Skip to main content

CIBIL అలర్ట్‌లు: మీ ఆర్థిక గుర్తింపును సంరక్షించడానికి ఒక తలివైన, సురక్షిత మార్గం

CIBIL అలర్ట్‌లతో మీ క్రెడిట్ ప్రొఫైల్‌లోని కీలక మార్పులను తెలుసుకుంటూ మరియు నవీకరించబడి ఉండండి. ఎలానో తెలుసుకోండి

రుణం, BNPL (ఇప్పుడు కొనండి మరియు తరువాత చెల్లించండి) ఆఫర్, EMI లింక్డ్ కొనుగోళ్లు, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం, కార్డుతో లావాదేవీలు చేయడం లేదా మూసివేయడం - ఇలా మీరు క్రెడిట్‌తో వ్యవహరించిన ప్రతిసారీ - అనుబంధ రుణదాత ఆ డీలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని CIBIL.వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో పంచుకుంటాడు. మీ CIBIL క్రెడిట్ స్కోర్ మరియు రిపోర్ట్ రూపొందించడానికి మీరు చేపట్టే అన్ని క్రెడిట్ డీలింగ్‌ల సమాచారాన్ని మేము సంకలనం చేస్తాము.

ఈ స్కోరు మరియు రిపోర్ట్ మీ ఆర్థిక గుర్తింపులో ప్రధాన భాగం. మీరు మీ ఆర్థిక ప్రొఫైల్‌ను ఎలా పర్యవేక్షించాలి మరియు నియంత్రించాలి అనే దాని గురించి చర్చించడానికి మేము ఈ రోజు ఒక నిమిషం సమయం తీసుకోబోతున్నాం. అంతేకాకుండా, ఒక కొత్త సంవత్సరం సమీపిస్తోంది, ఆర్థిక మంచి విధానాలకు మీ అంతట మీరే శిక్షణ పొందడానికి దీని కంటే మంచి సమయం ఏముంటుంది?

మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వ్యక్తి, ఆన్‌లైన్ షాపింగ్ (పైన పేర్కొన్న ఆఫర్లను పొందడం) లేదా క్రమం తప్పకుండా EMIలు చెల్లించే వ్యక్తి అయితే - ఇది మీ కోసమే.

ప్రతి క్రెడిట్ సదుపాయం మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీ ఉచిత CIBIL క్రెడిట్ స్కోర్ మరియు రిపోర్ట్ సంవత్సరానికి ఒకసారి పొందడం మంచిదే అయినప్పటికీ, సబ్‌స్క్రైబర్ కావడం మరియు దానికి దీర్ఘకాలిక, ఆన్-డిమాండ్ యాక్సెస్ పొందడం అనేది మంచి ఆలోచన.

దీనితో మీ క్రెడిట్ ప్రొఫైల్ గురించి ఎక్కువగా తెలియడంతోపాటుగా నియంత్రణ కూడా లభిస్తుంది. మరిముఖ్యంగా, సబ్‌స్క్రిప్షన్ ద్వారా 24x7 క్రెడిట్ మానిటరింగ్ CIBIL అలర్ట్‌*- గుర్తింపు చౌర్యం లేదా దుర్వినియోగం నుండి మిమ్మల్ని రక్షించే మా ఇమెయిల్ మరియు SMS నోటిఫికేషన్ సిస్టమ్ ద్వారా మీకు 24x7 క్రెడిట్ మానిటరింగ్ లభిస్తుంది.

ఉదాహరణకు, మీరు మీ CIBIL స్కోరును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని అనుకుందాం, మీరు ఇటీవల చేసిన ఏదైనా లావాదేవీకి సంబంధించని ఏదైనా ఊహించని డిప్‌ను మీరు కనుగొనన్నారు. మీరు గుర్తింపు చౌర్యానికి బలై ఉండవచ్చు.

ఎవరైనా మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందినప్పుడు లేదా దొంగిలించినప్పుడు గుర్తింపు చౌర్యం జరుగుతుంది. మీ పేరులోని క్రెడిట్ లైన్‌లను (రుణం లేదా క్రెడిట్ కార్డు వంటివి) తెరవడానికి దీనిని ఉపయోగిస్తారు, ఇది మీ క్రెడిట్ రిపోర్ట్‌లు మరియు స్కోర్‌లను ప్రభావితం చేస్తుంది.

మా 'అలర్ట్‌ల' ఫంక్షన్ ద్వారా మీకు వెంటనే తెలుస్తుంది. మీ ఖాతాలో ఎటువంటి తప్పుడు కార్యకలాపాలు నమోదు కాలేదని ధృవీకరించడానికి మీరు మీ వివరణాత్మక CIBIL నివేదికను త్వరితగతిన తనిఖీ చేయవచ్చు, ఒకవేళ అలా జరిగితే దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి రుణదాత మరియు CIBILకు ఫ్లాగ్ చేయవచ్చు.

క్రెడిట్ మానిటరింగ్ అనేది మీ పేరుతో కొత్త ఖాతాలు తెరవడం, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ పెరుగుదల లేదా మీ రుణదాతల్లో ఒకరు నివేదించిన గడువు మీరిన బకాయి చెల్లింపు వంటి మీ ప్రొఫైల్‌లో మార్పులు జరిగినప్పుడల్లా మిమ్మల్ని అప్రమత్తం చేయడం ద్వారా వ్యక్తిగత సహాయకుడు మరియు వాచ్ డాగ్‌గా పనిచేస్తుంది. ఈ విధానం మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆరోగ్యం గురించి మీకు చక్కటి సమాచారం మరియు అవగాహన కలిగిస్తుంది మరియు 2023‌లో అభివృద్ధి చేసుకోగల మంచి అలవాటులో ఒకటి. స్మార్ట్ మరియు సేఫ్ క్రెడిట్ వాడకం యొక్క సంవత్సరాన్ని ప్రారంభిద్దాం.

* CIBIL 'స్టాండర్డ్', 'ప్రీమియం' సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో లభిస్తుంది

Disclosure: 

This post only contains educational information. No financial, tax or legal advice.

This information is for educational purposes only and we do not guarantee the accuracy or completeness of this information. This information does not constitute financial, tax or legal advice and you should consult your own professional adviser regarding your situation. This website may contain links to third party websites. We are not responsible for their content or data collection. Trademarks used in this material are property of their respective owners and no affiliation or endorsement is implied.