తమ CIBIL ర్యాంక్ మరియు CCRను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి, తద్వారా వారు రుణం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ ఆఫర్‌లను ఉపయోగించుకోవడానికి లోన్‌కి సిద్ధంగా ఉంటారు.

ప్రస్తుతం MSMEలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి క్రెడిట్‌కు తమ యాక్సెస్‌ను ఉపయోగించుకోవచ్చు. వారు తమ వ్యాపారం యొక్క లోన్‌-అర్హత మరియు క్రెడిట్ ఆరోగ్యాన్ని - భవిష్యత్తులో తాము రుణాలను పొందడంలో కీలక అంశమైన అధిక CIBIL ర్యాంక్‌తో పెంచడానికి చురుకుగా పనిచేయాలి.

Disclaimer: The information posted to this blog was accurate at the time it was initially published. We do not guarantee the accuracy or completeness of the information provided. The information contained in the TransUnion blog is provided for educational purposes only and does not constitute legal or financial advice. You should consult your own attorney or financial adviser regarding your particular situation. This site is governed by the TransUnion Interactive privacy policy located here.