Skip to main content

మంచి క్రెడిట్ అలవాట్లతో పాజిటివ్ క్రెడిట్ ప్రొఫైల్ రూపొందించండి

ఒకవేళ సభ్యత మనిషిని చేస్తే, మంచి అలవాట్లు వెనకపడిపోవు. మనమందరమూ అలవాట్ల ప్రాణులమే - మన రోజువారి పనులను మరియు మెచ్చుకోతగ్గ ఖచ్చితత్వపు షెడ్యూల్స్ అనుసరిస్తూ. మరియు ఇవే అలవాట్లు మనని మనంతటగా ఉత్తమమైన వెర్షన్‌గా తీర్చిదిద్దే సంభావ్యత ఉన్నవి. మన జీవిత తొలి రోజుల్లో, మన తల్లితండ్రులు మనలని సామాజిక నైపుణ్యాలు, ఇంటర్‌పెర్సనల్ సంబంధబాంధవ్యాలు లేదా అర్థిక అలవాట్ల వంటి మన జీవితాల్లో వివిధ అంశాల రూపంలో ఉండే మంచి అలవాట్ల వైపికి నెట్టారు.

నేడు క్రెడిట్ ల్యాండ్‌స్కేప్‌లో మీకు మీ మంచి ఆర్థిక అలవాట్లు ఎలా సహాయపడాతాయో ఇక్కడ ఉంది.

ఒక్కసారి మీరు మీ క్రెడిట్ ప్రయాణంలో కార్డ్ లేదా ఋణం తీసుకొవడంతో ప్రారంభిస్తూనే, క్రెడిట్ అడుగుజాడ సృష్టించబడుతుంది. ఈ అడుగుజాడ మీ క్రెడిత్ ప్రొఫైల్ మరియు CIBIL స్కోర్ నిర్మించుకోవడంలో ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు, మీ CIBIL స్కోర్ మీ క్రెడిట్ రిపోర్ట్‌లో 3-డిజిట్ల న్యూమరిక్ సంక్షిప్తం, 300 నుంచి 900 పరిధిలో ఉంటుంది. క్లుప్తంగా, సమయం గడిచిన కొద్ది అది మీ క్రెడిట్ ప్రవర్తన (మరియు అలవాట్ల) ప్రతిబింబం. ఇది అప్పుడు మంచి క్రెడిట్ అలవాట్లు అనుకూఅలమైన క్రెడిట్ ప్రొఫైల్‌కి మరియు ఎక్కువ CIBIL స్కోర్‌కి దారి తీస్తుందని అనుసరిస్తుంది, ఇదిలా ఉండగా చెడు క్రెడీట్ అలవాట్లు మంచిదికాని క్రెడిట్ ప్రొఫైల్ మరియు తక్కువ CIBIL స్కోర్‌కి దారి తీస్తుంది. మరియు ఇదే భవిష్యత్తులో క్రెడిట్‌కి మీ యాక్సెస్‌ని నిర్ణయించేది.

ఋణదాతలు మీ క్రెడిట్ ప్రొఫైల్, ప్రవర్తనా పద్ధతులు మరియు తిరిగి చెల్లించే అలవాట్లను వారు మీ ఋణం లేదా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్‌ను ఆమోదించే ముందు అర్థం చేసుకోడానికి మీ CIBIL స్కోర్‌ను తనిఖీ చేస్తారు. ఇందువల్లే మీరు మంచి క్రెడిట్ అలవాట్లను షోకేస్ మరియు లెవెరేజ్ చేయడం ముఖ్యం. ఎక్కడ ప్రారంభించాలో అర్థం కావడంలేదా?

ఒక అనుకూలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ని నిర్మించడం మరియు నిర్వహించడం చేస్తున్నప్పుడు మనసులో ఉంచుకోవల్సిన కొన్ని కీలక క్రెడిట్ అలవాట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • మీ ఆర్థిక లక్ష్యాలను మరియు ప్రాథాన్యతలను ప్లాన్ చేసుకోండి - మన కుటుంబాలకి మరియు ప్రేమించే వాళ్ళకి ఇవ్వడానికి మనం మన హద్దు దాటేస్తాము. మన ప్రేమను చూపించడానికి ఇదోక మార్గం. అయినప్పటికినీ, మీరు మీ అర్థిక లక్ష్యాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి మరియు జాగ్రత్తగా మీ క్రెడిట్ ఐచ్ఛికాలను కూడా తూచుకోవాలి. మీ ఆదాయాన్ని ఈఎంఐ నిష్పత్తికి (మీ నెల్వారి జీతం ఎంత ఈఎంఐ మరియు క్రెడిట్ కార్డ్ చెల్లింపుల వైపుకి వెళ్ళుతోంది అనే సాధారణ లెక్క) పరిగణించండి, మరియు దీన్ని 30% క్రింద ఉంచడానికి కష్టపడండి. మరియు కేవలం మీకు క్రెడిట్‌కి యాక్సెస్ ఉందికాబట్టి కాకుండా, మీకు నిజంగా అవసరమైనప్పుడే తాజా క్రెడిట్‌కి అప్లై చేయండి. ఈ రకం ప్లానింగ్ మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మరియు అనుకూలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ని నిర్వహించడానికి కీలకం.
  • బడ్జెట్ మరియు ఆదా - పిల్లలుగా, మన తల్లిదండ్రులు మనని బాగా ఆదా చేయమని సలహా ఇచ్చారు. మరియు నేటికి కూడా ఈ సలహానే నిజం. మీ నెలవారి ఖర్చులు, మీ రాబోయే ఖర్చులు, ఋణ కర్తవ్యాలు మరియు తిరిగి చెల్లింపులు బడ్జెట్ చేసుకోండి, మరియు అవసరమైన రోజుకి ఆదా చేసుకోండి. మనం మన వేలికోసల వద్ద క్రెడిట్‌కి యాక్సెస్ ఉన్న కాలంలో జీవిస్తుండగా, మనం మనని ఆర్థికంగా కష్టమైనలోకి తీసుకువెళ్ళగలిగే అనుకోని సందర్భాల కొరకు సిద్ధంగా ఉండాలి. మొండి నియమం ఏమిటంటే అత్యవసర నిధిగా మూడు నెలల జీతం పక్కకి పెట్టి ఉంచుకోవాలి, దీని వల్ల మీరు కష్టంలో కూడా వీలైనంత తక్కువ శ్రమతో బయటపడవచ్చు. నెమ్మదిగా ఆదా చేయడం మొదలుపెట్టండి, కాని ఖచ్చితంగా. అత్యవసర నిధిగా నెలవారి నిర్ధిష్ట మొత్తాన్ని పక్కకి పెట్టండి.
  • మీ ఖర్చులను ట్రాక్ చేసుకోండి - మీరు నెలవారి లేదా వారాక్నికి ఆధారంగా (ఇది మీ ఆదాయం నుంచి ఖర్చు నిష్పత్తి అని కూడా పిలవబడుతుంది) ఎంత ఖర్చు చేస్తున్నారు అనేదాని మీద ట్యాబ్ ఉంచుకోవడం మీ ఖర్చులని ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది, ఎది నివారించవచ్చు లేక లేదు అర్థ చేసుకోగలరు, మరియు మీ ఖర్చులను ఇంకా బాగా నిర్వహించుకోవచ్చు. మీ ఈఎంఐ మరియు ఋణ తిరిగి చెల్లింపులు ఖచ్చితంగా నివారించే ఖర్చులు కాదు, కాని టేక్అవేస్ ఆర్డర్ చేయడం ఆపవచ్చు. మీరు ఒక డైరీని నిర్వహించుకోవడాన్ని ఎంచుకోవచు, శ్రద్దగా పరిశీలించే ఎక్స్ఎల్ ఫైల్స్ మరియు కార్యక్రమాలు, లేదా కేవలం మీకు మీ ఖర్చులను ట్రాక్ చేయడనికి బాగా సహాయపడే వ్యక్తిగత ఫైనషియల్ టూల్ తీసుకోండి.
  • క్రెడిట్‌కి మీ యాక్సెస్‌ని జాగ్రత్తగా వాడండి - క్రెడిట్ మీకు మీ జీవిత లక్ష్యాలను సాధించడంలో లేదా అత్యవసరంలో మీకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుండగా, మీరు ఎంత తరచుగా క్రెడిట్ కార్డ్స్ లేదా ఋణాలకు అప్లై చేస్తున్నారో గురించి జాగ్రత్తగా ఉండండి - అది ఒకవేళ కేవలం మీ క్రెడిట్-అర్హతను తనిఖీ చేసుకోడానికైనా కూడా. మీకు ఒకవేళ పొడిగించబడ్డ క్రెడిట్ పరిమితితో క్రెడిట్ కార్డ్ ఉన్నా కూడా, తక్కువ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని నిర్వహించడం మరియు మీ కార్డ్ పరిమితి లోపలే ఖేచు చేసుకోవడం అనేది మంచి క్రెడిట్ అలవాటు. మిమ్మల్ని మీరు సాగదీసుకోవడం మీకు క్రెడిట్ భారాన్ని పెంచడం వరకే చేస్తుంది, మరియు తరువాతి దశలో మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది
  • క్రెడిట్-స్పృహతో ఉండండి - మీరు మీ ఫైనాషియల్స్ పైన మి బ్యాంక్ స్టేట్‌మెంట్స్ మరియు పెట్టుబడులను తరచుగా తనిఖీ చేస్తూ ట్యాబ్ ఉంచుతారా? అదేవిధంగా, క్రమబద్ధంగా వారి CIBIL స్కోర్స్ మరియు రిపోర్ట్‌లను పర్యవేక్షించుకోడం ద్వారా బాధ్యత ఉన్న క్రెడిట్ వినియోగదారులు వారి క్రెడిట్ రొఫైల్‌కి కనెక్టెడ్‌గా ఉంటారు. ఇది వారు వారి క్రెడిట్ ప్రొఫైల్స్, కార్డ్ ఖర్చులు, ఋణ మొత్తాలు మరియు క్రెడిట్ ప్రవర్తనలో అగ్రస్థానంలో ఉంచేట్టు చేస్తుంది, ఇదిలా ఉండగా CIBIL‌తో ఉన్న వారి ఋణదాతల మరియు బ్యాంక్స్ ద్వారా పంచుకోబడ్డ క్రెడిట్ సమాచారాన్ని పర్యవేక్షిస్తుంది. ఇది వారికి వారి ఋణ అర్హతను ఇంకా బాగా అర్థం చేసుకోడానికి కూడా సహాయపడుతుంది, దీనివల్ల వారు వారికి చాలా అవసమైనప్పుడు క్రెడిట్‌కి యాక్సెస్ పొందగలరు.

గుర్తుంచుకోండి ఇదంతా మీరు ఒక్క రాత్రిలో సాధించలేరు. నెమ్మదిగా, కాని ఖచ్చితంగా మంచి క్రెడిట్ అలవాట్ల మరియు అనుకూలమైన క్రెడిట్ ప్రొఫైల్ వైపుకి పని చేయాలి మరియు మీరు ఇది మీ జీవితంలోని ఇతర అంశాలపై కూడా ఎలాంటి ప్రభావన్ని తీసుకువస్తుందో గమనించవచ్చు.

>> మీ CIBIL స్కోర్ తెలుసుకోండి మరియు రిపోర్ట్ చేయండి మరియు క్రెడిట్ స్పృహతో ఉండండి. ఇప్పుడే తనిఖీ చేయండి.

>> స్కోరు తక్కువగా ఉందా? ప్రశాంతంగా ఉండండి మరియు అధిక స్కోరు పొందడానికి పనిచేయండి. ఇది ఎలానో ఇక్కడ ఇవ్వబడింది

Disclosure: 

This post only contains educational information. No financial, tax or legal advice.

This information is for educational purposes only and we do not guarantee the accuracy or completeness of this information. This information does not constitute financial, tax or legal advice and you should consult your own professional adviser regarding your situation. This website may contain links to third party websites. We are not responsible for their content or data collection. Trademarks used in this material are property of their respective owners and no affiliation or endorsement is implied.