Skip to main content

మంచి క్రెడిట్ హెల్త్‌ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి ఒక జెన్ జెడ్ గైడ్

Creditworthiness - 2

మీరు ఇవాళ తీసుకునే చర్యలు ఏళ్ల తరబడి మీ క్రెడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్లిపోతాయి. మీ స్వంత డబ్బుకు యాక్సెస్‌తో మీరు జీవితం ప్రారంభించేటప్పుడు మీ కోసం 6 శీఘ్ర ఆర్థిక జీవిత పాఠాలు ఇక్కడ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాలో జెన్ జెడ్‌లు సుమారు 26% ఉన్నారు, అంటే 1995 మరియు 2012 మధ్య జన్మించిన 2 బిలియన్ మంది (2022 లో 10 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు) వాస్తవానికి, మీరు కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇంటర్నెట్‌తో పెరిగిన మొదటి తరం.

మీలో పెద్దవారు ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, లేదా పనికి చేరడానికి గ్రాడ్యుయేట్‌లు అవుతున్నారు, కాబట్టి మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తారనే పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వయస్సులో ఆర్థిక అక్షరాస్యత అనేది మీరు ఇప్పుడు మరియు తరువాత జీవితంలో డబ్బుతో సరైన సంబందాలు మరియు నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడే కీలకమైన జీవన నైపుణ్యం.

మీ స్వంత డబ్బుకు యాక్సెస్‌తో మీరు జీవితం ప్రారంభించేటప్పుడు మీ కోసం 6 శీఘ్ర ఆర్థిక జీవిత పాఠాలు ఇక్కడ ఉన్నాయి.

ముందుగా, బాధ్యతాయుతమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించడం

చాలా జెన్ జెడ్‌లకు రుణదాత పరిశీలించడానికి ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేదు, కానీ ఖాళీ క్రెడిట్ రిపోర్ట్ చెడ్డది కాదు. మీరు అధీకృత / సురక్షిత వినియోగదారుగా క్రెడిట్ కార్డును పొందవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న అధిక CIBIL స్కోరుదారుడి క్రెడిట్ కార్డు (తల్లిదండ్రులు లేదా పెద్ద తోబుట్టువులు) లేదా జారీ చేసే బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్‌లకు వ్యతిరేకంగా పొందిన కార్డుకు యాడ్-ఆన్ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, మీరు ఒక్కసారి కార్డును పొందిన తరువాత, దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించండి. ఇది ముందుగానే మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించుకోవడానికి సహాయపడుతుంది (సెక్యూర్డ్ కార్డ్ అంటే ఖర్చుపై నిర్ణీత గరిష్ట పరిమితి ఉన్న కార్డు) బహుశా మీకు మీ వేతన ఖాతా ఉన్న లేదా మునుపటి సంబంధం ఉన్న బ్యాంకు నుండి తక్కువ-పరిమితి కలిగిన క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం అనేది మరో ఎంపిక.

మీరు అప్లై చేయడానికి ముందు ప్లాన్ చేయండి

క్రెడిట్ కార్డును పొందడానికి సంబంధించి మీకు ఏకైక వ్యూహం, ఎలాగైనా ఒక కార్డును పొందడం అయితే. వేచి ఉండండి మీరు ముందుగా కాస్తంత సమాచారం తెలుసుకోవాలి. మీరు ఇప్పటికే అప్లై చేసినట్లయితే, దీనిని తెలుసుకోకుండా మళ్లీ చేయవద్దు: మీరు క్రెడిట్ కార్డు లేదా రుణం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ, 'హార్డ్ ఎంక్వైరీ' లేదా 'హార్డ్ పుల్' అని పిలిచే ఒక రకమైన బ్యాక్ గ్రౌండ్ తనిఖీ నిర్వహించడానికి మీరు బ్యాంకుకు అనుమతి ఇస్తున్నారు. ఆర్థిక సంస్థలచే అనేక మరియు/లేదా తరచుగా క్రెడిట్ ఎంక్వైరీలు మీ CIBIL స్కోరు అంటే మీ క్రెడిట్ అర్హత యొక్క 3-అంకెల సూచికపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ క్రెడిట్ అప్రూవల్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి మరియు ఆరోగ్యకరమైన CIBIL ప్రొఫైల్‌కు సులభంగా క్రెడిట్ లభిస్తుంది.

వారు ఏమి చూస్తారో చూడండి

మీరు ప్రతి క్యాలెండర్ సంవత్సరానికి ఒకసారి మీ CIBIL క్రెడిట్ స్కోర్ మరియు క్రెడిట్ రిపోర్ట్ యొక్క 1 ఉచిత కాపీని పొందవచ్చు. మీరు ఇప్పటికీ మీ దానిని గమనించనట్లయితే, అది మీ మొదటి అడుగు అవుతుంది. ఇందులో మీరు కార్డు లేదా రుణానికి ఆమోదం పొందారా మరియు మీ క్రెడిట్ లిమిట్ / వడ్డీ రేటు ఎలా ఉండాలనేది నిర్ధారించడానికి రుణదాతలు ఏమి చూస్తారనే సమాచారం ఉంటుంది.

అన్ని రకాల రుణదాతలు, యజమానులు కూడా, మిమ్మల్ని భావి రుణగ్రహీత లేదా ఉద్యోగిగా మదింపు చేయడానికి ఈ సమాచారాన్ని పరిశీలించవచ్చు. కాబట్టి, మీ క్రెడిట్ రిపోర్టులోని విషయాలను తెలుసుకోవడం మరియు నిర్వహించడం ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉండటానికి కీలకం. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మరియు మీ క్రెడిట్ ప్రొఫైల్‌కు అపరిమిత యాక్సెస్ అవసరమైనప్పుడు, మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌కు పూర్తి సబ్‌స్క్రిప్షన్ ద్వారా CIBIL అలర్ట్‌లు, స్కోర్ సిమ్యులేటర్ మరియు CIBIL మార్కెట్ ప్లేస్ వంటి అదనపు ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీరు పూర్తిగా చెల్లించగలిగిన దానిని మాత్రమే ఖర్చు చేయండి

క్రెడిట్ ప్రాథమిక నియమాలు మనందరికీ వర్తిస్తాయి. మీరు మీ కొన్ని లేదా చాలా కొనుగోళ్లను క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తున్నట్లయితే, ప్రతి నెలా మీ స్టేట్‌మెంట్ బ్యాలెన్స్‌ పూర్తిగా చెల్లించడానికి మీ వద్ద నిధులు ఉంటేనే అలా చేయండి. ఇలా చేయడం వల్ల పెనాల్టీలు, గడువు తీరిన బకాయిలపై వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు.

కనీస చెల్లింపు ఉచ్ఛు గురించి జాగ్రత్తగా ఉండండి

ప్రతి నెలా, మీ స్టేట్‌మెంట్‌పై కనీసం క్రెడిట్ కార్డ్ చెల్లింపు చేయమని మిమ్మల్ని అడుగుతారు. మీరు తక్కువ కాలం / నగదు కొరతను ఎదుర్కొంటుంటే అలా చెల్లించడం సురక్షితం, కానీ ఇది భయంకరమైన దీర్ఘకాలిక వ్యూహం. ఎందుకంటే తమ బ్యాలె‌ల్స్ పూర్తిగా చెల్లించని వ్యక్తులు ఒక వలయంలో ఉండే అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మరియు కనీస బకాయిలను మాత్రమే నిరంతరాయంగా చెల్లించే వారు, దానిని జీవితకాలం భరిస్తారు.

అలాగే, ప్రతి నెలా కనీస చెల్లింపు చేయడం ద్వారా, మీకు మీ క్రెడిట్ కార్డుపై అధిక బ్యాలెన్స్ ఉంటుంది, ఇది మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని పెంచుతుంది. ఇది ఒక నిర్దిష్ట సమయంలో మీరు ఉపయోగిస్తున్న మీ మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ (కార్డుల అంతటా) శాతం.

సకాలంలో చెల్లించడం అలవాటు చేసుకోండి

జీవితం ప్రారంభం దశలో, ముఖ్యంగా మీరు అద్దె ఇంట్లో నివసింటే, జీవన ఖర్చులలో మునిగిపోవడం సులభం. కాబట్టి, మీ క్రెడిట్ బిల్లులు మరియు EMIలను సకాలంలో చెల్లించడానికి మీరే శిక్షణ పొందడం ప్రారంభించండి – ఎందుకంటే ఈ ఆలస్యాలు మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. మీరు చెల్లించడం మర్చిపోతే, మీరు ఒక నెలలోపు సెటిల్ చేస్తే మీ CIBIL స్కోర్ మరియు క్రెడిట్ రిపోర్టులో నష్టాన్ని నివారించవచ్చు, అయితే మీరు ఇంకా ఆలస్య రుసుము, ఇతర జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ గడువు తేదీలోగా చెల్లించడం అలవాటు చేసుకోండి (ప్రో-టిప్: మీ ఫోన్‌లు క్యాలెండర్ రిమైండర్‌లు మరియు డైరెక్ట్ డెబిట్ సూచనలు ప్రధానంగా సహాయపడతాయి).

మీ ప్రస్తుత మరియు భవిష్యత్తు జీవనశైలిని ప్రభావితం చేసే కీలక కారకాలలో క్రెడిట్ అర్హత ఒకటి, కాబట్టి మీ ఆర్థిక జీవితంలో ప్రారంభంలో దానిని ఆప్టిమైజ్ చేయడం చాలా అవసరం. మీరు ఇవాళ తీసుకునే చర్యలు ఏళ్ల తరబడి మీ క్రెడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్లిపోతాయి. ఇల్లు కొనడం, కారు కొనడం, ఉన్నత విద్యను అభ్యసించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Disclaimer: The information posted to this blog was accurate at the time it was initially published. We do not guarantee the accuracy or completeness of the information provided. The information contained in the TransUnion blog is provided for educational purposes only and does not constitute legal or financial advice. You should consult your own attorney or financial adviser regarding your particular situation. This site is governed by the TransUnion Interactive privacy policy located here.