Skip to main content

మీ బంగారు ఆభరణాలు మీరు రుణాన్ని పొందడానికి ఎలా సహాయపడతాయో ఇక్కడ ఉంది

ధంతేరాస్ పండుగను కొత్త వెంచర్ ప్రారంభించడానికి లేదా బంగారం లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి శుభ సందర్భంగా భావిస్తారు. బంగారం భారతీయ వినియోగదారులకు సంపద మరియు సంవృద్ధిని సూచించడమే కాకుండా, బంగారం విలువ చాలా అరుదుగా క్షీణిస్తుంది కాబట్టి ఇది పెట్టుబడిగా పరిగణించబడుతుంది. వినియోగదారుడు బంగారంపై మంచి రాబడిని పొందవచ్చు, ఇది కొనుగోలు విలువ కంటే ఎక్కువగా ఉంటుంది, తద్వారా ఇది ఇష్టపడే పెట్టుబడి ఎంపికగా మారుతుంది. ఏదేమైనా, అత్యవసర నగదు అవసరం ఉన్నప్పుడు బంగారాన్ని ఉపయోగించడానికి మంచి మార్గాలలో ఒకటి బంగారంపై లోన్‌ కోసం దరఖాస్తు చేయడం (దీనిని గోల్డ్ లోన్ అని కూడా పిలుస్తారు). మీకు నిజంగా అవసరమైనప్పుడు రుణాన్ని పొందడానికి ఇది శీఘ్ర మరియు ఇబ్బంది లేని మార్గం. నేడు, అనేక బ్యాంకులు మరియు NBFCలు వ్యక్తిగత లోన్‌లు మరియు క్రెడిట్ కార్డుల వంటి ఇతర రకాల రుణాలతో పోలిస్తే చాలా పోటీగా గోల్డ్ లోన్‌లను అందిస్తున్నాయి.

గోల్డ్ లోన్ కోసం అప్లై చేయడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి: 

  • సులభమైన డాక్యుమెంటేషన్

మీరు మీ బంగారు ఆభరణాలు వంటి ఖరీదైన ఆస్తిని తాకట్టు పెడుతున్నారు కాబట్టి, మీరు రుణదాతకు మరే ఇతర సెక్యూరిటీ/పూచీకత్తును సమర్పించాల్సిన అవసరం లేదు. రుణదాతలు గుర్తింపు రుజువు (మీ పాన్ కార్డు, ఓటరు ఐడి లేదా ఆధార్ కార్డు వంటివి) మరియు చిరునామా రుజువు (మీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా విద్యుత్ బిల్లు వంటివి) వంటి పత్రాల జాబితాను అడగవచ్చు.

  • వేగవంతమైన ప్రాసెసింగ్ సమయం

లోన్‌లకు బంగారం సెక్యూరిటీగా మద్దతు ఇస్తుంది మరియు రుణదాత డిఫాల్ట్ అయితే బంగారు ఆస్తులను విక్రయించడానికి ఎంచుకోవచ్చు. దీనివల్ల కొన్ని రుణదాతలు కొన్ని గంటల్లో లోన్‌లు మంజూరు చేయడంతో ప్రాసెసింగ్ సమయం తగ్గుతుంది.

  • సౌలభ్యం మరియు సరళత్వం

పర్సనల్ లోన్ మాదిరిగానే, బంగారంపై లోన్‌ తీసుకునేటప్పుడు మీరు అంతిమ వినియోగాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు, తద్వారా మీరు దానిని ఏదైనా అత్యవసర ఆర్థిక అవసరాలకు ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది, బంగారు రుణాలను ఉపయోగించడానికి సరళంగా చేస్తుంది.

  • తక్కువ వడ్డీరేటు

ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి వ్యక్తిగత లోన్‌లతో పోలిస్తే రుణదాతలు తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తారు.  ఇది మారుతూ ఉన్నప్పటికీ, గోల్డ్ లోన్ కోసం వడ్డీ రేటు ప్రతి రుణదాతకు మారుతుంది మరియు అదనపు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు 9.24% నుండి 17% మధ్య ఉంటుంది.

  • క్రెడిట్ మిక్స్ సమతుల్యంగా ఉండటం

బంగారంపై లోన్‌ అనేది సెక్యూర్డ్ లోన్ రకం, ఇది మీ బంగారు వస్తువులను బ్యాంకు లేదా రుణదాతకు పూచీకత్తుగా తాకట్టు పెట్టడం ద్వారా పొందవచ్చు. దీనికి బదులుగా, ప్రస్తుత మార్కెట్ విలువ, బంగారం నాణ్యత మరియు రుణదాతల నియమనిబంధనలు వంటి అంశాల ఆధారంగా మీరు 70 - 80 శాతం వరకు పొందవచ్చు. సెక్యూర్డ్ లోన్ మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఎందుకంటే రుణదాతలు వినియోగదారుల సురక్షిత మరియు అసురక్షిత లోన్‌ల ఆరోగ్యకరమైన మిశ్రమాన్ని సానుకూలంగా చూస్తారు.

  • తక్కువ లోన్‌ కాలపరిమితి

మీరు మీ రుణదాతను బట్టి బంగారంపై 1 నెల నుండి 5 సంవత్సరాల వరకు లోన్‌ పొందవచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ కాలపరిమితి మరియు స్వల్పకాలిక లోన్‌ మీ క్రెడిట్ రీపేమెంట్‌ను మీకు అనుకూలమైన రీతిలో ప్లాన్ చేయడానికి మీకు సహాయపడుతుంది.

అయితే గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రుణాన్ని తిరిగి చెల్లించని పక్షంలో రుణదాతలు అధిక వడ్డీ రేట్లు విధించడం లేదా బకాయి మొత్తాలను రికవరీ చేయడానికి మీ బంగారు వస్తువులను వేలం వేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు.  మీరు బంగారంపై లోన్‌ తీసుకోవాలనుకుంటే, క్రెడిట్ స్పృహతో మరియు క్రెడిట్ అవగాహన కలిగి ఉండటానికి మీకు సాయపడే రెండు చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

  • బాధ్యతాయుతంగా రుణం పొందాలని గుర్తుంచుకోండి: మీరు కోరుకునే మొత్తానికి బదులుగా మీకు నిజంగా అవసరమైన మొత్తానికి మాత్రమే దరఖాస్తు చేయండి. మీ బంగారు ఆభరణాలపై గోల్డ్ లోన్‌లు సురక్షితంగా ఉంటాయి. అయితే మీరు ఎన్ని ఆభరణాలపై లోన్‌ తీసుకుంటున్నారు, లోన్‌ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.
  • మీ CIBIL స్కోర్‌ను రూపొందించడానికి దీన్ని ఉపయోగించండి: మీ రుణదాత మీ లోన్‌ చెల్లింపులను (లేదా చెల్లింపుల్లో ఆలస్యం) తిరిగి CIBIL మరియు ఇతర క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తాడు. ఇతర కారకాలతోపాటుగా సకాలంలో తిరిగి చెల్లించడం అనేది CIBIL స్కోరును నిర్మించడంలో మీకు సహాయపడుతుంది మరియు మీ భవిష్యత్తు రుణాలను పొందడాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రతిసారీ సకాలంలో చెల్లించాలని గుర్తుంచుకోండి.

బంగారంపై లోన్‌లు, అనేక ఇతర క్రెడిట్ ఎంపికల మాదిరిగానే, త్వరగా రుణాన్ని పొందడానికి మీకు సహాయపడతాయి, అందువల్లనే ప్రస్తుతం బంగారం ఒక మంచి పెట్టుబడి అవకాశంగా మారుతుంది. దయచేసి రుణదాతల ఫైన్ ప్రింట్‌ని (చిన్న అక్షరాల్లో ముద్రించే నియమనిబంధనలను) జాగ్రత్తగా చదవండి మరియు వివేచనాత్మక క్రెడిట్ నిర్ణయం తీసుకోండి. మీ క్రెడిట్ ప్రొఫైల్ దానిపై ఆధారపడి ఉంటుంది.

Disclaimer: The information posted to this blog was accurate at the time it was initially published. We do not guarantee the accuracy or completeness of the information provided. The information contained in the TransUnion blog is provided for educational purposes only and does not constitute legal or financial advice. You should consult your own attorney or financial adviser regarding your particular situation. This site is governed by the TransUnion Interactive privacy policy located here.