Skip to main content

ప్రశాంతంగా మరియు క్రెడిట్ స్పృహతో ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించండి

మనం మన రోజువారీ కార్యకలాపాల్లో ఒక నిర్దిష్ట లయకు అలవాటు పడినప్పటికీ, ఇటీవలి కోవిడ్-19 మహమ్మారి వంటి పరిస్థితులు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తాయి, ఇవి మన మానసిక ప్రశాంతత మరియు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. గత కొన్ని వారాలుగా, మనలో చాలా మంది మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను సాధిస్తున్నారు, మన ప్రియమైనవారి భద్రత మరియు రక్షణ బాధ్యతలు చేపడుతున్నారు, అదే సమయంలో తమ పని బాధ్యతలను సమానంగా నిర్వహిస్తున్నారు.

ఏదేమైనా, ప్రపంచ ఆర్థిక మందగమనం, ఇటీవల ఆర్థిక ఒత్తిళ్లు పెరగడంతో, మనమందరం మన వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడం మరియు ఈ అనిశ్చిత సమయాల్లో అందుబాటులో ఉన్న వనరులను ఆప్టిమైజ్ చేసే మార్గాలను వెతకడం చాలా ముఖ్యం. ప్రత్యేకించి మనం లోన్‌లు తీసుకున్నట్లయితే మరియు అకస్మాత్తుగా మన లోన్‌ కట్టుబాట్లను నెరవేర్చలేకపోతే, ఇది మన వ్యక్తిగత జీవితాలను మరియు ఖర్చులను ప్రభావితం చేస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మీరు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంటే మీ క్రెడిట్ వాగ్ధానాలను నిర్వహించడానికి మరియు సానుకూల క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి మీరు తీసుకోగల కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. 

  • మార్చి 27, 2020 శుక్రవారం RBI ప్రకటన టర్మ్ లోన్‌లు, రిటైల్ లోన్‌లు, క్రెడిట్ కార్డులు, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కింద వడ్డీ చెల్లింపుపై రుణగ్రహీతలకు 3 నెలల పాటు వాయిదాలు చెల్లించడంపై సడలింపులు ఇచ్చే అవకాశాన్ని రుణదాతలకు RBI కల్పించింది. మారటోరియం ఎంచుకోవడం మీ క్రెడిట్ హిస్టరీ లేదా CIBIL రిపోర్ట్‌పై ప్రభావం చూపదు. ఇది వాయిదా చెల్లింపు అని గుర్తుంచుకోవడం ముఖ్యం మరియు దానిపై బకాయి మొత్తాలు మరియు దానిపై వచ్చిన వడ్డీ మాఫీ చేయబడలేదు, కాబట్టి మీరు చివరికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దయచేసి వారి వ్యక్తిగత క్రెడిట్ పాలసీల కొరకు మీ రుణదాతను సంప్రదించండి.
  • పాజిటివ్ క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడంలో సకాలంలో చెల్లింపులు ఒక కీలకమైన అంశం, మరియు మీ నెలవారీ ఆదాయం ప్రభావితం కాకపోతే, మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు మరియు EMIలను సకాలంలో చెల్లించడాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ప్రత్యామ్నాయంగా, మీరు చెల్లింపును మిస్ అవుతారని అనుకుంటే, RBI సూచించిన విధంగా మీ రుణ EMIల మారటోరియం కాలం లేదా ఏదైనా ఇతర తిరిగి చెల్లింపు ఎంపికల గురించి చర్చించడానికి మీ రుణదాతను సంప్రదించండి.
  • ప్రస్తుత పరిస్థితిలో, చెల్లింపు గడువు తేదీల కంటే మీ కుటుంబ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, కానీ ఇక్కడ ఒక చిట్కా ఉంది. మీ క్రెడిట్ ఎక్స్‌ప్లోజర్‌ను తగ్గించండి మరియు ఒకే చెల్లింపు గడువు తేదీతో మాత్రమే మీ ఖర్చును ఒక క్రెడిట్ కార్డ్‌కు పరిమితం చేయండి — ఇది మీ చెల్లింపులను మెరుగ్గా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది.
  • మీ క్రెడిట్ బకాయిలను పూర్తిగా చెల్లించడం ఒక నియమం, కానీ అత్యవసరం లేదా ఆర్థిక ఒత్తిడి ఉంటే మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లుపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని చెల్లించడానికి ఎంచుకోవచ్చు. అయినప్పటికీ, మీకు వీలైనంత త్వరగా పూర్తి మొత్తాన్ని చెల్లించాలని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. (గమనిక: ఇది పైన పేర్కొన్న మారటోరియం కాలంతో గందరగోళానికి గురికాకూడదు.)
  • సమీప భవిష్యత్తులో మీరు ఏదైనా రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీ క్రెడిట్ బాధ్యతలను జాగ్రత్తగా పరిగణించండి. ప్రత్యేకించి మీ నెలవారీ ఆదాయం దెబ్బతింటుందని మీరు అనుకుంటే, మీ క్రెడిట్ ఎక్స్‌ప్లోజర్‌ను ఎక్కువ చేయవద్దు మరియు మీరు నిర్వహించే లేదా తిరిగి చెల్లించే సామర్థ్యం కంటే ఎక్కువ లోన్‌లులేదా క్రెడిట్ కార్డులను తీసుకోవద్దు.
  • మరిముఖ్యంగా ఇప్పుడు, మీ CIBIL స్కోరును క్రమం తప్పకుండా పర్యవేక్షించండి మరియు రిపోర్ట్ చేయండి. ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నదా అనే దాని కోసం మీ రిపోర్టును తనిఖీ చేయండి. గుర్తుంచుకోండి, మీ CIBIL స్కోరు మీ క్రెడిట్ ప్రొఫైల్ యొక్క ప్రతిబింబం, మీకు చాలా అవసరమైనప్పుడు రుణాన్ని పొందడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ తప్పుడు సమాచారం మీ స్కోరును తగ్గిస్తుంది మరియు రుణాన్ని పొందడానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండటానికి మీరు ఎల్లప్పుడూ క్రెడిట్ స్పృహ కలిగి ఉండాలి.
  • బడ్జెట్ వేసి ప్రణాళిక రూపొందించుకోవాలి. పరిస్థితి మీ ఆదాయం మరియు/లేదా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటే మీ రోజువారీ లేదా నెలవారీ బడ్జెట్ నుండి కొన్ని కోతలు విధించడాన్ని పరిగణించండి.

క్లిష్ట సమయాల్లో, మనం సానుకూలంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. మీరు ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్‌ కలిగి ఉండి మరియు మీ గత చెల్లింపులు బలంగా ఉంటే, RBI ప్రకటించిన మారటోరియం వంటి ఒక పరిస్థితి మీ మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌ను ప్రభావితం చేయదు. మీకు వీలైనంత వరకు మంచి క్రెడిట్ ప్రవర్తనను పాటించడం కొనసాగించండి. క్రెడిట్ స్పృహతో ఉండండి మరియు ఆర్థిక కష్టాల మధ్య కూడా మీ క్రెడిట్ ప్రొఫైల్‌తో కనెక్ట్ అవ్వండి.

 >> ఇప్పుడు సబ్‌స్క్రైబ్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి మరియు మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌తో మీ క్రెడిట్ ప్రొఫైల్‌కు కనెక్ట్ అవ్వండి.

Disclaimer: The information posted to this blog was accurate at the time it was initially published. We do not guarantee the accuracy or completeness of the information provided. The information contained in the TransUnion blog is provided for educational purposes only and does not constitute legal or financial advice. You should consult your own attorney or financial adviser regarding your particular situation. This site is governed by the TransUnion Interactive privacy policy located here.