Skip to main content

మీ వన్-స్టాప్ హాలిడే షాపింగ్ క్రెడిట్ గైడ్

చక్కటి ప్రణాళికాబద్ధమైన ఖర్చు, సకాలంలో అయితే సౌకర్యవంతమైన రీపేమెంట్‌లు మరియు మీ క్రెడిట్‌యోగ్యతకు ఎలాంటి నష్టం వాటిల్లకపోలవడం అనేది ఆహ్లాదకరమైన హాలిడే సీజన్‌కు కీలం.

మీ హాలిడే వ్యయాన్ని ప్రారంభించడానికి ముందు, ఈ చెక్‌లిస్ట్‌ను సమీక్షించండి.

మీ క్రెడిట్‌ను తెలుసుకోవడం- మీ క్రెడిట్ కార్డు/ల గురించి మీకు ఎంత బాగా తెలుసు? మీ కార్డు/లను సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రతిసారీ సమీక్షించాల్సిన వివరాలు ఇవి: క్రెడిట్ పరిమితి, బకాయి ఉన్న బ్యాలెన్స్, బిల్ చేయని వినియోగం, పోగుపడ్డ రివార్డ్ పాయింట్‌లు, రివార్డ్ పాయింట్‌ల నిష్పత్తి (అనగా, ప్రతి పాయింట్‌కు ఎన్ని రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది) మరియు రీపేమెంట్ సైకిల్/లు. క్యాలెండర్‌లోని ప్రతి ఖర్చు పెరుగుదల అంటే– సెలవులు, పండుగలు, అనారోగ్యాలు, పిల్లల ఫీజులు లేదా మీ ఇంటిని నిర్మించడం/పునరుద్ధరించడానికి ముందు మీ కార్డ్ వివరాలను సమీక్షించండి.

మీ క్రెడిట్ సైకిల్‌ను తనిఖీ చేయండి – మీ క్రెడిట్ కార్డ్/ల బిల్లు సైకిల్స్‌కు అనుగుణంగా కొనుగోలు చేయడం (అనగా, బిల్లు ఉత్పత్తి అయిన వెంటనే) అంటే సాధారణంగా 30 నుండి 40 రోజుల వరకు బిల్లు జనరేట్ కావడానికి మరియు దాని గడువు తేదీ మధ్య సమయ వ్యవధిని మీరు గరిష్టంగా ఉపయోగిస్తున్నారని అర్థం. మీరు ఇంతకు దశను అనుసరిస్తే, మీ కుటుంబంలోని ప్రతి క్రెడిట్ కార్డు కోసం కొత్త సైకిల్ ప్రారంభానికి అనుగుణంగా మీరు మీ కొనుగోళ్లకు సమయం కేటాయించవచ్చు. ఈ విధంగా మీరు చెల్లింపులను దశలవారీగా చేయవచ్చు, ప్రతి కార్డు రీపేమెంట్ సైకిల్ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఆఫర్‌లోని అన్ని చెల్లింపు ఎంపికలను సమీక్షించండి – జీరో-వడ్డీ EMIలు, బై నౌ పే లేటర్ (BNPL), క్రెడిట్ కార్డ్ పాయింట్ల రిడెంప్షన్‌లు, ఇలా ఫైనాన్సింగ్ కొనుగోళ్ల విషయానికి వస్తే ఇవాళ భారతీయ షాపర్(షాపింగ్ చేసే వ్యక్తి) ముందు ఉండే ఎంపికలు చాలా విస్తృతమైనది. మీ కొనుగోళ్లకు నిధులు సమకూర్చడానికి ఈ వివిధ మార్గాల యొక్క అత్యంత ప్రణాళికాబద్ధమైన మిశ్రమాన్ని ఉపయోగించండి.

సరైన రకం ఖర్చు కోసం సరైన కార్డును ఉపయోగించండి - కేటగిరీ నిర్దిష్ట కార్డులను మీరు వారి ఉద్దేశిత కేటగిరీ కోసం ఉపయోగిస్తే మీకు ఉత్తమ పాయింట్ కన్వర్షన్‌ను అందిస్తుంది - ఉదాహరణకు, టికెట్లు మరియు హోటల్ బుకింగ్స్ వంటి ప్రయాణ ఖర్చులకు ట్రావెల్ కార్డ్ మీకు అత్యుత్తమైన రివార్డులను అందిస్తుంది, ఫ్యూయల్ కార్డులు ఇంధన ఖర్చులపై గొప్ప రివార్డులను అందిస్తాయి, ఫిన్‌టెక్ కార్డులు వడ్డీ లేని ఎంపికలతో రీపేమెంట్ సైకిల్‌ను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ ఎంపికల మధ్య వాడకాన్ని చక్కదిద్దడానికి ఖర్చు-భారీగా ఉండే సెలవుల సీజన్ అనువైన సమయం. కానీ జాగ్రత్తగా ఉండండి: అన్ని కార్డ్‌లపై ఆలస్యమైన/మిస్ అయిన చెల్లింపులప్రమాదం ఒకే విధంగా ఉంటుంది – ఆలస్యమైన మొత్తాలపై అధిక వడ్డీ మరియు మీ CIBIL స్కోర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ను సమీక్షించండి - మీరు CIBIL సబ్‌స్క్రైబర్ అయితే, ఇంకా మంచిది – మీ సీజన్ ఫైనాన్స్‌ను స్మార్ట్‌గా ప్లాన్ చేయడానికి దాని ఫీచర్లను ఉపయోగించండి. CIBIL క్రెడిట్ మానిటరింగ్ ఫీచర్ మీ స్కోర్ మరియు రిపోర్ట్‌కు అప్‌డేట్‌ల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మరియు CIBIL స్కోర్ సిమ్యులేటర్ దిగువ పేర్కొనటువంటి సిమ్యులేటర్‌లను అమలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది:

  • కొత్తరుణ ఖాతాను తెరవడం, క్లోజ్ చేయడం, లేదా ఉపయోగించుకోవడం,
  • క్రెడిట్ కార్డులపై బకాయి మొత్తాలను చెల్లించడం,
  • మీ యాక్టివ్ లోన్అకౌంట్‌లక లేట్ పేమెంట్‌లు జోడించడం, మరియు మరిన్ని

అప్పుడు మీరు మీ స్కోరు మరియు క్రెడిట్ ప్రొఫైల్‌పై వాటి ప్రభావాలను అధ్యయనం చేయవచ్చు మరియు మీ రాబోయే సీజనల్ ఖర్చు గురించి సమాచారం ఎంపిక చేయవచ్చు.

క్లుప్తంగా చెప్పాలంటే, హాలిడే సీజన్ కోసం అదనపు నిధులు/తిరిగి చెల్లించే సౌలభ్యానికి క్రెడిట్ మంచి వనరు - అయితే మీరు భరించగలిగే దానికన్నా ఎక్కువగా రుణం తీసుకోరాదనిని గుర్తుంచుకోండి. మీ ఖర్చులను సమీక్షిస్తూ ఉండండి, BNPL/సున్నా వడ్డీ EMIలు మరియు srkrxr చెల్లింపులు మీ ఫైనాన్స్‌లపై భారంగా మారకుండా చూసుకోండి. చక్కటి ప్రణాళికాబద్ధమైన ఖర్చు, సకాలంలో అయితే సౌకర్యవంతమైన రీపేమెంట్‌లు మరియు మీ క్రెడిట్‌యోగ్యతకు ఎలాంటి నష్టం వాటిల్లకపోలవడం అనేది ఆహ్లాదకరమైన హాలిడే సీజన్‌కు కీలం. హ్యాపీ హాలిడేస్!

Disclaimer: The information posted to this blog was accurate at the time it was initially published. We do not guarantee the accuracy or completeness of the information provided. The information contained in the TransUnion blog is provided for educational purposes only and does not constitute legal or financial advice. You should consult your own attorney or financial adviser regarding your particular situation. This site is governed by the TransUnion Interactive privacy policy located here.