కొత్త రుణగ్రహీతలకు, అంతటా ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ నిర్మించుకోవడం మరియు దానినే నిర్వహించుకోవడం నిరుత్సాహపరిచే పనికావచ్చు. అయినప్పటికినీ, సరైన క్రమంలో మొదలుపెడితే ఏ పనైనా సులువైపోతుంది. కొత్త రుణగ్రహీతలకు, ఇంకా సాధారణంగా క్రెడిట్-కి-కొత్తైన (NTC) వినియోగదారులకు, ఆరోగ్యకరమైన CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ ఉండడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది తక్కువ వడ్డీ రేట్లకు లోన్‌లు మరియు క్రెడిట్ కార్డ్‌లు పొందే మీ అర్హతని ప్రభావితం చేస్తుంది.
దాన్ని మరింత బాగా అర్థం చేసుకోడానికి, క్రెడిట్-కి-కొత్త రుణగ్రహీతలను సూచించే పదం. ఎవరికైతే ఇంతకు ముందు క్రెడిట్ హిస్టరీ లేదో మరియు ఇప్పుడే వారి మొట్ట-మొదటి సంప్రదాయ క్రెడిట్ ప్రాడక్ట్ కన్ష్యూమర్ డ్యూరబుల్ లోన్, పర్సనల్ లోన్, అగ్రికల్చరల్ లోన్, టూ-వీలర్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, లేదా వేరే క్రెడిట్ ప్రాడక్ట్ వంటివి తీసుకున్న వ్యక్తులని అర్థం. TransUnion ద్వారా ఇటీవలే చేయబడిన ఒక గ్లోబల్ అధ్యయనం కూడా క్రెడిట్-కి-కొత్తైన వినియోగదారులు భారతదేశంలోని స్థిరమైన అర్థిక ఇన్‌క్లూషన్ మరియు ఆర్థిక స్థితి అభివృద్ధికి కీలకమైన దోహదకారులని ఎత్తి చూపించింది.
ఈ వ్యాసంలో, మనము ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉండడం, మరియు NTC వినియోగదారులు ఎలా ఆరోగ్యకరమైన CIBIL స్కోర్ నిర్వహించుకోవాలి అనే దాని ప్రాముఖ్యతను గురించి చర్చించుకుందాము.
మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ని అర్థం చేసుకోవడం
మీ క్రెడిట్ ప్రొఫైల్‌ని నిర్మించుకునే ప్రయాణంలో మొదటి అడుగు మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ని అర్థం చేసుకోవడం. CIBIL స్కోర్ 300 నుంచి 900 పరిధిలో ఉండే మూడు-అంకెల నంబరు, CIBIL రిపోర్ట్ అంటే ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ హిస్టరీలోని వివరణాత్మక సంక్షిప్తం. CIBIL స్కోర్ ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ యోగ్యతకు సంఖ్యాత్మక ప్రాతినిధ్యం. స్కోర్ మరియు రిపోర్ట్ రెండూ మీ క్రెడిట్ హిస్టరీ ఆధారితంగా లెక్కించబడతాయి, దీనిలో మీ క్రెడిట్ అకౌంట్స్, పేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యుటిలైజేషన్, మరియు క్రెడిట్ హిస్టరీ లెంగ్త్ వంటి సమాచారంతో సహా ఉంటుంది. రిపోర్ట్ ఇంకో అడుగి ముందుకేసి, మీ క్రెడిట్ అకౌంట్స్, పేమెంట్ హిస్టరీ, మరియు క్రెడిట్ ఎంక్వైరీల గురించిన సమాచారంతో సహా కూడా ఉంటుంది.
రుణదాతలు మీ CIBIL స్కోర్‌ని మీరు సమయానికి అప్పులను తిరిగి చెల్లించే సంభావ్యతను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు, మరియు మీ క్రెడిట్ యోగ్యతను గుర్తించేందుకు మరియు అప్పు ఇచ్చే నిర్ణయాలు తీసుకోవడానికి రుణదాతకు రిపోర్ట్ సహాయపడుతుంది.
తప్పులు లేదా మోసం వల్ల మీ ఆర్థిక ఆరోగ్యానికి జరిగే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి మీ క్రెడిట్ రిపోర్ట్‌ని క్రమబద్ధంగా పర్యవేక్షించడం కీలకం. తేడాలు లేదా మోసపూరిత చర్యలను గుర్తించడం ద్వారా, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపరచుకోవడానికి, మరియు క్రెడిట్ లేదా లోన్‌లు పొందడంలో కష్టాల్ను తొలగించుకోవడానికి చర్య తీసుకోవచ్చు. TransUnion CIBIL వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా కొత్త రుణగ్రహీతలు వారి ఉచిత వార్షిక క్రెడిట్ రిపోర్ట్‌కి యాక్సెస్ పొందవచ్చు.
సరిగ్గా మొదలు పెట్టడం - మంచి క్రెడిట్ ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు నిర్మించుకోవడం
ఇలానే ఉంచుకోండి - మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ని నిర్వహించుకోవడం
చిన్నగా ప్రారంభించడం ద్వారా, క్రెడిట్ స్కోర్స్ మరియు రిపోర్ట్స్ ఎలా పని చేస్తాయో అర్థం చేసుకోవడం, బాధ్యతాయుత రుణగ్రహీతగా ఉండడం, మరియు మీ క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరచుకోడం వైపు అడుగులు వేయడంతో, భవిష్యత్తులో విజయవంతమైన ఆర్థికస్థితి వైపుకి మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవచ్చు.
Disclosure:
This post only contains educational information. No financial, tax or legal advice.
This information is for educational purposes only and we do not guarantee the accuracy or completeness of this information. This information does not constitute financial, tax or legal advice and you should consult your own professional adviser regarding your situation. This website may contain links to third party websites. We are not responsible for their content or data collection. Trademarks used in this material are property of their respective owners and no affiliation or endorsement is implied.