Skip to main content

క్రెడిట్ స్థాపించుకోడానికి మొదటి సారి యుజర్స్ గైడ్

మీ స్వీయ డబ్బు మరియు క్రెడిట్ ప్రపంచంలోకి నూతన సభ్యునిగా, మంచి క్రెడిట్ రికార్డ్ స్థాపించుకోడానికి మూలాల గురించి ఇదిగో ఒక త్వరిత ప్రధమపాఠం. ముందుగా, క్రెడిట్ అంటే ఏమిటి? సులభంగా చెప్పలంటే, క్రెడిట్ అంటే ఋణం. ఇది రావడం అనేది మీ CIBIL స్కోర్ మీద ఆధారపడి ఉండే రకం. అది ఎంత అధికంగా ఉంటే, ఋణదాత దృష్టికోణం నుండి మీరు అంత క్రెడిట్ విలువ ఉన్నవారు అని. అయితే, అది ఏమిటి? ఋణగ్రహీతగా మీరు ఎంత అపాయకరంగా ఉన్నారో యసెస్ చేయడానికి ఋణదాత చూసే మూడు-డిజిట్ల నంబరే మీ CIBIL స్కోర్. మీ స్కోర్ ఎంత అధిమైతే, ఋణాలు/కార్డ్స్ మరియు పోటీతత్వ వడ్డీ రేట్ల కొరకు ఆమోదించబడడానికి మీ యాక్సెస్ అంత బాగుంటుంది. మీ CIBIL స్కోర్ CIBIL రిపోర్ట్తో కూడా వెనుదన్ను ఇవ్వబడి ఉంటుంది - మీ క్రెడిట్ ప్రొఫైల్ యొక్క సంక్షిప్త వివరణ, యాక్సెస్ మరియు తిరిగి చెల్లించ్పూ చరిత్ర, క్రెడిత్ ఖాతాల, మరియు బ్యాలెన్స్‌లు. తార్కికంగా, ఒక శుభ్రమైన మరియు వెనువెంటనే చేసే చెల్లింపు చరిత్ర ఒక మంచి స్కోర్‌ని అందిస్తాయి, మరియు వ్యతిరేకంగా కూడా.

CIBIL స్కోర్, CIBIL రిపోర్ట్, క్రెడిట్‌కి యాక్సెస్, ఎందుకు ఈ అంశాలన్ని ముఖ్యమైనవి? ఎందుకంటే నేడు క్రెడిట్ ఇంచుమించుగా మన జీవితాల్లోని ప్రతి అవస్థని ముట్టుకుంటుంది - ఇల్లు కొనడం, స్వంత వ్యాపారం ప్రారంభించడం, లేదా ఉన్నత విద్యకై ఎన్‌రోల్ చేసుకోవడం నుంచి. క్రెడిట్ మీద ఆధారపడడం ఇప్పుడు జీవన విధానం మరియు ఇది బలంగా మన ఖర్చు చేసే పద్దతులకి ముడిపెట్టి ఉంది.

ఇక తెలుసుకుందాం రండి మీరు మీ క్రెడిట్ ప్రొఫైల్ మీద మంచి ప్రారంభాన్ని చేయడానికి ఉన్న దారుల గురించి.

  1. ఒక కన్‌ష్యుమర్ డ్యురబుల్ ఋణానికి అప్లై చేసుకోండి: ఒకవేళ ఇంతకు ముందు మీరు క్రెడిట్ వాడకపోయి ఉంటే, ఋణం జారీ చేయడానికి ఋణదాతల వద్ద చూసుకోడానికి మీకు చరిత్ర ఉండదు. సులభంగా తిరిగి చెల్లించగలిగే చిన్న మొత్తం (ఈఎంఐ మీద స్మార్ట్‌ఫోన్ కొనడం లాంటిది)లో కన్‌ష్యుమర్ డ్యురబుల్ ఋణాన్ని తీసుకోవడం ద్వారా మీరు ఒకటి సృష్టించుకోవచ్చు.
  2. తరువాత చెల్లిస్తాను ఐచ్ఛికాన్ని వాడండి: ఈకాలం వినియోగదారులలో ఇదోక ప్రముఖమైన ట్రెండ్ ఒకవేళ మీరు ఏదేని ఇకామర్స్ సైట్ పైన తరువాత చెల్లిస్తాను ఐచ్ఛికానికి వెళితే, అది క్రెడిట్ సదుపాయంగా పరిగణించబడుతుంది మరియు క్రెడిట్ బ్యూరోకి నివేదించబడుతుంది. క్రెడిట్ స్థాపించడం ద్వారా, మీరు మీ క్రెడిట్ ప్రొఫైల్‌ని నిర్మించుకోవడం ప్రారంభించవచ్చు.
  3. మీకు జీతం ఖాతా ఉన్న అదే బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోండి: ఇప్పటికే మీ జీతం ఖాతా ఉన్న బ్యాంక్ మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వడంలో మంచి స్థానంలో ఉంటుంది, ఎందుకంటే ప్రధానంగా మీరు ఇప్పటికే వారితో సంబంధం ఉండి ఉన్నారు కాబట్టి.
  4. ఒక సెక్యూర్డ్మైన క్రెడిట్ కార్డ్ కొరకు అప్లై చేసుకోండి: మీ CIBIL స్కోర్ నిర్మించుకోవడం ప్రారంభించడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి ప్రతిగా క్రెడిట్ కార్డ్ పొందడం ఒక మంచి మార్గం. సాంకేతికంగా ఈ రకం క్రెడిట్ కార్డ్స్‌ని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్‌గా పదీకరిస్తారు. ఒక సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ కొరకు అప్లై చేసుకోడానికి ప్రతి బ్యాంక్ నిర్ధుష్టంగా కనీస ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాని చెపుతుంది. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలోని మొత్తం నేరుగా మీ క్రెడిట్ కార్డ్ పైని మొత్తం క్రెడిట్ పరిమితికి లింక్ చేయబడుతుంది.
  5. క్రెడిట్ బాధ్యతకి యాక్సెస్: ఒకవేళ మీరు జీతం వచ్చే వ్యక్తైతే, మీరు క్యాష్-బ్యాక్ ప్రయోజనాలు మరియు అధికమైన క్రెడిట్ పరిమితులతో క్రెడిట్ కార్డ్స్ కొరకు ఆఫర్స్ అందుకుంటూ ఉండవచ్చు. కీలకం ఏమిటంటే మీకు ఇన్ని క్రెడిట్ కార్డ్స్ నిజంగా అవసరమా లేక లేదా అని తెలుసుకోవడం. ఒక మంచి క్రెడిట్ చరిత్రను సృష్టించడానికి బాధ్యతగా ఒక్క క్రెడిట్ కార్డ్‌ని వాడడం ప్రారంభించమని సలహా.

ఒక్కసారి మీరు క్రెడిట్ అడుగుజాడ స్థాపించితే, అంతరాయం లేని క్రెడిట్ యాక్సెస్ కొరకు అనుకూల క్రెడిట్ ప్రొఫైల్‌ని నిర్వహించడానికి అరోగ్యకరమైన క్రెడిట్ అలవాట్లను అనుసరించాల్ని ఖచ్చితం చేసుకోండి.

  • క్రమబద్ధంగా మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ను తనిఖీ చేసుకోండి.

వారి CIBIL ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం యొక్క పూర్తి ప్రయోజనాన్ని చాలా కొద్ది మంది క్రెడిట్ యుజర్సే తీసుకుంటారు. మీ క్రెడిట్ సమాచారం పైన మంచి పట్టు ఉండడం మరియు క్రమబద్ధంగా మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్‌ను తనిఖీ చేసుకోవడం జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి మరియు మీ సమయాన్ని మరియు డబ్బుని ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది. దీన్నే క్రెడిట్ పర్యవేక్షణ అంటారు, మరియు తరచుగా మీ CIBIL ప్రొఫైల్‌ని పర్యవేక్షించుకోవడం మీ ప్రొఫైల్‌లోని ఏదేని మార్పుల సమాచారం ఉంచుకోడానికి మీకు సహాయపడుతుంది. ఎలాంటివంటే, మీ పేరున తెరవబడుతున్న కొత్త ఖాతాల, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లో పెరుగుదల, లేదా మీ క్రెడిటార్స్‌లో ఒకరి ద్వారా నివేదించబడ్డ ఒవర్‌డ్యు చెల్లింపు వంటివి.Apply for credit only when you need it. ఈ అభ్యాసం మిమ్మల్ని చక్కటి సమాచరంతో మరియు మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆరోగ్యం గురించిన అవగాహనతో ఉంచుతుంది, మరియు ఇది ముందుగానే వృద్ధి చేసుకోవల్సిన గొప్ప అలవాటు.

  • మీకు అవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్ కొరకు అప్లై చేసుకోండి.

మీరు క్రెడిట్ కొరకు అప్లై చేసుకున్న ప్రతిసారి ఋణదాత మామూలుగానే మీ క్రెడిట్ విలువని యసెస్ చేయడానికి హార్డ్ విచారణ చేస్తాడు. ఋణదాతల ద్వారా హార్డ్ విచారణలు చాలా మరియు తరచుగా ఉంటే మీ CIBIL స్కోర్ పైన నెగెటివ్ ప్రాభావం ఉండవచ్చు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్ కొరకు అప్లై చేసుకోవడం ద్వారా, మిగిలిన సమయంలో మీ స్కోర్ అదేమాదిరిగా నిలకడగా ఉంటుంది మరియు మొత్తం మీద బాధ్యత ఉన్న క్రెడిట్ యుజర్‌గా అభిప్రాయానిస్తుంది.

  • పూర్తిగా మరియు సమయానికి చెల్లించండి.

భాగాలుగా చెల్లించే ఐచ్ఛికాన్ని తీసుకోకండి మరియు చెల్లించని బిల్ పైన వడ్డీ పెంచుకుంటూ పోయే అభ్యాసంలోకి పడకండి. ఇది మీ స్కోర్‌కి హనికరము మరియు దీర్ఘకాలంలో వడ్డీ భారం విపరీతంగా వ్యయపూరితం కావచ్చు.

ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ నిర్మించుకోవడం అంటే పరుగుపందెంలో ఉన్నట్లే. మీరు ఏ పద్ధతులు ఎంచుకున్నారనే దానితో పనిలేకుండా, నిలకడగా ఉండడమే కీలకం అని గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోబడిన రోడ్‌మ్యాప్‌ను అనుసరించడం ద్వారా, మీరు మీ క్రెడిట్ అడుగుజాడను సృష్టించడానికి మరియు క్రెడిట్-విలువ ఉన్నవారుగా అయ్యే వైపుకి చాలా అడుగులు ముందుకి వెళ్ళినట్లే.

Disclosure: 

This post only contains educational information. No financial, tax or legal advice.

This information is for educational purposes only and we do not guarantee the accuracy or completeness of this information. This information does not constitute financial, tax or legal advice and you should consult your own professional adviser regarding your situation. This website may contain links to third party websites. We are not responsible for their content or data collection. Trademarks used in this material are property of their respective owners and no affiliation or endorsement is implied.