మీ అర్థిక ఆరోగ్యానికి మీ CIBIL స్కోర్ కీలక సూచిక, ఆరోగ్యకరమైన ప్రొఫైల్ నిర్మించడానికి మరియు నిర్వహించడానికి మంచి క్రెడిట్ అలవాట్లు ముఖ్యం. వేగవంతమైన మరియు సులభంగా వచ్చే క్రెడిట్ యాక్సెస్ మార్గంలో ఉండే సాధారణ తప్పులు కొన్నింటిని చూద్దాము రండి.
సమయానికి బిల్స్ చెల్లించకపోవడం
ఒక్క చెల్లింపు చేయడం తప్పిపోయినా అది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ని నెగెటివ్ంగా కొడుతుంది. కొత్త అనుకూల చర్యలు జోడించబడుతూ సమయం గడచిన కొద్ది మీ స్కోర్ మీద ప్రభావం తగ్గినా కూడా, చాలా ఏళ్ళ వరకు ఒవర్‌డ్యు చెల్లింపులు మీ రిపోర్ట్‌లో కనపడటం. అయినప్పటికీ, ఒక్కసారి ఒవర్‌డ్యు చెల్లింపులు మీ రికార్డ్‌లోకి ప్రవేశిస్తే, అవి మీ క్రెడిట్ పురోగతిని నిలిపేస్తాయి.
చెల్లింపు రిమైండర్స్‌ని (మీ ఋణదాతలు ఇవి మీకు పంపించవచ్చు) సిద్ధం చేసి పెట్టుకోడానికి మంచి చిట్కా, ఇంకా మంచిదేమిటంటే, మీరు ఏ ఖాతా నుంచైతే చెల్లింపులు చేస్తారో దాని నుంచి ఆటోపే షిద్ధం చేసుకోవడం, అంటే ఆటో డెబిట్స్‌ని పూరించడానికి ప్రతి నెలా మీ ఖాతాలో సరిపడా డబ్బులు ఉన్నాయని మీకు నిర్థారించుకోవాలి.
కనీస చెల్లింపు' ఐచ్ఛికాని వాడడం
ప్రతి చెల్లింపు లేదా ఈఎంఐ అలర్ట్ చెల్లించగలిగే కనీస బకాయిని చెబుతుంది, కాని ఈ సదుపాయాన్ని వాడడం కేవలం అపాయకరమైన ప్రవర్తన కాదా, ఇది చివరికి చేసుకోడానికి చాలా వ్యయపూరితమైన అలవాటు. మీ అప్పుని ప్రతి నెలా చెల్లించేదాని కన్నా దీర్ఘకాలంలో మీకు ఎక్కూ డబ్బులు వడ్డీకే అవుతాయి. మరియు తుదకు, ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ని నష్టపరుస్తుంది.
ప్రతి నెలా కేవలం కనీస చెల్లింపు చేయడం ద్వారా, మీరు మీ క్రెడిట్ కార్డ్ పైన అధిక బ్యాలెన్స్‌ని మొస్తూ మిగులుతారు. ఇది మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని పెంచుతుంది, అనగా, ఇవ్వబడిన సమయంలో మీకు లభ్యతలో ఉండి మీరు వాడుతున్న క్రెడిట్ శాతం, ఒకవేళ తనిఖీ చేసుకోకుండా ఉంటే చెప్పుకోతగ్గ నష్టాన్ని చేయగలిగే కారణం. 30% కన్నా ఎక్కువ ఉన్న క్రెడిట్ వినియోగ నిష్పత్తి మీ స్కోర్స్‌ని క్రిందికి లాగడం ప్రారంభిస్తుంది. అందుకనే, అది ఎంత తక్కువ ఉంటే, అంత మంచిది.
ఒకేసారి చాలా క్రెడిట్ కోసం అప్లై చేసుకోవడం
మీరు క్రెడిట్ కోసం అప్లికేషన్ చేసుకున్న ప్రతిసారి, మీ రిపోర్ట్‌ను తనిఖీ చేయడానికి మరియు మీ అప్లికేషన్‌ను ఆమోదించాలా వద్దా అని నిశ్చయించుకోడానికి ఋణదాత హార్డ్ విచారణ చేస్తాడు. తక్కువ కాలంలో మీరు చాలా లోన్‌లకి అప్లికేషన్ చేసుకున్నప్పుడు, ఋణదాతలు మిమ్మల్ని అపాయకరమైన ఋణగ్రహీతగా చూడవచ్చు. కాబట్టి, మీ క్రెడిట్ ప్రొఫైల్‌కి నష్టాన్ని నివారించడానికి, మీకు అర్హత ఉన్న క్రెడిట్ కార్డ్స్ మీరు పరిశోధించడం ప్రారంభించవచ్చు. మీకు సరిపడేది అనిపించిన ఒకదానికి అప్పుడు అప్లై చేసుకోండి.
అనవసరమైన క్రెడిట్ తీసుకోవడం
మీరు ఒక సెలవు కోసం లేదా అవసరంలేని/అత్యవసరంకాని కొనుగోళ్ళ పైన పెద్దమొత్తంలో క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ తీర్చడానికి ఋణాన్ని తీసుకున్నారు అనుకుందాము. ఈ చర్యలు మీరు బడ్జెట్‌లో సమతులానికి మరియు మీ చెల్లింపు షెడ్యూల్ ఉంచుకోడానికి మరింత సవాలుగా అవుతుంది.
సులభమైన పరిష్కారం ఏమీటంటే అవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్ కొరకు అప్లై చేసుకోవడం, ఇందువల్ల మిమ్మల్ని మీరు ఆర్థికంగా సాగదీసుకొనక్కరలేదు మరియు ఒవర్‌డ్యు అయిన చెల్లింపులపై ఏదేని వడ్డీ/జరిమానాలు పెంచుకుంటూ పోవడాన్ని నివారించవచ్చు.
సరైన సావధానత లేకుండా ఋణాలకై సహ-సంతకాలు చేయడం
దగ్గరి స్నేహితులకు మరియు కుటుంబానికి ఋణం కొరకు సహ-సంతకం చేయడం అర్థ చేసుకోతగినది, కాని ఒకవేళ ఋణగ్రహీత వారి చెల్లింపులలో తప్పిపోయినా లేదా అలస్యం చేసినా అది మీకు సమస్యగా అవుతుంది. ఎందుకంటే మీ CIBIL స్కోర్ వారి సావధానతరాహిత్యం/క్షీణించిన క్రెడిట్ ప్రవర్తనతో నెగెటివ్ంగా ప్రభవితం చెందుతుంది. అందుకని, మీరు ఏదేని రుణాలకి సహ-సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ తరచుగా తనిఖీ చేయడంలేదా
మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ను పర్యవేక్షించుకోవడం మీరు మీ పురోగతిని చూసుకుంటూ ఉండడం మాత్రమే కాకుండా, ఇది మీరు సంభావ్య సమస్యలను కనుగొనడానికి మరియు చెప్పుకోతగ్గ నష్టంవాటిల్లే ముందే సరిదిద్దుంచుకోవడానికి సహాయం కూడా చేస్తుంది. ఒక CIBIL సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో మీరు మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ను వీలైనంత తరచుగా మీ ఇష్టంవచ్చినట్టు తనిఖీ చేసుకోవచ్చు మరియు అదనపు ఫీచర్స్ హోస్ట్ యాక్సెస్ పొందవచ్చు. లేదా, https://www.cibil.com/freecibilscore వద్ద ప్రతి క్యాలెండర్ సంవత్సరానికి ఒక్కసారి ఉచితంగా మీరు మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
క్లుప్తంగా, ఆరోగ్యకరమైన CIBIL స్కోర్ పొందడానికి సమయం పడుతుంది. ఒక్కసారి మీరు దాన్ని పొందితే, మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ క్రమబద్ధంగా తనిఖీ చేసుకోవడం, మీ బిల్స్ సమయానికి చెల్లించడం, మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ తక్కువగా ఉంచడం, మరియు అవసరంలేని అప్పుని నివారించడం, వంటి మంచి ప్రవర్తనలు ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ నిర్వహించడానికి సహాయపడతాయి. ఉన్నంతలో మంచి CIBIL స్కోర్ పొందడానికి మరియు నిర్వహించడానికి పైన చెప్పబడిన క్రెడిట్ తప్పుల జాబితా నుంచి దూరంగా ఉండండి.
Disclosure:
This post only contains educational information. No financial, tax or legal advice.
This information is for educational purposes only and we do not guarantee the accuracy or completeness of this information. This information does not constitute financial, tax or legal advice and you should consult your own professional adviser regarding your situation. This website may contain links to third party websites. We are not responsible for their content or data collection. Trademarks used in this material are property of their respective owners and no affiliation or endorsement is implied.