Skip to main content

మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను భద్రపరచడం

Basic RGB

గత తొమ్మిది నెలలుగా, డిజిటల్ లావాదేవీలు మన రోజువారీ జీవితాల్లో ఒక పెద్దబాగంగా మారాయి. ఆన్‌లైన్ కొనుగోళ్ల నుంచి నగదు బదిలీ, అలానే రిటైల్ అవుట్‌లెట్‌ల వద్ద కార్డు పేమెంట్‌ల వరకు డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. అదే సమయంలో గుర్తింపు చౌర్యం, క్రెడిట్ మోసాలు కూడా పెరిగాయి. గుర్తింపు చౌర్యం అనేది ప్రతి 10 మంది భారతీయులలో నలుగురిని ప్రభావితం చేస్తుందనిచేస్తుందనిఏప్రిల్ 2020లో నార్టన్‌లైఫ్‌‌లాక్ యొక్క సైబర్ సేఫ్టీ ఇన్‌సైటస్ రిపోర్ట్ పేర్కొంది. దీని కోలుకోలేని ఫలితం ఏమిటంటే, బాధితులు ఆర్థికంగా తగిలే ఎదురు దెబ్బను ఎదుర్కొనాల్సి రావడం.

ఈ దీపావళి మీరు వివిధ ఈకామర్స్ సైట్‌లను బ్రౌజ్ చేసేటప్పుడు, ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లను తనిఖీ చేస్తూ మీ కార్ట్‌లను నింపేటప్పుడు, మీ వివరాలను నమోదు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఎవరైనా ఆన్‌లైన్ మోసగాళ్ల నుండి మీ ఆర్థిక సమాచారం, క్రెడిట్ కార్డ్ వివరాలు మరియు క్రెడిట్ ప్రొఫైల్స్‌ను సంరక్షించుకోండి.

మీ ఆన్‌లైన్ గుర్తింపును సంరక్షించడానికి మరియు క్రెడిట్ మోసానికి గురికాకుండా ఉండటానికి ఇక్కడ కొన్ని జాగరూక పద్ధతులు ఉన్నాయి ఈ దీపావళి:

  • ఫిషింగ్ టెక్నిక్‌ల గురించి జాగ్రత్త వహించండి: మార్కెటింగ్ ఇమెయిల్స్ లేదా సందేశాలు లేదా సోషల్ మీడియా ఛానెల్స్‌లో ఏదైనా అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు. లావాదేవీలు చేయడానికి ముందు బ్యాంకింగ్ వెబ్‌సైట్ లేదా పేమెంట్ ప్లాట్‌పారం URL ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. ఏదైనా వివరాలను నింపడానికి లేదా చెల్లించడానికి ముందు లాక్ ఐకాన్ మరియు 'https:' అక్షరాలను చూడటం అనేది ఒక సాధారణ టెక్నిక్. మోసగాళ్లు పంపే ఫిషింగ్ ఇమెయిల్స్ నకిలీ వెబ్‌సైట్‌కు మళ్లించడం ద్వారా కూడా మోసం చేయవచ్చు.
  • ఎలాంటి వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం లేదా OTPలను పంచుకోవద్దు: మోసగాళ్లు బ్యాంకు ఉద్యోగులవలే నటించి. మాయమాటలు చెప్పి వెరిఫికేషన్ కోసం OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను) పంచుకోమని అడుగుతారు. బ్యాంకులు, రుణదాతలు మరియు వాటి అధీకృత సిబ్బంది ఎన్నడూ ఫోన్ కాల్ ద్వారా OTPలను అడగరనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వివరాలను కోరుతూ మీకు ఫోన్ కాల్ వస్తే, వెంటనే హ్యాంగ్ చేయండి మరియు మీ బ్యాంకు/రుణదాతకు ఆ నెంబర్‌ను నివేదించండి.
  • ఎల్లప్పుడూ సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి: బహిరంగంగా అందుబాటులో ఉన్న Wi-Fi కనెక్షన్‌లను ఉపయోగించడం వల్ల, మీరు  సెల్యులార్ డేటా ఛార్జీలను ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది, కానీ ఇది మీ డేటాను హ్యాకర్‌లకు బహిర్గతం చేస్తుంది. మీరు ముఖ్యమైన టైమ్-సెన్సిటివ్ లావాదేవీ చేయాలని అనుకుంటే, సెల్యులార్ నెట్‌వర్క్ సురక్షితమైన ఎంపిక. తర్వాత, మీ ఇంటిలోని Wi-Fi బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సురక్షితంగా ఉందని ధృవీకరించుకోండి. మీరు అధిక స్థాయి సెక్యూరిటీని ఎంచుకోవడం ద్వారా దీనిని చేయవచ్చు — లభ్యమైతే Wi-Fi ప్రొటెక్టెడ్ II (WPA2), లేదా Wi-Fi ప్రొటెక్టెడ్ యాక్సెస్‌ (WPA)ని ఎంచుకోండి. ఈ లెవల్స్ వైర్‌లెస్ ఈక్వివలెంట్ ప్రైవసీ (WEP) ఎంపిక కంటే మరింత సురక్షితమైనవి.
  • మీరు ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిగత వివరాలను ఫిల్టర్ చేయండి: మీ పుట్టినతేదీ, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం సులభంగా దుర్వినియోగం అవుతుంది. మీ పేరును క్రెడిట్‌ని పొందడానికి ఉపయోగించుకోవడం మాత్రమే కాకుండా, దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, మీకు బ్యాంక్ నుండి కాల్ వచ్చే వరకు దీని గురించి మీకు తెలియకపోవచ్చు.
  • బ్యాంక్, ఫైనాన్స్ లేదా గుర్తింపు సంబంధిత డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా పారవేయండి: మీ పాన్, ఆధార్ కార్డులు, బ్యాంక్/ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, క్రెడిట్ రిపోర్టులు లేదా బిల్లుల భౌతిక కాపీలను పారవేసినప్పుడు, వాటిపై ముద్రించిన ఏదైనా సమాచారం ఒక్కచోటకు చేర్చలేనివిధంగా ముక్కలు చేసినట్లు నిర్ధారించుకోండి.
  • మీ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ మరియు వాలెట్ స్టేట్‌మెంట్‌లను నిశితంగా గమనించండి: మీ ఖాతా గురించి సమాచారాన్ని పొందడానికి మీ మొబైల్ ఫోన్‌పై లావాదేవీల కొరకు రిజిస్టర్ చేసుకోండి. మీరు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని గమనిస్తే, మీ ఆర్థిక సంస్థను సంప్రదించండి మరియు ఏదైనా తేడాగా ఉందనే సందేహం కలిగితే, వెంటనే దానిని రిపోర్ట్ చేయండి. మీ కార్డ్‌ను బ్లాక్ చేసి, ఫాలో-అప్ కోసం దీన్ని ఫ్లాగ్ చేయండి. ఈ విషయాలపై బాధితులు దృష్టి పెడుతున్నారా అనేది తెలుసుకోవడానికి, మోసగాళ్లు పెద్ద లావాదేవీలు చేయడానికి ముందు చిన్నపాటి లావాదేవీలు చేస్తారు.
  • మీ CIBIL రిపోర్టును క్రమం తప్పకుండా పర్యవేక్షించండి, ఏదైనా మోసపూరిత కార్యకలాపాలను ఫ్లాగ్ చేయండి: మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అనేది మీ అన్ని క్రెడిట్ కార్డులు మరియు రుణ ఖాతాలను ఒకేసారి పర్యవేక్షించడానికి ఒక అత్యుత్తమ మార్గం. మీ CIBIL రిపోర్ట్‌లోని 'ఖాతాల సమాచారం' విభాగం మీరు పొందిన అన్ని క్రెడిట్‌ల అవలోకనం లభిస్తుంది. ఈ విభాగాన్ని సమీక్షించి, మీ స్వంత ఖాతాలుగా మీరు గుర్తించని ఖాతాల విషయాన్ని CIBILకు తెలియజేయండి. మీరు CIBILకు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు మరియు మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌లో కీలక మార్పులను తెలియజేయడానికి CIBIL అలర్ట్‌లను కూడా పొందవచ్చు. క్రెడిట్ మోసం మరియు గుర్తింపు చౌర్యాన్ని సూచించే ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండటానికి మరియు సరి చేసుకోవడానికి ఇది మీకు సాయపడుతుంది.

అప్రమత్తంగా ఉండండి మరియు సురక్షితంగా ఉండండి! దీపావళి శుభాకాంక్షలు!

>> స్టాండర్డ్ మరియు ప్రీమియం CIBIL సబ్‌స్క్రిప్షన్‌తో లభ్యమయ్యే CIBIL అలర్ట్‌ల ద్వారా మీ క్రెడిట్ ప్రొఫైల్‌లో కీలక మార్పులకు సంబంధించిన సమాచారం పొందండి.

Disclaimer: The information posted to this blog was accurate at the time it was initially published. We do not guarantee the accuracy or completeness of the information provided. The information contained in the TransUnion blog is provided for educational purposes only and does not constitute legal or financial advice. You should consult your own attorney or financial adviser regarding your particular situation. This site is governed by the TransUnion Interactive privacy policy located here.