తరచుగా అడిగే ECLGS ప్రశ్నలు

ECLGS కి సంబంధించిన సాధారణంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

ఇప్పుడే మీది పొందండి

1. గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ (GECL) అంటే ఏమిటి?

GECL అనేది ఋణమిచ్చే సంస్థలకు(MLIలు) నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (NCGTC) 100% గ్యారంటీ ఉండే ఋణం, ఇది షెడ్యూల్డ్ కమెర్షియల్ బ్యాంకులు (SCBలు) మరియు ఆర్ధిక సంస్థలకు (Fiలు) అదనపు వర్కింగ్ క్యాపిటల్ ఋణ సదుపాయం రూపంలో అందించబడుతుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (NBFCలు), అర్హత కల MSME లు/వ్యాపారసంస్థలు మరియు ఆసక్తిగల ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) ఋణగ్రహీతలకు అదనపు టర్మ్ లోన్ సదుపాయాన్ని అందిస్తుంది. GECL క్రింద వచ్చే ఋణం పొందుతున్న వారి మొత్తం ఔట్స్టాండింగ్లో 20% గా ఉంటూ రూ. 25 కోట్లవరకు ఉంటుంది, ఇందులో 2020 ఫిబ్రవరి 29 నాటికి ఆఫ్-బ్యాలెన్స్ షీట్ మరియు నాన్-ఫండ్ ఆధారిత ఎక్స్పోజర్లు మినహాయింపు, అంటే అదనపు క్రెడిట్ రూ. 5 కోట్లు వరకు ఉంటుంది.

 

2. ఈ స్కీం లక్ష్యం ఏమిటి?

అనూహ్య పరిస్థితి అయిన కోవిడ్-19 కు ఒక నిర్దిష్ట స్పందనే ఈ స్కీం. ఇది ఋణమిచ్చే సంస్థలు తక్కువ ధర వద్ద రూ. 3 లక్షల కోట్లు వరకు అదనపు ఋణాన్ని అందించేలా వాటికి ఊతం అందించడం ద్వారా MSME విభాగానికి ఎంతో అవసరమైన ఉపశమనాన్ని అందించాలని ఉద్దేశించబడింది తద్వారా MSME లు వాటి నిర్వహణకు సంబంధించి చేయాల్సిన చెల్లింపులను చేయగలిగేలా మరియు వారి వ్యాపారాలను తిరిగి ప్రారంభించేలా వీలు కలిగిస్తుంది.

 

3. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (GECL) అంటే ఏమిటి?

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం GECL పై MLIలకు NCGTC, అర్హత కలిగిన MSMEల తరపున, వాటికి ఋణమిచ్చే సంస్థలకు NCGTC ద్వారా రూ. 3 లక్షల కోట్ల వరకు 100% గ్యారంటీ కవరేజీని అందిస్తుంది. ఈ స్కీం కొరకు ఉద్దేశించబడిన MSME లలో ప్రొప్రయిటర్షిప్లు, పార్ట్నర్షిప్లు, రిజిస్టర్డ్ సంస్థలు, ట్రస్టులు మరియు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లు (LLPలు) గా ఉన్న MSMEలు/వ్యాపార సంస్థలు మరియు, PMMY క్రింద ఆసక్తి కలిగిన ఋణ ఆశావహులు ఉంటారు.

 

4. ఈ స్కీం క్రిందికి వచ్చే MLIలు ఏమిటి?

SCB లన్నీ MLI లు గా ఉండే అర్హతను కలిగి ఉంటాయి. 29.2.2020 నాటికి కనీసం రెండేళ్ళుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న NBFCలు, మరియు FIలు కూడా ఈ స్కీం క్రింద MLIలు గా ఉండటానికి అర్హత కలిగి ఉంటాయి.

 

5. ఈ స్కీం కొరకు ఉద్దేశించిన విధంగా FI ల నిర్వచనం ఏమిటి?

ఈ స్కీం కొరకు ఉద్దేశించబడిన FI లు RBI చట్టంలోని 45-I సెక్షన్ క్రింద క్లాజ్ (c) లోని సబ్-క్లాజ్ లో నిర్వచించిన విధంగా ఉంటాయి.

 

6. ఈ స్కీం వ్యవధి ఎంత?

2020 మే 23 నుండి 2020 అక్టోబర్ 31 వరకు మధ్య వ్యవధిలో GECL క్రింద మంజూరైన అన్ని ఋణాలకు లేదా GECL క్రింద రూ. 3 లక్షల కోట్ల వరకు ఏది ముందైతే అంతవరకు ఈ స్కీం వర్తిస్తుంది.

 

7. ఈ స్కీం క్రింద గ్యారంటీ కవరేజీ ఏమిటి?

ఈ స్కీంలో GECL క్రింద అందించబడే మొత్తం నిధులు NCGTC చే 100% క్రెడిట్ గ్యారంటీ కవరేజీని కలిగి ఉంటాయి.

 

8. ఈ స్కీం ప్రయోజనాలను పొందటానికి MSMEలకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు ఏమిటి?

ఈ స్కీం క్రింద ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయి:

  • 29.2.2020 నాటికి అన్నిMLI ల నుండి కలిపి రూ. 25 కోట్లు వరకు ఔట్స్టాండింగ్ ఋణాలు కలిగి ఉన్న మరియు ఆర్ధిక సంవత్సరం 2019-20 లో వార్షిక టర్నోవర్ రూ. 100 కోట్లు వరకు ఉన్న MSME ఋణగ్రహీత ఖాతాలన్నీ. ఒకవేళ 2019-20 అకౌంట్లు ఇంకా ఆడిటింగ్ పూర్తి కాకపోతే, టర్నోవర్ గురించి ఋణగ్రహీత ఇచ్చే డిక్లరేషన్పై MLIలు ఆధారపడవచ్చు.
  • ఈ స్కీం MLI పుస్తకాలలో ఉన్న మనుగడలోని కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.
  • ఋణగ్రహీత అకౌంట్లను 29.2.2020 నాటికి రెగ్యులర్, SMA-0 లేదా SMA-1 గా వర్గీకరించవచ్చు. 29.2.2020 నాటికి NPA లేదా SMA-2 గా వర్గీకరించబడిన ఖాతాలు ఈ స్కీం క్రింద అర్హతను కలిగి ఉండవు
  • MSME ఋణం పొందేవారు GST రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయ్యే అన్ని సందర్భాలలో తప్పనిసరిగా GST రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఈ నిబంధన, GST రిజిస్ట్రేషన్ పొందాల్సిన అవసరం లేని MSME లకు వర్తించదు.
  • విడిగా సంస్థల సామర్ధ్యాన్ని బట్టి పొందే ఋణాలకు ఈ స్కీం వర్తించదు.

 

9. ఈ స్కీం PMMY క్రింద ఋణం పొందేవారికి కూడా వర్తిస్తుందా?

అవును, 29.2.2020 నాటికి PMMY క్రింద పొంది, MUDRA పోర్టల్లో నివేదించబడిన ఋణాలు, ఈ స్కీం క్రిందికి వస్తాయి.

 

10. GECL ఒక ప్రత్యేక లోన్ అకౌంట్గా అందించబడుతుందా, లేక ఋణం పొందగోరేవారికి అప్పటికే ఉన్న లోన్ అకౌంట్లో భాగంగా అందించబడుతుందా?

GECL క్రింద అదనపు ఋణాన్ని అందించడానికి ఋణం పొందగోరే వారికి ఒక ప్రత్యేక లోన్ అకౌంట్ తెరువబడుతుంది. ఇది ఋణం పొందే వారికి అప్పటికే ఉన్న లోన్ అకౌంట్(లు) కాకుండా వేరేదిగా ఉంటుంది.

 

11. ఈ స్కీం క్రింద వచ్చే లోన్స్, ఋణం పొందగోరేవారు ఏ అప్లికేషన్ పెట్టకుండా లేదా అభ్యర్ధన చేయకుండా దానంతటదే అందించబడుతుందా?

ఇదొక ప్రీ-అప్రూవ్డ్ లోన్. అర్హులైన ఋణగ్రహీతలకు ప్రీ-అప్రూవ్డ్ లోన్ కొరకు MLI నుండి ఒక ఆఫర్ పంపించబడుతుంది, దీనిని ఋణగ్రహీత అంగీకరించవచ్చు. MSME ఆఫర్ను అంగీకరిస్తే, అవసరమైన డాక్యుమెంటేషన్ను పూర్తి చేయడం అవసరం. ఈ విధంగా, ఈ స్కీం క్రింద ఋణగ్రహీతలకు ఆప్ట్-అవుట్ ఎంపిక అందించబడుతుంది, అంటే., ఒకవేళ ఋణం పొందటం ఋణగ్రహీతకు ఇష్టం లేకపోతే అతడు/ఆమె అందుకు తగిన స్పందనను తెలుపవచ్చు.

 

12. ఋణగ్రహీత పలు ఋణ సంస్థల నుండి లోన్ అకౌంట్లు కలిగి ఉంటే అనుసరించే ప్రక్రియ ఏమిటి?

ఒకవేళ ఋణగ్రహీత ఎవరైనా పరిమితులు కలిగి ఉంటే, GECL ను ఒక ఋణ సంస్థ నుండి లేదా ఋణగ్రహీతకు మరియు MLI కు ఉన్న ఒప్పందంపై ఆధారపడి ఒక్కో ఋణ సంస్థ నుండి ఒక్కో నిర్దిష్ట మొత్తంలో పొందవచ్చు.

ఒకవేల ఋణగ్రహీత ఏదైనా ఋణసంస్థ నుండి, ఆ ఋణసంస్థకు పడ్డ బకాయిలో 20% కంటే అధిక మొత్తాన్ని ఋణంగా పొందాలనుకుంటే, ఋణగ్రహీత ఋణం పొందియున్న మిగతా అన్ని ఋణసంస్థల నుండి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అవసరం అవుతుంది.

అయితే, నిర్దిష్ట ఋణసంస్థ నుండి పొందే GECL ఆ ఋణసంస్థకు బకాయిపడిన మొత్తంలో 20% లోపు ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం ఉండదు.

 

13. GECL ను పొందాలంటే, ఋణ గ్రహీత కలిగి ఉన్న ప్రస్తుత ఋణాలు మనుగడలోని CGFMU లేదా CGTMSE వంటి గ్యారంటీ స్కీంల క్రింద కవర్ అవ్వాల్సిన అవసరం ఉందా?

లేదు.

 

14. GECL పై వడ్డీరేటుకు గరిష్ట పరిమితి ఉంటుందా?

అవును, GECL పై వడ్డీరేట్లు క్రింది విధంగా ఒక పరిమితికి లోబడి ఉంటాయి:

బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థలకు, RBI సూచించిన ఎక్స్‌‌టర్నల్ బెంచ్‌‌మార్క్ లింక్డ్ రేట్లలో ఒకటి

+ సంవత్సరానికి గరిష్టంగా 9.25% కు లోబడి 1%

NBFC లకు, GECL పై వడ్డీరేటు సంవత్సరానికి 14% కు మించకూడదు

సాధ్యమైనంత వరకు వర్తించే వడ్డీ సహాయ పథకాలతో మేళవింపుగా కూడా ఈ స్కీం అమలుచేయబడవచ్చు.

 

15. GECL క్రింద అందించబడే ఋణాల వ్యవధి ఎంత ఉంటుంది?

GECL క్రింద అందించబడే ఋణాల కాల వ్యవధి వితరణ తేదీ నుండి నాలుగు సంవత్సరాలు ఉంటుంది. అయితే, ముందే చెల్లింపు చేసే సందర్భంలో ఋణమిచ్చే సంస్థలుఎటువంటి ప్రీ-పేమెంట్ జరిమానాను విధించవు.

 

16. ఈ స్కీం క్రింద ఏదైనా మారటోరియం వ్యవధి తెలుపబడిందా?

అవును, GECL ఫండింగ్ కొరకు అసలు మొత్తంపై ఒక సంవత్సర కాలపు మారటోరియం వ్యవధి అందించబడుతుంది. అయితే, మారటోరియం వ్యవధిలో వడ్డీని మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత 36 ఇన్స్టాల్మెంట్లలో అసలు మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

 

17. GECL ను మంజూరు చేయడానికి ఈ స్కీం క్రింద ఋణమిచ్చే సంస్థలకు ఏదైనా గడువు కాలం ఉందా?

కోవిడ్-19 మహమ్మారి సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్సియల్ సర్వీసెస్ ఫర్ క్రెడిట్ సపోర్ట్ సూచించినంత గడువు కాలమే ఈ స్కీం క్రింద సూచనప్రాయ గడువు కాలంగా ఇవ్వబడింది.

 

18. NCGTC పథకం క్రింద ఏదైనా గ్యారంటీ ఫీజు విధించబడుతుందా?

విధించబడదు, ఈ పథకం క్రింద NCGTC ఎటువంటి గ్యారంటీ ఫీజును విధించదు.

 

19. GECL క్రింద ఋణాన్ని మంజూరు చేయడానికి ఋణమిచ్చే సంస్థలు ఏవైనా ప్రాసెసింగ్ ఫీజును విధిస్తాయా?

ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు GECL క్రింద అదనపు క్రెడిట్ అందించబడుతుంది కావున, ఋణమిచ్చే సంస్థలు అదనపు ప్రాసెసింగ్ ఫీజును విధించవు.

 

20. MLI లు GECL సదుపాయం అందించడానికి అదనపు పూచీకత్తును అడుగుతాయా?

GECL క్రింద అదనపు ఋణం పొందటానికి MLI లు అదనపు పూచీకత్తును కోరవు.

 

21. ఋణగ్రహీత ఎవరైనా GECL సదుపాయం పొందితే అట్టి ఋణగ్రహీతకు ప్రస్తుత ప్రభుత్వ స్కీంలైన PMEGP లేదా PMMY ల క్రింద ప్రస్తుతం అందించబడుతున్న ఋణాల వర్గీకరణ మారుతుందా?

మారదు. ప్రస్తుతమున్న ప్రభుత్వ స్కీంల క్రింద పొందిన లోన్లు ఇదివరకు ఏ తరగతిలో ఉన్నాయో, అవే తరగతుల క్రింద కొనసాగుతాయి. ఈ స్కీం క్రింద అందించబడే GECL మనుగడలోని లోన్లకు పైగా ఉంటుంది.

 

22. GECL క్రింద అందించబడే ఋణానికి కేటాయించబడిన రిస్క్ వెయిట్ ఎంత?

GECL క్రింద అందించబడే ఋణాలకు జీరో రిస్క్ వెయిట్ కేటాయించాలని RBI కి అభ్యర్ధన పంపించబడింది.

 

23. GECL క్రింద అందించబడే ఋణానికి సెక్యూరిటీ ఏమిటి? స్కీం?

విడుదలైన నాటి నుండి 3 నెలల లోగా అట్టి ఋణం క్రింద ఫైనాన్స్ చేయబడి ఏర్పడిన ఆస్తులపై విధించబడే ఛార్జీతో క్యాష్ ఫ్లోలు (రీపేమెంట్లతో సహా) మరియు సెక్యూరిటీల పరంగా GECL క్రింద పొందే ఋణం రెండవ ఛార్జీగా ఉంటుంది.

 

24. MLI లు ఈ స్కీం కొరకు NCGTC తో ఏదైనా ఒప్పందం చేసుకోవాలా?

అవును, MLI లు ఈ స్కీం కొరకు NCGTC కు ఒక అండర్టేకింగ్ సమర్పించాలి.

 

25. గ్యారంటీ కొరకు అభ్యర్ధించినప్పుడు గ్యారంటీ ఇచ్చిన మొత్తాన్ని MLI లకు NCGTC ఎలా చెల్లిస్తుంది?

సంబంధిత MLI కోరినప్పుడు, అర్హత కల క్లెయిము చేసిన 30 రోజుల్లోగా గ్యారంటీడ్ మొత్తంలో 75% మొత్తాన్ని NCGTC చెల్లిస్తుంది. మిగిలిన 25% రికవరీ ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత లేదా ఒప్పందం గడువు తీరిన తర్వాత, ఏది త్వరగా అయితే ఆ సమయానికి చెల్లించబడుతుంది.

 

26. ECLGS కు సవివర నిర్వహణ మార్గదర్శకాలను ఎవరు జారీ చేస్తారు, మరియు స్కీం/నిర్వహణ మార్గదర్శకాలలోని ప్రొవిజన్లను మార్చే అధికారం ఎవరికి ఉంటుంది?

ఈ స్కీంకు NCGTC సవివర నిర్వహణ మార్గదర్శకాలను జారీచేసింది. ECLGS నిధుల యాజమాన్య కమిటీకి స్కీం/నిర్వహణ మార్గదర్శకాల ప్రస్తుత నిర్మాణాన్ని మార్చడానికి అధికారం ఉంటుంది.

 

27. నేనొక వ్యాపార సంస్థను నడుపుతున్నాను, మరియు నాకు GST రిజిస్ట్రేషన్ ఉంది. అయితే, నేను MSME గా రిజిస్టర్ చేయబడలేదు లేదా నాకు ఉద్యోగ్ ఆధార్ లేదు. మా బ్యాంకు కూడా నన్ను MSME ఋణగ్రహీతగా వర్గీకరించలేదు. నేను ఈ స్కీం క్రింద అర్హత కలిగి ఉంటానా?

మీరు ఈ క్రింది సందర్భాల్లో అర్హత కలిగి ఉంటారు

  • మీరు 2020, ఫిబ్రవరి 29 నాటికి రూ. 25 కోట్ల కంటే తక్కువ ఔట్స్టాండింగ్ను కలిగి ఉండాలి.
  • 2019-20 ఆర్ధిక సంవత్సరానికి మీ టర్నోవర్ రూ. 100 కోట్లకు లోపు ఉండాలి.
  • మీకు GST రిజిస్ట్రేషన్ ఉంది లేదా అట్టి GST రిజిస్ట్రేషన్ ఉద్యోగ్ ఆధార్ పొందాల్సిన అవసరం రాలేదు లేదా ఈ స్కీం క్రింద MSME గా గుర్తింపు కలిగిన్ ఉండాల్సిన అవసరం రాలేదు

 

28. స్కీం ప్రకారం 20% అందించాల్సి ఉన్నా నా బ్యాంక్/ NBFC నాకు 15% మాత్రమే ప్రీ-అప్రూవ్డ్ లోన్ను అందిస్తుంది. బ్యాంక్/ NBFC అలా చేయవచ్చా?

ECLGS క్రింద, బ్యాంకులు/ NBFC లు 20% వరకు ఋణాన్ని అందించవచ్చు. కాబట్టి వాస్తవానికి అందించే ఋణం 20% కంటే తక్కువగా ఉండవచ్చు. ఇది సాధారణంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఆధారంగా ఋణగ్రహీత మరియు ఋణమిస్తున్న సంస్థ పరస్పరం అంగీకరించిన నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

 

29. నేనొక రిటెయిల్ షాపు నడుపుతున్నాను. ఈ కవరేజీకి నాకు అర్హత ఉంటుందా?

 27 వ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చూడండి.

 

30. నేను ఒక ఋణాలిచ్చే వ్యాపారాన్ని నడుపుతున్నాను. నాకు అర్హత ఉంటుందా?

ఉండదు. సాధారణంగా ఋణాలిచ్చే సంస్థలు డబ్బును, ఋణం, రీఫైనాన్స్, ఆస్తుల కొనుగోలు, సెక్యూరిటైజేషన్, అసైన్మెంట్లు మొదలైన వాటి ద్వారా బ్యాంకులు / NBFC ల నుండి పొందుతాయి. పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీం మరియు స్పెషల్ లిక్విడిటీ సదుపాయాలతో సహా ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

 

31. అన్ని NBFC లు NCGTC తో MLI లు కావడానికి అర్హత కలిగి ఉంటాయా?

ఉండవు. NBFC తప్పనిసరిగా RBI తో రిజిస్టర్ అయి ఉండాలి, RBI సూచించిన విధంగా CRAR ఆవశ్యతలకు తగినట్లు ఉండాలి మరియు 2020 ఫిబ్రవరి 29 నాటికి కనీసం రెండేళ్ళ నుండి ఋణాలిచ్చే వ్యాపారంలో ఉండి ఉండాలి. స్కీం యొక్క యాజమాన్య కమిటీ ఎప్పటికప్పుడు అదనపు అర్హతాఅ ప్రమాణాలను సూచించవచ్చు.

 

32. క్లెయిం సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలి?

ఇది రాబోయే కాలంలో జారీ చేయబడే అదనపు మార్గదర్శకాల ద్వారా తెలుపబడుతుంది.

 

33. క్రొత్త MSME ఋణ గ్రహీతలు ఈ స్కీం క్రిందికి వస్తారా?

ECLGS స్కీం అనేది 2020, ఫిబ్రవరి 29 నాటికి బ్యాంకుల పుస్తకాలలో ఉన్న అప్పటికే ఉన్న ఋణగ్రహీతలకు మాత్రమే. క్రొత్త ఋణ గ్రహీతలెవరైనా CGTMSE మరియు NCGTC స్కీంల క్రిందికి వస్తారు

 

34. సంస్థ మరియు ప్రమోటర్ల లేదా డైరెక్టర్ మధ్య కో-అప్లికెంట్ ఋణాలు ఈ స్కీం క్రిందికి వస్తాయా?

కో అప్లికెంట్ ఉండే ఋణాలకు, అదనపు అత్యవసర నిధుల కొరకు ప్రధాన దరఖాస్తుదారుగా సంస్థ ఉన్న మనుగడలోని ఋణాలు మాత్రమే ఈ స్కీం క్రిందికి వస్తాయి

 

35. MSME ఋణగ్రహీతలకు అందించే ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఋణాలు ఈ స్కీంలో భాగంగా పరిగణించబడతాయా?

పరిగణించబడవు, ఈ స్కీం, ఆఫ్-బ్యాలెన్స్ షీట్ తో ఎక్స్పోజర్కు వర్తించదు. 2020, ఫిబ్రవరి 29 నాటికి బ్యాలెన్స్ షీట్లో చూపించిన ఔట్స్టాండింగ్లు మాత్రమే ఈ స్కీం క్రిందికి వస్తాయి.

 

36. ఈ స్కీం క్రింద ఋణాలకు వడ్డీరేటు ఎలా నిర్ణయించబడుతుంది?

2019, సెప్టెంబర్ 04 మరియు 2020, ఫిబ్రవరి 26 వ తేదీన అమలులోనికి వచ్చిన RBI మార్గదర్శకాల ప్రకారం, MSME లు కలిగి ఉండే అన్ని ఋణాలు వెలుపలి బెంచ్మార్క్ రేట్లలో ఒకదానికి బెంచ్మార్క్ చేయబడాలి. ఆమోదించిన విధానాల ప్రకారం బాహ్య బెంచ్మార్క్కు మించి ఎంత ఇవ్వాలో అనేదానిపై బ్యాంకులు నిర్ణయించుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా, ECLGS క్రింద అందించబడే ఋణాలు, పైన పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాయి మరియు బాహ్య బెంచ్మార్క్ రేట్లకు లింక్ చేయబడి ఉంటాయి.

ఈ స్కీంలో భాగంగా మొత్తంగా వడ్డీ రేటు, బాహ్య బెంచ్మార్క్ లెండింగ్ రేటు కంటే 1% మాత్రమే ఎక్కువ ఉండేలా లేదా సంవత్సరానికి 9.25% గా, ఏది తక్కువగా ఉంటే దానిగా పరిమితి విధించబడింది. బాహ్య రేట్లకు బెంచ్మార్క్ చేయబడటానికి అనుమతించబడని ఋణాలకు వడ్డీ రేటు గరిష్టంగా 9.25% ఉంటుంది.

 

ఉదాహరణకు ABC బ్యాంకుకు, బాహ్య బెంచ్మార్క్ వడ్డీరేటు 7.80 % ఉంది; అంటే. RBI రెపోరేటు (4.0%)

+ స్ప్రెడ్ (3.80%). ఈ స్కీం కోసం వడ్డీ రేటు ఈ సందర్భంలో కనీసం (7.8% + 1%

= 8.8% మరియు 9.25%) = 8.8% గా ఉంటుంది.

<pఉదాహరణకు ABC1 బ్యాంకుకు, బాహ్య బెంచ్మార్క్ వడ్డీరేటు 8.50 % ఉంది; అంటే. RBI రెపోరేటు (4.0%) + స్ప్రెడ్ (4.50%). ఈ స్కీం కోసం వడ్డీ రేటు ఈ సందర్భంలో కనీసం (8.5%

+ 1% = 9.5% మరియు 9.25%) = 9.25% గా ఉంటుంది.

 

37. నేను రిజిస్టర్డ్ MSME కాదు కానీ ఒక సాధారణ/రిటెయిల్ వ్యాపారాన్ని నడుపుతున్నాను. 2020, ఫిబ్రవరి 29 నాటికి నా ఖాతా NPA గా ఉంది. ECLGS కు నాకు అర్హత ఉంటుందా?

NPA అయిన ఖాతాలు లేదా బకాయిలు 60 రోజులు దాటినవి (SMA-II), ECLGS క్రింద అర్హత కలిగి ఉండవు.

 

38. ఒక NBFC అయిన నా ఋణసంస్థ, ఋణానికి 15% ఛార్జీని ప్రతిపాదిస్తుంది. ఇది అనుమతించబడుతుందా?

NBFC ఋణసంస్థ 14% కంటే అధిక వడ్డీని విధించగలదు, అయితే అట్టి ఋణం గ్యారంటీ కవరేజీకి అర్హత కలిగి ఉండదు.

 

39. ఈ స్కీం క్రింద గ్యారంటీ ఇచ్చే ప్రక్రియ ఎలా ఉంటుంది?

ECLGS క్రింద గ్యారంటీ ఇవ్వడానికి మేము వృద్ధి చేసిన సిస్టం ప్రకారం, స్కీం మార్గదర్శకాల ప్రకారం అర్హత కల ఋణగ్రహీతకు మంజూరు చేసిన లోన్ వివరాలను ఋణ సంస్థ ఎంటర్ చేస్తే, సిస్టం దానంతతదే గ్యారంటీని ఆమోదిస్తుంది మరియు దానికి అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ మరియు క్రెడిట్ గ్యారంటీ నంబర్ను ఋణసంస్థకు అందించడం జరుగుతుంది, ఆ తర్వాత అవసరమైనప్పుడు ఋణ సంస్థలు వీటిని రిఫరెన్సుగా ఉపయోగించవచ్చు.

గ్యారంటీ అప్లికేషన్ వేసేటప్పుడు ఏ డాక్యుమెంట్లు అడగలేదు.

 

40. ఒక పూల్ క్రింద కొనుగోలు చేయబడిన పోర్ట్ఫోలియో / క్లయింట్లు ఈ స్కీం క్రింద అర్హత కలిగి ఉంటారా?

నిర్దిష్ట వ్యవధిలో ఒక మనుగడలో ఉన్న ఋణసంస్థ అందించే అదనపు ఋణానికి గ్యారంటీ ఉంది. ఈవిధంగా, స్కీం మార్గదర్శకాల ప్రకారం ఋణగ్రహీతలు అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే, ఎవరి పుస్తకంపై అయితే ఈ ఋణగ్రహీతలు ఈ సదుపాయాలను అందించగలరో అట్టి ఋణ సంస్థలు ఈ స్కీం క్రింద అర్హత కలిఫి ఉంటాయి. 2020, ఫిబ్రవరి 29 నాటికి బకాయి ఉన్న మొత్తంలో 20% మొత్తం, ECLGS క్రింద ఋణంగా పొందటానికి అర్హత కలిగి ఉంటుందని గమనించాలి. పూల్ని కొనుగోలు చేసే కొనుగోలుదారు ఈ స్కీం క్రింద ఒక MLI అయి ఉండాలి.

 

41. అర్హులైన క్లయింట్లకు ఈ స్కీం క్రింద క్రెడిట్ సదుపాయం / ఋణం వచ్చిన తర్వాత ఈ ఋణాలు అసైన్ చేయబడవచ్చా లేదా సెక్యూరిటైజేషన్కు అర్హత కలిగి ఉంటాయా?

ECLGS క్రింద అందించబడే సదుపాయాలు సెక్యూరిటైజేషన్కు అర్హత కలిగి ఉంటాయి. ఈ సదుపాయాన్ని ఒక ప్రత్యేక లోన్ అకౌంట్గా తెరవాలి కావున దీనిని సెక్యూరిటీ ఉద్దేశాల కొరకు సాధారణ ఋణాలతో పాటు పరిగణించవచ్చు. ఇతర అర్హత నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి.

 

42. అసలు ఋణం అన్సెక్యూర్డ్ ఋణం అయినప్పుడు (అంటే ప్రైమరీ లేదా కోలేటరల్ సెక్యూరిటీ ఏదీ లేనప్పుడు), ECLGS స్కీంకు వర్తించినట్లు 3 నెలల్లోగా ఛార్జ్ను ఏర్పాటు చేయడం అవసరమా?

తీసుకున్న ఋణం స్వభావ రీత్యా అన్సెక్యూర్డ్ ఋణం అయినప్పుడు, ఏ ఛార్జీని ఏర్పటుచేయనవసరం లేదు/అందించనవసరం లేదు.

 

43. రిటెయిల్ ఆర్ధిక రంగంలో, ఒక సంస్థ నుండి మరొక సంస్థకు ఋణాల బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం సాధారణమే. ఈ కస్టమర్లు ఈ స్కీంకు అర్హతను కలిగి ఉంటారా?

స్కీం మార్గదర్శకాల ప్రకారం నిర్వచించబడిన ప్రమాణాల ఆధారంగా ఋణాన్ని తనమీదికి తీసుకుంటున్న ఋణసంస్థ అర్హత కలిగి ఉంటే ఋణాన్ని ఒక ఋణసంస్థ నుండి మరోదానికి బదిలీ చేస్తే అది కస్టమర్ను అనర్హుణ్ణి చేయదు లేదా ఈ స్కీం క్రింద అట్టీ కస్టమర్ కలిగి ఉండే గరిష్ట ఋణ అర్హతను తగ్గించి వేయదు.

ఈ స్కీం క్రింద మొత్తం ఋణం 2020, ఫిబ్రవరి 29 నాటికి ఉన్న మొత్తం బకాయి వద్ద పరిమితి కలిగి ఉంటుందని MLI లు గ్రహించాలి

 

44. HFC యొక్క MSME కస్టమర్ ఈ స్కీంకు అర్హత కలిగి ఉంటారా?

HFC యొక్క MSME పోర్ట్ఫోలియో అర్హత కలిగి ఉంటుంది. ఇతర అర్హత నిబంధనలన్నీ కలిగి ఉంటే MSME లోన్లు అన్నీ అర్హత కలిగిన అన్ని సంస్థలకు అందించబడాలి.

 

45. ఋణసంస్థ నుండి పొందవలసిన NOC మరియు అండర్-టేకింగ్ ఏ ఫార్మాట్లో ఉండాలి?

ఈ స్కీం క్రింద ఏ ఫార్మాటును సూచించడం జరగలేదు. MLIలు ఇప్పటి వరకు అనుసరిస్తున్న దానిని ఉపయోగించవచ్చు.

 

46. ఈ స్కీం క్రింద గ్యారంటీ స్వభావం ఎలా ఉంటుంది?

NCGTC నుండి క్రెడిట్ గ్యారంటీకు పరిమితులు ఉండవు వెనుకకు తీసుకోవడం వీలుపడదు.

 

47. స్కీం క్రింద గ్యారంటీ కవర్ అందించబడుతున్న ఋణాలకు కేటాయించబడే రిస్క్ వెయిట్ ఎంత ఉంటుంది?

ECLGS యొక్క భారత ప్రభుత్వ స్కీం ప్రకారం, సభ్యులైన ఋణసంస్థలు అందించే ఋణాలకు మరియు ప్రతిపాదిత స్కీం క్రిందికి వచ్చే ఋణాలకు 100% గ్యారంటీ కవర్ అందించబడుతుంది. అట్టి ఋణాలకు జీరో రిస్క్ వెయిటేజీ కేటాయించమని భారత ప్రభుత్వం RBI ను ఇప్పటికే కోరింది.

 

48. గ్యారంటీ ఇచ్చే సమయానికి అర్హత కలిగిన ఋణగ్రహీతలకు ఈ స్కీం క్రింద గ్యారంటీ అందించబడుతుంది. అయితే, అన్ని MLI ల నుండి కలిపి సదరు ఋణగ్రహీత పొందిన ఋణం రూ.25 కోట్లకు మించి ఉంది, లేదా వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు మించి ఉంది. అటువంటి సందర్భంలో ఇచ్చిన గ్యారంటీ నిరర్ధకం అవుతుందా?

కాదు, నిరర్ధకం కాదు. ఋణాన్ని మంజూరు చేసేటప్పుడు అర్హతను గుర్తించడం జరుగుతుంది. MLI లు ఇచ్చిన అండర్టేకింగ్ లోని క్లాజ్ 6 ఇందును బట్టి తొలగించబడుతుంది.

 

49.నాకు ఇంకా ఏవైనా ప్రశ్నలుంటే వాటికి సమాధానం ఎవరు ఇవ్వగలరు?

 మీ ప్రశ్నలు/సలహాలను ceo@ncgtc.inకు వ్రాయండి

 

- Source: NCGTC Website